ఇజ్రాయెల్, పాలస్తీనా రాకెట్ దాడిలో కేరళకు చెందిన మహిళ మృతి, భర్తతో వీడియో కాల్ లో మాట్లాడుతుండగా ఘటన
ఇజ్రాయెల్ లో పని చేస్తున్న కేరళ వాసి ఒకరు పాలస్తీనా రాకెట్ దాడిలో మరణించారు. సౌమ్య అనే మహిళ నిన్న సాయంత్రం తమ రాష్టంలో ఉన్న తన భర్త సంతోష్ తో వీడియో కాల్ లో మాట్లాడుతుండగా ...
ఇజ్రాయెల్ లో పని చేస్తున్న కేరళ వాసి ఒకరు పాలస్తీనా రాకెట్ దాడిలో మరణించారు. సౌమ్య అనే మహిళ నిన్న సాయంత్రం తమ రాష్టంలో ఉన్న తన భర్త సంతోష్ తో వీడియో కాల్ లో మాట్లాడుతుండగా ఆమె ఇంటిపై రాకెట్ పడి ఇల్లు ధ్వంసమైంది. ఈ ఘటనలో సౌమ్య మరణించింది. 31 ఏళ్ళ సౌమ్య ఇజ్రాయెల్ లో ఏడేళ్లుగా పని చేస్తున్నట్టు తెలుస్తోంది. వీడియో కాల్ సందర్భంగా తన సోదరుడికి పెద్ద శబ్దం వినబడిందని, ఆ వెంటనే కాల్ కట్ అయిందని సంతోష్ సోదరుడు తెలిపారు.వెంటనే ఇజ్రాయెల్ లో పని చేస్తున్న ఇతర మలయాళీలను దీని గురించి ప్రశ్నించగా..వారు ఈ సంఘటనను వివరించారని ఆయన చెప్పారు. సౌమ్య ఆ దేశంలో ఓ ఇంట్లో పనిమనిషిగా పని చేస్తున్నట్టు సమాచారం.ఆమె కేరళలోని ఇడుక్కి జిల్లా కీరితోడుకు చెందినదని తెలిసింది. ఇజ్రాయెల్ లో తమ రాష్ట్ర మహిళ ఒకరు మృతి చెందడాన్ని నేషనలిస్ట్ కాంగ్రెస్ కేరళ నేత మణి సి. కప్పన్ ఖండించారు. అమాయక ప్రజలను పొట్టన పెట్టుకుంటున్నారని ఆయన ఇజ్రాయెల్, పాలస్తీనా దళాలను దుయ్యబట్టారు. సౌమ్య, సంతోష్ దంపతులకు 9 ఏళ్ళ కొడుకు ఉన్నాడు. ఇజ్రాయెల్ లో వేలమంది మలయాళీలు పని చేస్తున్నారని, వారంతా అక్కడి యుధ్ధ వాతావరణంలో భయంభయంగా బతుకుతున్నారని కప్పన్ తన ఫేస్ బుక్ పోస్ట్ లో తెలిపారు. వారి భద్రతకుచర్యలు తీసుకునేలా భారత, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలనీ ఆయన కోరారు.
ఇజ్రాయెల్, పాలస్తీనా దళాల మధ్య కొన్ని రోజులుగా పోరు తీవ్రమైంది. హమాస్ నిన్న జెరూసలేమ్ పైకి 200 రాకెట్లను ప్రయోగించగా..ఇజ్రాయెల్ గాజా సిటీపై విమానాల ద్వారా బాంబులు కురిపించింది. మరిన్ని చదవండి ఇక్కడ : Viral Video : నాగుపామా..? అయితే నాకేంటి…షాకిచ్చిన బామ్మ.వామ్మో ఈ బామ్మ ధైర్యం చుస్తే షాక్ అవ్వాల్సిందే..(వీడియో).