Lockdown: హైదరాబాద్ లో నివసిస్తున్నందుకు గర్విస్తున్నాను..లాక్ డౌన్ పరిస్థితిపై పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ట్వీట్
Lockdown: కరోనా మహమ్మారి ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. కరోనాతో పోరాటంలో భాగంగా దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ రాష్ట్రాలు లాక్ డౌన్ అయిపోయాయి. ప్రస్తుతం దేశంలో అన్ని చోట్లా లాక్ డౌన్ నడుస్తోంది.
Lockdown: కరోనా మహమ్మారి ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. కరోనాతో పోరాటంలో భాగంగా దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ రాష్ట్రాలు లాక్ డౌన్ అయిపోయాయి. ప్రస్తుతం దేశంలో అన్ని చోట్లా లాక్ డౌన్ నడుస్తోంది. తెలంగాణాలో కూడా లాక్ డౌన్ విధించారు. కఠినమైన నిబంధనలు పెట్టారు. ఈ నేపధ్యంలో ఈరోజు రంజాన్ పండుగ వచ్చింది. ముస్లింలకు ఎంతో పవిత్రమైన ఈ పండుగ రోజు వారు సామూహిక ప్రార్ధనలు జరుపుకుంటారు. కానీ, లాక్ డౌన్ కారణంగా ఈరోజు ఎవరికి వారు ఇళ్లలోనే ఉండి పండుగ నిర్వహించుకుంటున్నారు. సాధారణంగా రంజాన్ అంటే హైదరాబాద్ పాత బస్తీలో ఉండే కోలాహలమే వేరు. నెలరోజుల పాటు ఉపవాస దీక్షలు చేసే ముస్లిం సోదరులు.. ప్రతి రోజూ ప్రార్ధనలకు మసీదులకు చేరుకుంటారు. అంతా ఒక్క దగ్గర చేరి సామూహికంగా ప్రార్ధనలు చేసుకుంటారు. కరోనా కారణంగా వరుసగా రెండో సంవత్సరం కూడా రంజాన్ కళ తప్పింది. మహమ్మారి కారణంగా గుంపుగా ఒక దగ్గర చేరే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో ముస్లిం సోదరులు స్వచ్చందంగా లాక్ డౌన్ నిబంధనలను కచ్చితంగా పాటిస్తున్నారు.
రంజాన్ పండుగ సందర్భంగా ఈరోజు హైదరాబాద్ నగరం ఎలా ఉందో నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ఒక వీడియోలో చూపించారు. నగరమంతా రోడ్ల మీద ఒక్క మనిషి కూడా కనిపించలేదు. ముఖ్యమైన కూడళ్ళ వద్ద పోలీసు పహారా కొనసాగుతోంది. దుకాణాలు అన్నీ మూసేసి ఉన్నాయి. గత లాక్ డౌన్ సమయంలో ప్రజలు ఎదో వంకతో రోడ్లపైకి వస్తుండటం కనిపించేది. ఇప్పుడు మాత్రం ప్రజలు లాక్ డౌన్ నిబంధనలు కచ్చితంగా పాటిస్తున్నారు. దీనితో హైదరాబాద్ సీపీ చాలా ముచ్చట పడిపోయారు. ఎంతలా అంటే..”హైదరాబాద్ లో నివసిస్తున్నందుకు నేను గర్వపడుతున్నాను” అంటూ ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేసి తన భావాలను పంచుకునేంతగా.. నగరంలోని ప్రస్తుత పరిస్థితిని వీడియో రూపంలో ట్విట్టర్ లో షేర్ చేసిన సీపీ దానికి ఇచ్చిన క్యాప్షన్ ఇలా ఉంది. ”హైదరాబాద్ లో నివసిస్తున్నందుకు నేను గర్వపడుతున్నాను. ఎందుకంటే, చట్టాన్ని గౌరవించే పౌరులు.. అదేవిధంగా లాక్ డౌన్ నిబంధనలను కచ్చితంగా పాటిస్తున్న విధానం అద్భుతం. నేను హైదరాబాద్ ను ప్రేమిస్తున్నాను.. మరి మీరు?”
సీపీ అంజనీకుమార్ చేసిన ట్వీట్ ఇదే..
I feel proud to live in a city where the Citizens are so law abiding and demonstrating highest quality of compliance to the Lockdown rules. I love Hyderabad. Do you ? pic.twitter.com/KWUVpsNvHx
— Anjani Kumar, IPS, Stay Home Stay Safe. (@CPHydCity) May 14, 2021
Also Read: Sputnik V: గుడ్ న్యూస్.. మరో వారంలో స్పుత్నిక్-వి వ్యాక్సిన్ అందుబాటులోకి.. ధర ఎంతో తెలుసా.?
Hospital Beds: ఒక్క ఫోన్ కాల్‌తో హైదరాబాద్‌లో హాస్పిటల్ బెడ్స్ జాడ తెలుసుకోండిలా.. వివరాలివే..