‘కోవిడ్ కోరలు చాస్తుంటే పాజిటివిటీపై ప్రాపగాండా’ , కేంద్రంపై రాహుల్ గాంధీ, ప్రశాంత్ కిషోర్ నిప్పులు, ఇది వంచనేనని వ్యాఖ్య

దేశంలో కోవిడ్ కేసులు కరాళ నృత్యం చేస్తుంటే ఇక్కడ, విదేశాల్లోనూ వస్తున్న విమర్శలను ఎదుర్కొనేందుకు ప్రధాని మోదీ ప్రభుత్వం ఓ కొత్త 'పొలిటికల్ ఫ్లాష్ పాయింట్'..'పాజిటివిటీ' మంత్రాన్ని...

  • Updated On - 2:14 pm, Wed, 12 May 21 Edited By: Anil kumar poka
'కోవిడ్ కోరలు చాస్తుంటే పాజిటివిటీపై ప్రాపగాండా' , కేంద్రంపై రాహుల్ గాంధీ, ప్రశాంత్ కిషోర్ నిప్పులు, ఇది వంచనేనని వ్యాఖ్య
Congress Leader Rahul Gandhi

దేశంలో కోవిడ్ కేసులు కరాళ నృత్యం చేస్తుంటే ఇక్కడ, విదేశాల్లోనూ వస్తున్న విమర్శలను ఎదుర్కొనేందుకు ప్రధాని మోదీ ప్రభుత్వం ఓ కొత్త ‘పొలిటికల్ ఫ్లాష్ పాయింట్’..’పాజిటివిటీ’ మంత్రాన్ని పఠిస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఆరోపించారు. ఇది ‘ఒకరి తలను ఇసుకలో కూర్చివేయడమే’నని,ప్రజలకు ద్రోహం చేయడమేనని ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు., దేశంలో వేలమంది కోవిద్ బాధితులు, హెల్త్ కేర్ వర్కర్లు తమ అత్యంత ఆప్తులను కోల్పోయి అల్లాడుతుంటే.. హాస్పిటల్స్ అన్నీ ఆక్సిజన్, ఇతర కోవిడ్ మందులు లేక దిక్కులు చూస్తుంటే ..ఈ తరుణంలో ‘పాజిటివిటీ థింకింగ్ అనడం జోక్ కాక మరేమిటని ఆయన ట్వీట్ చేశారు. ఇది ఒకరి తలను ఇసుకలోకి తోయడమే అని, ప్రజలను వంచించడమే అని వ్యాఖ్యానించారు. ఇక ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా ‘పాజిటివిటీ’ పేరిట తప్పుడు ప్రాపగాండా చేయడం అత్యంత దయనీయం, దారుణం అని ట్వీట్ చేశారు. మన చుట్టూ ఇన్ని విషాదాలు జరుగుతున్నాయని, దేశమంతా ట్రాజెడీ స్థితిలో ఉందని, కానీ ఈ పరిస్థితుల్లోనూ పాజిటివిటీ పేరిట ఫాల్స్ ప్రాపగాండా చేయడం చాలా హీనాతిహీనమని ఆయన అన్నారు. ప్రభుత్వం గుడ్డిగా చేస్తున్న ఈ ప్రచారానికి మనం పాజిటివ్ గా స్పందించాల్సిన అవసరం లేదన్నారు.

ఇండియాలో కోవిడ్ సెకండ్ వేవ్ ని హ్యాండిల్ చేయడంలో మోదీ ప్రభుత్వంపై దేశంలోనూ, విదేశాల్లోనూ పెద్దఎత్తున వస్తున్న విమర్శలను ఎదుర్కొనేందుకు బీజేపీ, దాని ;గురూజీ’ ఆర్ఎస్ఎస్ పాటిస్తున్న వ్యూహాన్ని ఖండిస్తూ వీరిద్దరూ ఇలా ట్వీట్ల వర్షం కురిపించారు.ప్రభుత్వం అనుసరిస్తున్న పాజిటివిటీ ‘వ్యూహాన్ని’ హైలైట్ చేసేందుకు గత వారం నిర్వహించిన వర్క్ షాప్ కు సంయుక్త కార్యదర్శి హోదాగల అధికారులతోఇ బాటు పలువురు కేంద్ర అధికారులను కూడా ఇందులో పాల్గొనేలా ప్రభుత్వం చూసింది. ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ రైళ్లను ఏర్పాటు చేశామని, ఇంకా ఎన్నో చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రులు ట్వీట్లు చేస్తూ వచ్చారు.ప్రధాని మోదీ తన మన్ కీ బాత్ లో పాజిటివిటీ గురించి ప్రస్తావించారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా..కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు రాసిన సుదీర్ఘ లేఖలో కోవిడ్ అదుపునకు బీజేపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోందో వివరించారు. ఇదే గాక .. ‘పాజిటివిటీ ఆన్ లిమిటెడ్’ పేరిట ఆర్ఎస్ఎస్.. ప్రముఖ మత గురువులు, పారిశ్రామికవేత్తలతో ఆన్ లైన్ ప్రసంగాలను టీవీ ద్వారా నిర్వహించాలని యోచిస్తోంది. ఈ సంస్థ చీఫ్ మోహన్ భగవత్ కూడా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.


మరిన్ని చదవండి ఇక్కడ : Viral Video : నాగుపామా..? అయితే నాకేంటి…షాకిచ్చిన బామ్మ.వామ్మో ఈ బామ్మ ధైర్యం చుస్తే షాక్ అవ్వాల్సిందే..(వీడియో).

viral video : చెన్నై స్టేషన్ లోని పోలీసులు డాన్స్ లు ..తప్పు అయ్యినప్పటికీ ట్వీబుల్ నుండి ప్రసంశలు వెల్లువా వైరల్ అవుతున్న వీడియో