AP Assembly: ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముహుర్తం ఖరారు.. ఈ నెల 21, 22 తేదీల్లో శాసనసభ

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారు అయ్యింది. ఈ నెల 20 నుంచి సమావేశాలు నిర్వహించనున్నారు. బడ్జెట్‌ ఆమోదం కోసం ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి.

AP Assembly: ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముహుర్తం ఖరారు.. ఈ నెల 21, 22 తేదీల్లో శాసనసభ

AP Assembly Meeting: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారు అయ్యింది. ఈ నెల 20 నుంచి సమావేశాలు నిర్వహించనున్నారు. బడ్జెట్‌ ఆమోదం కోసం ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. ఈ నెల 21, 22 తేదీల్లో సభ జరిగే అవకాశం ఉంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ను ప్రవేశ పెడతారు. సభ ఎన్ని రోజులు జరపాలన్న దానిపై బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. ఈ ఏడాది తొలి మూడు నెలలకు సంబంధించి అంచనాలపై ఇప్పటికే ఆర్డినెన్స్‌ను జారీ చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం.

ఏపీ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ బుధవారం సాయంత్రం విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది. 2021-22కు పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. తొలి రోజు గవర్నర్ ప్రసంగముండగా.. అనంతరం ప్రసంగానికి ఉభయ సభలు ధన్యవాదాలు తెలపనున్నాయి. అసెంబ్లీలో బద్వేల్ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య, మండలిలో చల్లా రామకృష్ణ రెడ్డిలకు సంతాపం ప్రకటించనున్నారు.

అయితే, రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా సమావేశాలు నిర్వహించేందుకు అసెంబ్లీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు త్వరలోనే అసెంబ్లీ స్పీకర్ అన్ని శాఖ ఉన్నతాధికారులతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.

Read Also…

‘కోవిడ్ కోరలు చాస్తుంటే పాజిటివిటీపై ప్రాపగాండా’ , కేంద్రంపై రాహుల్ గాంధీ, ప్రశాంత్ కిషోర్ నిప్పులు, ఇది వంచనేనని వ్యాఖ్య

Lockdown: లాక్‌డౌన్ సమయంలో రోడ్ల మీదకు వస్తే కఠిన చర్యలు.. ప్రజలు సహకారం అందించాలన్న సీపీ మహేష్ భగవత్