TTD News: ఏడాదిలో ఎప్పుడైనా తిరుమ‌ల వెంక‌న్న దర్శనం.. ఆ టికెట్ ఉన్నవారికి మాత్రమే..!

కలియుగ ప్ర‌త్య‌క్ష దైవం తిరుమల వెంకన్న‌ ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు పొందిన భక్తులకు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం వెసులుబాటు ఇచ్చింది....

TTD News: ఏడాదిలో ఎప్పుడైనా తిరుమ‌ల వెంక‌న్న దర్శనం.. ఆ టికెట్ ఉన్నవారికి మాత్రమే..!
TTD
Follow us
Ram Naramaneni

|

Updated on: May 12, 2021 | 3:08 PM

కలియుగ ప్ర‌త్య‌క్ష దైవం తిరుమల వెంకన్న‌ ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు పొందిన భక్తులకు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం వెసులుబాటు ఇచ్చింది. ప్రత్యేక ప్రవేశ దర్శనం తేదీని మార్చుకునే అవకాశం క‌ల్పించింది. ఏప్రిల్ 21 నుంచి మే 31 వరకు టోకెన్లు పొందిన వారికి తేదీ మార్చుకునే అవకాశం ఉంది. సంవ‌త్స‌రంలో ఒకసారి మాత్రమే తేదీ మార్చుకునే వెసులుబాటు కల్పించింది. ఏడాదిలో ఎప్పుడైనా వారు శ్రీవారిని దర్శించుకుకోవచ్చు. కరోనా వైరస్ మ‌హమ్మారి వ్యాప్తి నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ వెల్ల‌డించింది. భక్తులు టికెట్లు పొంది భక్తులు దర్శనానికి రాలేకపోతున్నట్లు టీటీడీ గుర్తించింది. రోజుకు 15 వేల టికెట్లు అందుబాటులో ఉన్నా దర్శనానికి 3 వేల లోపే భక్తులు వస్తున్నారు. దీంతో భ‌క్తుల ప‌రిస్థితిని అర్థం చేసుకుని టీటీడీ ఈ నిర్ణ‌యం తీసుకుంది. మంగ‌ళ‌వారం కేవ‌లం 2,262 మంది భ‌క్తులు మాత్ర‌మే వెంక‌న్నను ద‌ర్శించుకున్నారు.

మే 25 నుండి 27వ తేదీ వరకు తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు మే 25 నుండి 27వ తేదీ వరకు జరుగనున్నాయి. మే 24వ తేదీ అంకురార్పణం నిర్వ‌హిస్తారు. కోవిడ్‌-19 వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా వ‌సంతోత్స‌వాల‌ను ఆల‌య ప్రాంగ‌ణంలో ఏకాంతంగా నిర్వ‌హిస్తారు. ఈ కార‌ణంగా మే 26న స్వ‌ర్ణ‌ర‌థోత్స‌వానికి బ‌దులుగా తిరుచ్చి ఉత్స‌వం జ‌రుగ‌నుంది.

ఈ మూడు రోజులపాటు మధ్యాహ్నం 2.30 నుండి 4.30 గంటల వరకు ఆల‌యంలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వ‌హిస్తారు. రాత్రి 7 నుండి 7.30 గంటల వరకు ఆల‌య ప్రాంగ‌ణంలో అమ్మ‌వారిని ఊరేగిస్తారు. ఈ కార‌ణంగా మే 24న కల్యాణోత్సవం, ఊంజలసేవ, మే 25 నుండి 27వ తేదీ వ‌ర‌కు కల్యాణోత్సవం సేవ‌ల‌ను టిటిడి ర‌ద్దు చేసింది.

మే 18న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్స‌వాలను పురస్కరించుకొని ఆలయంలో మే 18న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జ‌రుగ‌నుంది. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి ఉదయం 8 నుండి 10 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేస్తారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం ఉదయం 10.30 గంటల నుండి భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు. ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం సందర్భంగా మే 18న ఉద‌యం, సాయంత్రం బ్రేక్ ద‌ర్శ‌నం, క‌ల్యాణోత్సవం, ఊంజలసేవను టిటిడి రద్దు చేసింది.

Also Read:  ఈ-పాస్ ఉంటేనే రవాణాకు అనుమతి.. ఎలా తీసుకోవాలో తెలుసా..? వివరాలు..

కరోనాతో మరణించిన వ్యక్తికి పోలీసుల అంత్యక్రియలు.. ఇద్దరు ఎస్‌ఐలు చూపిన ఔదార్యానికి నెటిజన్ల ఫిదా..!

ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
తనను కలిసేందుకు వచ్చిన దివ్యాంగురాలితో వరుణ్ ముచ్చట్లు.. వీడియో
తనను కలిసేందుకు వచ్చిన దివ్యాంగురాలితో వరుణ్ ముచ్చట్లు.. వీడియో
పిల్లల్లో పెరుగుతున్న మయోపియా వ్యాధి.. అసలిది ఎందుకు వస్తుందంటే?
పిల్లల్లో పెరుగుతున్న మయోపియా వ్యాధి.. అసలిది ఎందుకు వస్తుందంటే?
చావాలంటే బయట.. బతకాలంటే ఇంట్లో తినండి..! బాటమ్‌ లైన్‌ ఇది..!
చావాలంటే బయట.. బతకాలంటే ఇంట్లో తినండి..! బాటమ్‌ లైన్‌ ఇది..!