Telangana Lockdown: తెలంగాణ ఆరోగ్యశాఖ కీలక ప్రకటన.. వ్యాక్సిన్ వేసుకునేవారికి లాక్‌డౌన్ మినహాయింపు..!
ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ వలన వైద్య సేవల్లోనూ, టీకా పంపిణీలోనూ ఎలాంటి అంతరాయాలు ఉండబోవని తెలంగాణ ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాస్ రావు ప్రకటించారు.
Telangana Lockdown Exemption: ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ వలన వైద్య సేవల్లోనూ, టీకా పంపిణీలోనూ ఎలాంటి అంతరాయాలు ఉండబోవని తెలంగాణ ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాస్ రావు ప్రకటించారు. టీకా సెంటర్లలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే వ్యాక్సిన్‌ను పంపిణీ చేస్తామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేసినట్లు ఆయన తెలిపారు.
రాష్ట్రంలో లాక్‌డౌన్ కారణంగా వ్యాక్సిన్‌ను కేవలం 45ఏళ్ల దాటి రెండవ డోసు వారికి మాత్రమే అందిస్తామని స్పష్టం చేశారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో టెస్ట్‌లు ఇతర ఆరోగ్య సేవలు యథావిధిగా అందుబాటులో ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. టీకా కేంద్రాలు యథావిధిగా పంపిణీని చేపడుతారని చెప్పారు. ఇది వరకు ప్రకటించినట్టుగానే రెండవ డోసు టీకాను మాత్రమే అందిస్తామని తెలిపారు.
అయితే, టీకా సెంటర్‌కు వచ్చే వారు మొదటి డోసు టీకా తీసుకున్నట్టుగా ఆధారాలు తప్పనిసరిగా చూపించాలని సూచించారు. కోవిన్ వెబ్‌సైట్ నుంచి మొదటి టీకా తీసుకున్నట్టుగా ఆధారాలు సేకరించవచ్చని తెలిపారు. వ్యాధి లక్షణాలున్నవారు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే సమీపంలోని టెస్టింగ్ సెంటర్‌కు వెళ్లి టెస్ట్‌లు చేయించుకోవాలని సూచించారు. కోవిడ్ టెస్ట్‌ల కోసం, టీకాల కోసం ప్రయాణాలు చేస్తున్న వారికి పోలీసులు ఎలాంటి ఆంక్షలు విధించబోరని మెడికల్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు స్పష్టం చేశారు. రెండవ మోతాదుకు అర్హులైన వారు తమకు కేటాయించిన టీకా కేంద్రాలను సంప్రదించవచ్చని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
#Telangana Covid Vaccination program will continue only for the age group 45 year + for 2nd dose.Vaccination will happen at Government Covid Vaccination Centres from 9 AM to 4 PM. Persons who have completed 4 week in case of Covaxin and 6 weeks in case of Covishield are eligible
— Dr G Srinivasa Rao (@drgsrao) May 11, 2021
మరోవైపు, రాష్ట్రంలో రోజువారీ మందులు, వ్యాక్సిన్‌ల సరఫరాను వేగవంతం చేయడానికి తెలంగాణ మంత్రివర్గం రాష్ట్ర స్థాయి టాస్క్‌ఫోర్స్ కమిటీని నియమించింది. రాష్ట్ర మంత్రి కేటీ రామారావు నేతృత్వంలోని టాస్క్‌ఫోర్స్‌లో అన్ని ప్రధాన విభాగాల కార్యదర్శులు ఉంటారు.
Read Also… MEIL: మరోసారి దాతృత్వం చాటుకున్న మేఘా ఇంజనీరింగ్ సంస్థ.. తెలుగు రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా