Viral Video : పోలీస్ దెబ్బలను తప్పించుకోవడానికి ఈ వ్యక్తి ఏం చేశాడో తెలిస్తే నవ్వొస్తుంది..!
Viral Video : సోషల్ మీడియాలో తరచుగా ఫన్నీ వీడియోలు చూస్తూ ఉంటాం. ఈ వీడియోలు చాలా వైరల్ అవుతుంటాయి.
Viral Video : సోషల్ మీడియాలో తరచుగా ఫన్నీ వీడియోలు చూస్తూ ఉంటాం. ఈ వీడియోలు చాలా వైరల్ అవుతుంటాయి. కొన్ని వీడియోలు చూస్తే నవ్వు ఆపుకోలేము మరికొన్ని వీడియోలు చూస్తే ఆశ్యర్యపోతాం. ఇప్పుడు చూసే వీడియో కూడా అలాంటిదే. లాక్డౌన్లో పోలీసుల లాఠీ దెబ్బల నుంచి తప్పించుకోవడానికి ఒక వ్యక్తి ఏం చేశాడో తెలిస్తే అందరు షాక్ అవుతారు.
ఈ రోజుల్లో ప్రజలు ఎలా ఉంటున్నారో అందరికి తెలుసు. ముఖ్యంగా భారతదేశంలో ప్రజలు చాలా సందర్భాల్లో భిన్నమైన ఆలోచనలను కలిగి ఉంటారు. ఇప్పుడు ఈ వీడియో చూడండి. ఒక వ్యక్తి సైకిల్‌పై వెళుతున్నాడు. అదే సమయంలో వెనుక ఒక సీటు ఉంది. లాక్డౌన్లో పోలీసు లాఠీ దెబ్బలను తప్పించుకోవడానికి ఒక రేకు అమర్చాడు. దీనిని చూస్తే నవ్వు ఆపుకోవడం కష్టం.
ఈ వీడియో కర్ణాటకలోని ఉడిపికి చెందినదని చెబుతున్నారు. ట్విట్టర్‌లో ఈ వీడియోను ‘రాల్ఫ్ అలెక్స్ అరకల్’ అనే యూజర్ షేర్ చేశారు. వీడియోతో కూడిన క్యాప్షన్ ఇలా ఉంది. ‘ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక వ్యక్తి అన్ని భద్రతతో సైకిల్ నడుపుతున్నాడు. అతను హెల్మెట్, ఫేస్ మాస్క్, పోలీసుల లాఠీ నుంచి కూడా తప్పించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. ఈ వీడియో చూసిన తర్వాత ప్రజలు నవ్వుతున్నారు. అదే సమయంలో ఇతగాడి ఆలోచనను కూడా అభినందిస్తున్నారు.’ ఈ వీడియోను ఇప్పటివరకు 9 వేలకు పైగా చూశారు. కామెంట్స్, షేర్స్ చేస్తున్నారు.
In a video that is making rounds on social media, a man from #Karnataka’s Udupi was seen riding a cycle with makeshift rear protection, helmet and a mask to avoid thwacks of lathi from the police.
— Ralph Alex Arakal (@ralpharakal) May 12, 2021