Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ambulance : వైద్యసాయంకోసం వెళ్తోన్న రోగుల అంబులెన్స్‌లను సరిహద్దుల్లో అడ్డుకోవడంపై సుప్రీం కోర్టును ఆశ్రయించిన ఏపీ సర్కారు

TS Police stop ambulance : చికిత్స కోసం రోగులతో వెళుతోన్న అంబులెన్స్ లను తెలంగాణ సరిహద్దుల్లో నిలిపివేస్తోన్న వ్యవహారాన్ని ఏపీ సర్కారు సీరియస్ గా తీసుకుంది.

Ambulance : వైద్యసాయంకోసం వెళ్తోన్న రోగుల అంబులెన్స్‌లను సరిహద్దుల్లో అడ్డుకోవడంపై సుప్రీం కోర్టును ఆశ్రయించిన ఏపీ సర్కారు
Ap Ambulance Stopped In Telangana Border
Follow us
Venkata Narayana

|

Updated on: May 14, 2021 | 3:13 PM

TS Police stop ambulance : చికిత్స కోసం రోగులతో వెళుతోన్న అంబులెన్స్ లను తెలంగాణ సరిహద్దుల్లో నిలిపివేస్తోన్న వ్యవహారాన్ని ఏపీ సర్కారు సీరియస్ గా తీసుకుంది. దీనిపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కొవిడ్ నిర్వహణ పై సుప్రీంకోర్టులో ఇప్పటికే కొనసాగుతోన్న విచారణ లో సైతం ఈ అంశం ప్రస్తావించాలని నిర్ణయించింది. కాగా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణలోకి వస్తోన్న ఏపీ అంబులెన్స్‌లను తెలంగాణ పోలీసులు నిలిపేస్తున్న సంగతి తెలిసిందే . హైదరాబాద్ ఆస్పత్రుల నుంచి బెడ్‌ అనుమతి పత్రం, తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసిన ఈ పాస్‌ ఉంటేనే అనుమతిస్తామని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలో సీరియస్ గా ఉన్న కొవిడ్ రోగులు సహా తీవ్ర అనారోగ్యంతో ఉన్న అనేక మంది రోగులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కర్నూలు జిల్లా సరిహద్దులోని పుల్లూరు చెక్‌పోస్టు వద్ద.. మరోవైపు సూర్యాపేట జిల్లా రామాపురం క్రాస్‌ రోడ్డు వద్ద కూడా ఏపీ అంబులెన్స్‌లను తెలంగాణ పోలీసులు నిలిపేస్తున్నారు. రోగులతో వస్తున్న అంబులెన్స్‌లను అడ్డుకోవడంతో వారి బంధువులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనుమతులున్నా ఆపేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

కాగా, ‘మీ వారి పరిస్థితి విషమించింది.. హైదరాబాద్‌లో పెద్ద ఆస్పత్రులు ఉన్నాయి. మంచి చికిత్స దొరుకుంది. తొందరగా వెళ్లండి’.. అంటే.. హడావుడిగా అంబులెన్స్ మాట్లాడుకుని.. బయలుదేరుతున్నారు కరోనా బాధితులు. కానీ, తెలంగాణ సరిహద్దుల్లో వారికి యమగండం ఎదురవుతోంది. ప్రభుత్వాల ఆంక్షలు.. అధికారుల నిబంధనలే వారి పాలిట శాపంగా మారుతున్నాయి. ఫలితంగా కర్నూలు టోల్‌ప్లాజా దగ్గర ఇటీవల ఇద్దరు కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో రోగుల బంధువులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.. ఈ దారుణానికి బాధ్యులెవరు. ఎవరిని నిందించాలి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సరిహద్దు వరకూ వచ్చిన వారితో ఇలానా వ్యవహరించేది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనా రాజకీయాలు చేసేది. కొంచెమైనా ప్రభుత్వాలు మానవత్వాన్ని ప్రదర్శించక్కర్లేదా. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు మాట్లాడుకుని ఈ సమస్యను పరిష్కరించుకోవాల్సిన అవసరం లేదా.. ఇది అత్యవసర సమస్య కాదా..? అని ప్రశ్నిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఏపీ సర్కారు సుప్రీంను ఆశ్రయించింది. మరోవైపు, ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చే కోవిడ్ పేషెంట్లపై కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటికే ఆంక్షలు విధించింది. ప్రత్యేకమైన గైడ్‌లైన్స్ విధిస్తూ సీఎస్ సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆస్పత్రుల అనుమతి లేని పేషెంట్లకు తెలంగాణలోకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. వైద్యం కోసం తెలంగాణకు వచ్చేవారికి బెడ్‌ కన్‌ఫర్మేషన్‌ తప్పనిసరిగా ఉండాలి.. అనుమతులు లేకుండా వచ్చి.. పేషెంట్లు ఇబ్బందులు పడొద్దని సూచిస్తున్నారు అధికారులు. ఈ విషయమై అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లెటర్ కూడా రాసిన సంగతి విదితమే.

Read also : #AskKTRలో ఆసక్తికర సంభాషణలు, మీరు ఎలా కొవిడ్ ను ఎదుర్కొన్నారన్న ప్రశ్నకు కేటీఆర్ ఫుల్ క్లారిటీ