నేపాల్ లో విజృంభించిన కరోనా వైరస్ , 24 గంటల్లో 9 వేలకు పైగా కేసులు, ఖాట్మండు లో రోగులతో క్రిక్కిరిసిన ఆసుపత్రులు

నేపాల్ లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. గత 24 గంటల్లో 9.483 కేసులు నమోదు కాగా 225 మంది రోగులు మరణించారు. నేపాల్ అంతటా సెకండ్ వేవ్ కోవిద్ వ్యాపించింది. కొన్ని రోజులుగా రోజూ దాదాపు ....

నేపాల్ లో విజృంభించిన కరోనా వైరస్ , 24 గంటల్లో 9 వేలకు పైగా కేసులు, ఖాట్మండు లో రోగులతో  క్రిక్కిరిసిన ఆసుపత్రులు
Nepal Records Highest Coronavirus Cases
Umakanth Rao

| Edited By: Team Veegam

May 12, 2021 | 11:27 PM

నేపాల్ లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. గత 24 గంటల్లో 9.483 కేసులు నమోదు కాగా 225 మంది రోగులు మరణించారు. నేపాల్ అంతటా సెకండ్ వేవ్ కోవిద్ వ్యాపించింది. కొన్ని రోజులుగా రోజూ దాదాపు 8 వేలకేసులు నమోదవుతున్నాయి. 30 మిలియన్ల మంది ప్రజలున్న ఈ దేశంలో అది అత్యధికమని అంటున్నారు., ఖాట్మండు తదితర అన్ని సిటీల్లో ఆసుపత్రులు రోగులతో క్రిక్కిరిసి ఉన్నాయి. ఆక్సిజన్, మందులు వంటివాటి కొరత తీవ్రంగా ఉందని అధికారులు అంగీకరిస్తున్నారు. అటు సుప్రీంకోర్టు కూడా వీటి అత్యవసర సరఫరాకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఫెడరల్, ప్రొవిన్షియల్ ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ నెల 21 కల్లా ఏయే చర్యలు తీసుకున్నారో వివరించాలని కోరింది. ఈ మేరకు లిఖిత పూర్వక సంజాయిషీ ఇవ్వాలని సూచించింది. నేపాల్ లో ఇప్పటివరకు 4,084 మంది రోగులు మృతి చెందారు. కేసుల సంఖ్య 413,111కి పెరిగింది. 24 గంటల్లో 5 వేలమందికి పైగా రోగులు కోలుకున్నారని నేపాల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 97 వేలకు పైగా యాక్టివ్ కేసులున్నట్టు పేర్కొంది. కొత్త కేసుల్లో ఒక్క ఖాట్మండులోనే అత్యధికంగా (3,927) కేసులు ఉన్నట్టు ఈ శాఖ అధికారులు తెలిపారు.

ఇలా ఉండగా చైనా ..ఈ దేశాన్ని ఆదుకునేందుకు ముందుకు వచ్చింది. నేపాల్ కు 400 ఆక్సిజన్ సిలిండర్లను, 160 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను, 10 వెంటిలేటర్లను అందజేసింది. 20 వేల ఆక్సిజన్ సిలిండర్లను కూడా పంపుతామని హామీ ఇచ్చింది. కాగా ప్రతినిధుల సభలో జరిగిన బల పరీక్షలో ఓడిపోయిన ప్రధాని కె.పి.శర్మ ఓలి…తమ దేశాన్ని వెంటనే ఆదుకోవాలంటూ బ్రిటన్ తదితర దేశాలను అభ్యర్థించారు.
మరిన్ని చదవండి ఇక్కడ : Viral Video : నాగుపామా..? అయితే నాకేంటి…షాకిచ్చిన బామ్మ.వామ్మో ఈ బామ్మ ధైర్యం చుస్తే షాక్ అవ్వాల్సిందే..(వీడియో).

viral video : చెన్నై స్టేషన్ లోని పోలీసులు డాన్స్ లు ..తప్పు అయ్యినప్పటికీ ట్వీబుల్ నుండి ప్రసంశలు వెల్లువా వైరల్ అవుతున్న వీడియో

 


లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu