Covid-19: నెల అయింది.. కోలుకున్నా బెడ్లు ఖాళీ చేయరా..? కరోనా రోగులపై సీఎం ఆగ్రహం..

Covid-19 patients: దేశంలో కరోనావైరస్ విజృంభిస్తోంది. ప్రతిరోజూ మూడు లక్షలకు పైగా కేసులు, నాలుగు వేలకు పైగా మరణాలు నమోదవుతున్నాయి. ఈ తరుణంలో ఆసుపత్రుల్లో

Covid-19: నెల అయింది.. కోలుకున్నా బెడ్లు ఖాళీ చేయరా..? కరోనా రోగులపై సీఎం ఆగ్రహం..
కర్ణాటక బీజేపీ సీనియర్‌ నేత, పార్టీకి ఎంతో నమ్మకస్తుడైన బీఎస్‌ యెడియూరప్ప సీఎం పదవిని నాలుగుసార్లు చేపట్టారు. అయితే ఏ ఒక్కసారి కూడా పూర్తి కాలం ముఖ్యమంత్రి పదవిలో ఆయన కొనసాగలేదు. యడియూరప్ప సీఎం పదవికి నాలుగుసార్లు రాజీనామా చేయడానికి దారితీసిన కారణాలను పరిశీలిస్తే.. 2007లో.. ఎనిమిది రోజులు సీఎంగా యెడ్డీ.. 2006 జనవరిలో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి జేడీ(ఎస్‌) తన మద్దతు ఉపసంహరించింది. ఆ ప్రభుత్వం కూలిపోవడంతో జేడీ(ఎస్‌), బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 12, 2021 | 12:23 PM

Covid-19 patients: దేశంలో కరోనావైరస్ విజృంభిస్తోంది. ప్రతిరోజూ మూడు లక్షలకు పైగా కేసులు, నాలుగు వేలకు పైగా మరణాలు నమోదవుతున్నాయి. ఈ తరుణంలో ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య భారీగా పెరుగుతోంది. దీంతో ఆసుపత్రుల్లో బెడ్లు లేక, ఆక్సిజన్ లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా కొంతమంది కరోనా బాధితులు మహమ్మారి నుంచి కోలుకున్నా ఇళ్లకు వెళ్లడం లేదు. వారు రోజుల తరబడి ఆసుపత్రుల్లోనే ఉంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న కర్ణాటక ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే వారిని ఇళ్లకు వెళ్లిపోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా పలువురు రోగుల తీరుపై సీఎం యడియూరప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నాటకలోని శివాజీనగరలో మంగళవారం కోవిడ్‌ కేర్ సెంటర్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలువురు రోగుల వివరాలను చూసి ఆగ్రహం వ్యక్తంచేశారు.

సుమారు 332 మంది రోగులు 30 రోజులుగా ఆసుపత్రిలో ఉండి కోలుకున్నారు. మొత్తం 503 మంది 20 రోజులు ఆసుపత్రిలో ఉండి కోలుకున్నారు. అయితే వారంతా డిశ్చార్జ్‌ అయ్యే ఆలోచనలో లేనట్లు తెలుస్తోందని ముఖ్యమంత్రి యడియూరప్ప తెలిపారు. ఓ వైపు బెడ్ల కొరత ఉందని కోలుకున్న వారు వెంటనే ఆసుపత్రి నుంచి వెళ్లిపోవాలని యడియూరప్ప సూచించారు. టీకాలు వచ్చిన తక్షణమే అందరికీ వేయిస్తామని, గందరగోళం సృష్టించవద్దంటూ విజ్ఞప్తి చేశారు. కోవిడ్ వార్‌ రూంల సిబ్బంది సేవలు అభినందనీయమని ఈ సందర్భంగా యడియూరప్ప కొనియాడారు.

Also Read:

Google Pay: గూగుల్ పే యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇకపై అమెరికా నుంచి కూడా సేవలు..

ఇజ్రాయెల్, పాలస్తీనా రాకెట్ దాడిలో కేరళకు చెందిన మహిళ మృతి, భర్తతో వీడియో కాల్ లో మాట్లాడుతుండగా ఘటన