AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhar Card: కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోవాలంటే.. ఆధార్ కార్డు తప్పనిసరిగా కావాలా..? ఈ వివరాలు తెలుసుకోండి.!

Aadhar Card Mandatory: దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ టీకా వేసేందుకు..

Aadhar Card: కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోవాలంటే.. ఆధార్ కార్డు తప్పనిసరిగా కావాలా..? ఈ వివరాలు తెలుసుకోండి.!
Aadhaar
Ravi Kiran
|

Updated on: May 12, 2021 | 4:40 PM

Share

79Aadhar Card Mandatory: దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ టీకా వేసేందుకు కేంద్రం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. జాతీయ టీకా కార్యక్రమంలో భాగంగా దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోందని.. కోవిన్ ప్లాట్‌ఫామ్‌లో పేర్కొన్న అన్ని ప్రోటోకాల్‌లను అనుసరించాలని ఆదేశించింది. ఇదిలా ఉంటే కోవిడ్ వ్యాక్సిన్ నమోదు కోసం ఆధార్ కార్డు వాడకంపై ప్రజల్లో ఇప్పటికీ కాస్త గందరగోళం ఏర్పడింది. దానికి సంబంధించిన విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కోవిడ్ వ్యాక్సిన్ కోసం ఎక్కడ రిజిస్టర్ చేసుకోవాలి.?

కోవిడ్ వ్యాక్సిన్ నమోదు కోసం www.cowin.gov.in లింక్‌ను ఉపయోగించి కో-విన్ పోర్టల్‌లోకి లాగిన్ కావాలి. అక్కడ “Register/Sign In yourself” ఆప్షన్ క్లిక్ చేసి వ్యాక్సినేషన్‌కు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

ఆధార్ కార్డు లేకుండా టీకా కోసం నమోదు చేసుకోవచ్చా.?

వ్యాక్సిన్ కోసం కోవిన్ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునేవారు ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ,పాన్ కార్డు, పాస్‌పోర్ట్, పెన్షన్ పాస్‌బుక్, NPR స్మార్ట్ కార్డ్, ఓటరు ఐడీ వంటి వాటిల్లో ఏదైనా ఐడీ ప్రూఫ్‌లు సమర్పించవచ్చు.

కాగా, వ్యాక్సిన్ నమోదుకు ఆధార్ కార్డుతో సహా మిగిలిన ఏదైనా ఐడీ ప్రూఫ్‌లు సమర్పించవచ్చు. కోవిన్ యాప్‌లో వ్యాక్సిన్ కోసం స్లాట్ బుక్ చేసుకోవడంతో పాటు మీ దగ్గరలోని టీకా కేంద్రాన్ని కూడా ఎన్నుకోవచ్చు. మరింకెందుకు ఆలస్యం…వెంటనే రిజస్ట్రార్‌ చేసుకోండి..కరోనాపై పోరులో వ్యాక్సిన్‌ కవచాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి.

Also Read:

హోం ఐసోలేషన్‌లో ఉన్న కరోనా బాధితులు.. ఏం చేయాలి.? ఏం చేయకూడదు.?

ఐపీఎల్ వాయిదా.. పలు ఫ్రాంచైజీలకు లాభం.. ఆ ఐదుగురు ప్లేయర్ల పునరాగమనం.!

Viral Video: ద్యావుడా.. బైక్‌పై ఇలా కూడా వెళ్తారా.. నవ్వు తెప్పిస్తున్న వీడియో..!

భారీ నాగపామును పట్టి బరాబరా ఈడ్చుకెళ్లిన బామ్మ.. నెటిజన్లు ఫిదా.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో.!