Telangana High Court: అంబులెన్స్‌లను అడ్డుకోవడంపై తెలంగాణ హైకోర్టు సీరియస్‌.. ప్రభుత్వ సర్క్యూలర్‌పై స్టే విధింపు..

Telangana High Court: సరిహద్దుల్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే అంబులెన్స్‌లను తెలంగాణ పోలీసులు అడ్డుకోవడంపై రాష్ట్ర హైకోర్టు..

Telangana High Court: అంబులెన్స్‌లను అడ్డుకోవడంపై తెలంగాణ హైకోర్టు సీరియస్‌.. ప్రభుత్వ సర్క్యూలర్‌పై స్టే విధింపు..
Telangana High Court
Follow us
Shiva Prajapati

|

Updated on: May 14, 2021 | 6:44 PM

Telangana High Court: సరిహద్దుల్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే అంబులెన్స్‌లను తెలంగాణ పోలీసులు అడ్డుకోవడంపై రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి తెలంగాణ సర్కార్ జారీ చేసిన సర్క్యూలర్‌పై స్టే ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో ఆంబులెన్స్‌లను ఆపడానికి వీల్లేదని రాష్ట్ర పోలీస్ శాఖకు కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఏపీ నుంచి తెలంగాణకు వచ్చే అంబులెన్స్‌లను ఆపుతున్నారంటూ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌లో ఏపీ ప్రభుత్వం ఇంప్లీడ్ అయ్యింది. ఏపీ ప్రభుత్వం తరఫున హైకోర్టులో ఆ రాష్ట్ర అడిషనల్ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు. ఎపిడమిక్ యాక్ట్ 1897, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్ 2005 ప్రకారం.. ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ సెక్షన్ 2 ప్రకారం ప్రాంతాన్ని బట్టి రాష్ట్రాలు ఎంట్రీని నిలువరిస్తే ఆర్టికల్ 14 ఉల్లంఘనకు పాల్పడినట్లే అని శ్రీరామ్ తెలంగాణ హైకోర్టుకు తెలిపారు.

ఏపీ ప్రభుత్వ అభ్యంతరాలపై సానుకూలతన వ్యక్తం చేసిన తెలంగాణ హైకోర్టు.. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సర్క్యూలర్‌పై స్టే ఇచ్చింది. సర్క్యూలర్‌లో మార్పులు చేసి కొత్త సర్క్యూలర్‌ను జారీ చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇతర రాష్ట్రాల నుండి వచ్చే పేషంట్లు సహాయం కోసం కంట్రోల్ రూమ్‌ ను సంప్రదించవచ్చునని హైకోర్టు స్పష్టం చేసింది. అంబులెన్స్‌లో వస్తున్న పేషంట్ ఎంట్రీ నీ కంట్రోల్ రూమ్ సిబ్బంది ఆపొద్దు అని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

Also read:

Viral Video : డ్రైవర్ లేకుండా నడుస్తున్న కారు..! వెనుక సీటులో కూర్చున్న యజమాని.. వీడియో వైరల్..

షుగర్ రోగులలో కరోనా లక్షణాలు కనిపిస్తే జాగ్రత్తగా ఉండాల్సిందే అంటున్న నిపుణులు.. వారిలో ఈ సమస్యలు అధికం..

Megastar Chiranjeevi : వైర‌స్ కంటే మ‌న భ‌యమే మ‌న‌ల్ని ముందుగా చంపేస్తోంది… దైర్యంగా ఉండండి: చిరంజీవి