Weather Report of AP: రాగల మూడు రోజులు ఆంధ్రప్రదేశ్‌లోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం..

Weather Report of AP: లక్ష ద్వీపం దాని పరిసర ప్రాంతాల మీద ఉన్న అల్పపీడనం బలపడిందని అమరావతి కేంద్రంగా ఉన్న భారత వాతావరణ..

Weather Report of AP: రాగల మూడు రోజులు ఆంధ్రప్రదేశ్‌లోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం..
Andhra Pradesh
Follow us

|

Updated on: May 14, 2021 | 6:46 PM

Weather Report of AP: లక్ష ద్వీపం దాని పరిసర ప్రాంతాల మీద ఉన్న అల్పపీడనం బలపడిందని అమరావతి కేంద్రంగా ఉన్న భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ అల్ప పీడనం ఈ రోజు వాయు గుండంగా మారి, లక్ష ద్వీపం సమీపంలోని అమిని దీవి కి దక్షిణ నైరుతి దిశగా 80 కిలోమీటర్ల దూరంలో, కన్నూరు(కేరళ)కు పశ్చిమ నైరుతి దిశగా 360 కిలోమీటర్ల దూరంలో, వెరావెల్ (గుజరాత్)కు దక్షిణ ఆగ్నేయ దిశగా 1170 కి. మీ. దూరంలో కేంద్రీకృతమై ఉందన్నారు.

ఉత్తర-దక్షిణ ద్రోణి, ఆగ్నేయ మధ్య ప్రదేశ్ దాని పరిసర ప్రాంతాల మీద ఉన్న ఉపరితల ఆవర్తనం నుంచి విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా, దక్షిణ తమిళనాడు వరకు వ్యాపించి, సముద్ర మట్టానికి 9 కిలోమీటర్ల ఎత్తులో ఉందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానంగా తక్కువ ఎత్తులో దక్షిణ, ఆగ్నేయ, నైరుతి గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

కాగా, ఈ అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో రాగల మూడు రోజుల వరకు వాతావరణంలో విభిన్న మార్పులు ఉంటాయని తెలిపారు. ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం ప్రాంతాల్లో ఇవాళ ఈ రోజు, శనివారం నాడు ఉరుములు, మెరుపులతో పాటు, ఒకటి లేదా రెండు చోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఆదివారం నాడు ఉరుములు, మెరుపులతో పాటు, కొన్ని చోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రాంతంలో ఇవాళ ఉరుములు, మెరుపులతో పాటు, ఒకటి లేదా రెండు చోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. శనివారం నాడు ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలులతో కూడిన తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇక ఆదివారం నాడు ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలులతో కూడిన తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

రాయలసీమలో ఇవాళ ఉరుములు, మెరుపులతో పాటు, ఒకటి లేదా రెండు చోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. శనివారం, ఆదివారం నాడు ఉరుములు, మెరుపులతో పాటు ఈదూరు గాలులతో కూడిన భారీ వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Also read:

Corona Second Wave: కరోనా రెండో వేవ్ కి కారణంగా చెబుతున్న వేరియంట్ B.1.617 అంటే ఏమిటి? శాస్త్రవేత్తలు ఏమంటున్నారు?

ఇద్దరు తోడికోడళ్ల మధ్య ఘర్షణ.. అడ్డు వెళ్లిన బావను కత్తితో పొడిచి చంపిన మరదలు.. ఎక్కడంటే..

కేసీఆర్‌తో టచ్‌లో ఉన్న సీనియర్‌ ఎవరు ??
కేసీఆర్‌తో టచ్‌లో ఉన్న సీనియర్‌ ఎవరు ??
రుణమాఫీ ఎప్పుడో చెప్పిన రేవంత్ రెడ్డి
రుణమాఫీ ఎప్పుడో చెప్పిన రేవంత్ రెడ్డి
ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: దానం నాగేందర్
ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: దానం నాగేందర్
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్