AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan: నర్సుల సేవలను ప్రత్యేకంగా గుర్తించాలి.. రెండు నెలల వేతనం అదనంగా ఇవ్వాలిః పవన్ కళ్యాణ్

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నర్సులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా కష్టకాలంలో నర్సులను ప్రత్యేకంగా గుర్తించి రెండు నెలల వేతనాన్ని బోనస్‌గా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

Pawan Kalyan: నర్సుల సేవలను ప్రత్యేకంగా గుర్తించాలి.. రెండు నెలల వేతనం అదనంగా ఇవ్వాలిః పవన్ కళ్యాణ్
Balaraju Goud
|

Updated on: May 12, 2021 | 12:52 PM

Share

Pawan Kalyan Expresses Gratitude to Nurses: అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నర్సులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా కష్టకాలంలో నర్సులను ప్రత్యేకంగా గుర్తించి రెండు నెలల వేతనాన్ని బోనస్‌గా ఇవ్వాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. కరోనాతో భయాందోళనల్లో ఉన్న రోగులందరికీ నర్సులు అందిస్తున్న సేవలు గుర్తించి, గౌరవించాలన్నారు. రోగులకు వైద్య చికిత్స అందించే సమయంలో ఎంతో సహనంతో, కరుణతో సపర్యలు అందిస్తున్న సిస్టర్ల త్యాగం మానవీయమైనదని పవన్ కళ్యాణ్ కొనియాడారు. కరోనాతో ప్రపంచం అల్లకల్లోలమైపోతున్న నేటి విపత్కర పరిస్థితుల్లో తమ ప్రాణాలను లెక్కకుండా, కుటుంబసభ్యులను రిస్క్‌లో పెట్టి రోగుల ప్రాణాలను కాపాడేందుకు వైద్య సేవలందిస్తున్న నర్సుల రుణం తీర్చుకోలేనిదని జనసేనాని అన్నారు.

కోవిడ్, ఐసీయూ వార్డుల్లో వైద్యులతో సమానంగా సాహసోపేతంగా విధులు నిర్వహిస్తున్న నర్సుల సేవలు చిరస్మరణీమన్నారు. గంటల తరబడి పీపీఈ కిట్లు ధరించి రోగుల ప్రాణాలను కాపాడేందుకు శ్రమిస్తున్న నర్సులను ప్రభుత్వం ప్రత్యేకంగా గుర్తించాల్సిన అవసరముందన్నారు. అంతేకాదు వారందరికీ ప్రోత్సహకరంగా ఉండేలా రెండు నెలల వేతనాన్ని అదనంగా ఇవ్వాలని జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా వారికిచ్చే ఓ కానుకగా భావించాలన్నారు.

Read Also… నేపాల్ లో విజృంభించిన కరోనా వైరస్ , 24 గంటల్లో 9 వేలకు పైగా కేసులు, ఖాట్మండు లో రోగులతో క్రిక్కిరిసిన ఆసుపత్రులు