Vijayashanti : తెలంగాణ ముఖ్యమంత్రిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినా తప్పులేదు : విజయశాంతి

Vijayashanti : వైద్యం కోసం ఏపీ నుంచి హైదరాబాద్ వస్తున్న రోగుల అంబులెన్సులను తెలంగాణ సరిహద్దుల దగ్గర ఆపడాన్ని తెలంగాణ బీజేపీ మహిళా నేత విజయశాంతి తీవ్రంగా ఖండించారు.

Vijayashanti : తెలంగాణ ముఖ్యమంత్రిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినా తప్పులేదు : విజయశాంతి
Vijayashanthi

Vijayashanti : వైద్యం కోసం ఏపీ నుంచి హైదరాబాద్ వస్తున్న రోగుల అంబులెన్సులను తెలంగాణ సరిహద్దుల దగ్గర ఆపడాన్ని తెలంగాణ బీజేపీ మహిళా నేత విజయశాంతి తీవ్రంగా ఖండించారు. వైద్యం కోసం వస్తున్న రోగుల అంబులెన్స్ లను అపేసి ఏ మాత్రం మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్న తెలంగాణ పాలకుల తీరును అన్ని వర్గాలూ తప్పుబడుతున్నా ఈ సర్కారు స్పందించడం లేదని ఆమె దుయ్యబట్టారు. ఆస్పత్రులలో బెడ్స్ కన్ఫర్మ్ చేసుకుని, అందుకు రుజువులు చూపిస్తున్నా అనుమతించకపోవడం దారుణమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో తెలంగాణ సర్కారు వైఖరిని ఇటీవలే తనతో సహా విపక్షాలన్నీ ఖండించాయని.. సరిహద్దుల్లో అంబులెన్సులను అపే విషయమై ప్రభుత్వం నుంచి ఆదేశాలున్నాయా… అని హైకోర్టు వేసిన ప్రశ్నకు సైతం అధికారులు సరైన సమాధానం ఇవ్వలేకపోయారని విజయశాంతి ఎద్దేవా చేశారు. తెలంగాణ సర్కారు తీరుతో సరిహద్దుల వద్ద పలువురు రోగులు మృత్యుముఖానికి చేరువయ్యే పరిస్థితి నెలకొంది.. ఈ దుస్థితికి గాను తెలంగాణ ముఖ్యమంత్రిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినా తప్పులేదు. అని ఆమె వ్యాఖ్యానించారు. కాగా, చికిత్స కోసం రోగులతో వెళుతోన్న అంబులెన్స్ లను తెలంగాణ సరిహద్దుల్లో నిలిపివేస్తోన్న వ్యవహారాన్ని ఏపీ సర్కారు సీరియస్ గా తీసుకుంది. దీనిపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

కొవిడ్ నిర్వహణ పై సుప్రీంకోర్టులో ఇప్పటికే కొనసాగుతోన్న విచారణ లో సైతం ఈ అంశం ప్రస్తావించాలని నిర్ణయించింది. కాగా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణలోకి వస్తోన్న ఏపీ అంబులెన్స్‌లను తెలంగాణ పోలీసులు నిలిపేస్తున్న సంగతి తెలిసిందే . హైదరాబాద్ ఆస్పత్రుల నుంచి బెడ్‌ అనుమతి పత్రం, తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసిన ఈ పాస్‌ ఉంటేనే అనుమతిస్తామని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలో సీరియస్ గా ఉన్న కొవిడ్ రోగులు సహా తీవ్ర అనారోగ్యంతో ఉన్న అనేక మంది రోగులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కర్నూలు జిల్లా సరిహద్దులోని పుల్లూరు చెక్‌పోస్టు వద్ద.. మరోవైపు సూర్యాపేట జిల్లా రామాపురం క్రాస్‌ రోడ్డు వద్ద కూడా ఏపీ అంబులెన్స్‌లను తెలంగాణ పోలీసులు నిలిపేస్తున్నారు. రోగులతో వస్తున్న అంబులెన్స్‌లను అడ్డుకోవడంతో వారి బంధువులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనుమతులున్నా ఆపేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

Read also : Ambulance : వైద్యసాయంకోసం వెళ్తోన్న రోగుల అంబులెన్స్‌లను సరిహద్దుల్లో అడ్డుకోవడంపై సుప్రీం కోర్టును ఆశ్రయించిన ఏపీ సర్కారు