CORONA VACCINATION: తెలుగు రాష్ట్రాల్లో ఊపందుకుంటున్న వ్యాక్సినేషన్.. తెలుగు రాష్ట్రాల్లో 1.29 కోట్ల డోసుల పంపిణీ

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ సెకెండ్ వేవ్ శరవేగంగా విస్తరిస్తూ.. వేలాది మందిని పొట్టన పెట్టుకుంటున్న తరుణంలో వైరస్ వ్యాప్తికి బ్రేక్ వేసేది వ్యాక్సిన్ మాత్రమేనని అందరు నమ్ముతున్నారు. ఇదే అభిప్రాయాన్ని ప్రపంచ దేశాలు...

CORONA VACCINATION: తెలుగు రాష్ట్రాల్లో ఊపందుకుంటున్న వ్యాక్సినేషన్.. తెలుగు రాష్ట్రాల్లో 1.29 కోట్ల డోసుల పంపిణీ
Ap, Ts Maps With Corona Vaccination + Kcr & Jagan Images
Follow us
Rajesh Sharma

| Edited By: Team Veegam

Updated on: May 12, 2021 | 11:27 PM

CORONA VACCINATION SPEEDED-UP IN TELUGU STATES: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ (CORONA VIRUS) సెకెండ్ వేవ్ (SECOND WAVE) శరవేగంగా విస్తరిస్తూ.. వేలాది మందిని పొట్టన పెట్టుకుంటున్న తరుణంలో వైరస్ వ్యాప్తికి బ్రేక్ వేసేది వ్యాక్సిన్ (VACCINE) మాత్రమేనని అందరు నమ్ముతున్నారు. ఇదే అభిప్రాయాన్ని ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో వ్యక్తం చేస్తున్నాయి. దేశీయంగా కూడా వ్యాక్సిన్ల ఉత్పత్తిని గణనీయంగా పెంచి.. పంపిణీని వేగవంతం చేసే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్రాలు శ్రమిస్తున్నాయి. దాంతో ఏప్రిల్ నెలాఖరుతో పోలిస్తే.. దేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తి (VACCINE PRODUCTION) బాగా పెరిగింది. అదే సమయంలో పంపిణీ కూడా వేగవంతం అయ్యింది. నిజానికి మార్చి నెలాఖరులో వ్యాక్సిన్ వేయించుకునేందుకు భయపడిన వారు కూడా ఇపుడు వ్యాక్సిన్ వేయించుకునేందుకు క్యూ కడుతున్నారు. దానికి కారణం కరోనా సెకెండ్ వేవ్ మరింత దారుణంగా వుండడమే. సెకెండ్ వేవ్ ఉధృతమైన దరిమిలా వ్యాక్సిన్‌పై జనాల్లో భరోసా పెరిగిన సంకేతాలు తాజా గణాంకాలను చూస్తే స్ఫష్టమవుతోంది.

తెలుగు రాష్ట్రాలలో (TELUGU STATES) తాజాగా వ్యాక్సినేషన్ (VACCINATION) కోటి అంకెను దాటేసింది. ఏప్రిల్ నెలలో ఇదే సమయంతో పోలిస్తే దాదాపు పది రెట్లు వేగంగా వ్యాక్సిన్ పంపిణీ జరుగుతందనడానికి తాజాగా మే 12న వెల్లడైన గణాంకాలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. మే 12 ఉదయం వరకు తెలుగు రాష్ట్రాలలో కోటి 29 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్ చేరింది. మే 12వ తేదీనాటికి తెలంగాణ (TELANGANA) వ్యాప్తంగా 54 లక్షల 7 వేల 549 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ జరిగింది. ఇందులో 44 వేల 22 వేల 864 మంది వ్యాక్సిన్ తొలి డోసు వేసుకోగా.. 9 లక్షల 84 వేల 685 మంది రెండో డోసు వ్యాక్సిన్ తీసుకున్నారు. వ్యాక్సినేషన్ ప్రారంభమైన తొలి రోజుల్లో ప్రజల్లో విశ్వాసం లేకపోవడంతో పంపిణీ నత్తనడకన సాగింది. దానికి తోడుగా కేంద్ర ప్రభుత్వం (UNION GOVERNMENT) ఇచ్చిన సూచనలను రాష్ట్రాలు తొలి రోజుల్లో పెద్ద సీరియస్‌గా తీసుకోకపోవడం కూడా వ్యాక్సిన్ పంపిణీ స్లోగా జరగడానికి కారణమైంది.

అటు ఏపీ (AP)లోను వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతమైంది. ఆంధ్రప్రదేశ్ (ANDHRA PRADESH) రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 74 లక్షల 66 వేల 373 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఇందులో తొలి డోసు (FIRST DOSE_ తీసుకున్న వారి సంఖ్య 54 వేల 51 వేల 253 మంది కాగా.. 20 లక్షల 15 వేల 120 మంది రెండో డోసు (SECOND DOSE) వ్యాక్సిన్ తీసుకున్నారు. అయితే.. తాజా పరిస్థితుల కారణంగా తెలుగు రాష్ట్రాలు పాక్షిక లాక్ డౌన్ (PARTIAL LOCK-DOWN), కర్ఫ్యూ (CURFEW) నిర్ణయాలను తీసుకున్నాయి. తెలంగాణలో మే 22వ తేదీ దాకా ప్రతీ రోజు ఉదయం 10 గంటల నుంచి తెల్లవారి ఉదయం 6 గంటల దాకా లాక్ డౌన్ అమల్లో వుండబోతోంది. కేవలం 4 గంటల పాటే నిత్యావసరాలు సహా వస్తువుల కొనుగోలుకు ఛాన్సిచ్చింది తెలంగాణ ప్రభుత్వం (TELANGANA GOVERNMENT). అటు ఏపీలో లాక్ డౌన్ అనలేదు కానీ దాదాపు అదే పరిస్థితి. ప్రతీ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి తెల్లవారి ఉదయం 5 గంటల దాకా ఏపీలో కర్ఫ్యూ అమల్లో వుంది. ఇది మే 16వ తేదీ దాకా అమల్లో వుండబోతోంది. ఆ తర్వాత పరిస్థిని బట్టి ఏపీ ప్రభుత్వం (AP GOVERNMENT) నిర్ణయం తీసుకోబోతోంది.

లాక్ డౌన్ లేదా కర్ఫ్యూ కారణంగా వ్యాక్సిన్ పంపిణీకి విఘాతం వాటిల్లే అవకాశం వుందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇదే తరుణంలో వ్యాక్సినేషన్ ప్రక్రియకు విఘాతం కలుగ కుండా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాధినేతలు ఆదేశాలు జారీ చేశారు. ఏపీకి 18 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులు పంపించాల్సిందిగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (AP CHIEF MINISTER YS JAGAN MOHAN REDDY) కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. దానికింకా కేంద్రం నుంచి స్పందన రాలేదు. ఇటు మే 11వ తేదీన సమావేశమైన తెలంగాణ కేబినెట్ (TELANGANA CABINET) వ్యాక్సిన్ కొనుగోలుకు గ్లోబల్ టెండర్ల (GLOBAL TENDERS)కు వెళ్ళాలని నిర్ణయించింది. అయితే.. ఈ గ్లోబల్ టెండర్ల ప్రక్రియకు కేంద్రం నుంచి ఎలాంటి స్పందన వ్యక్తమవుతుందో ఇంకా తేలలేదు. ఎందుకంటే.. కరోనా వ్యాక్సిన్ తయారీలో అతి పరిమితమైన సంఖ్యలో సంస్థలున్నాయి. అంతర్జాతీయంగా ఉత్పత్తి అవుతున్న వ్యాక్సిన్లకు దేశంలో వినియోగానికి ఇంకా పూర్తి స్థాయి అనుమతులు రాలేదు. రష్యాకు చెందిన స్పుత్నిక్ వీ (SPUTNIC V) వ్యాక్సిన్‌కు అనుమతి లభించినా.. దాని భాగస్వామ్య సంస్థ రెడ్డీస్ లాబోరేటరీస్ (REDDY LABORATORIES_ ఇంకా పెద్ద ఎత్తున ఉత్పత్తికి సిద్దం కాలేదు. దాంతో స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ దేశీయంగా అందుబాటులోకి రాలేదు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా టెండర్లు పిలిచినా తెలంగాణ ప్రభుత్వానికి ఏ మేరకు సానుకూల స్పందన వ్యక్తమవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.

ALSO READ: మళ్ళీ కుదేలవుతున్న విమానయాన రంగం.. సెకెండ్ వేవ్ దెబ్బకు ఢమాల్

పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
మార్కెట్ లో పసిడి కాంతులు.. బంగారానికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్
మార్కెట్ లో పసిడి కాంతులు.. బంగారానికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
మీ ఇంట్లో పాత ఎల్ఐసీ బాండ్ ఉందా..? ఇలా చేస్తే సొమ్ము వాపస్
మీ ఇంట్లో పాత ఎల్ఐసీ బాండ్ ఉందా..? ఇలా చేస్తే సొమ్ము వాపస్
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..