AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS Congress: ఈటెల రాజేందర్ వ్యవహారంపై ఆసక్తికర వ్యాఖ్యలుు చేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత..

TS Congress: తెలంగాణలో కరోనా వ్యాప్తి, రాజకీయ పరిస్థితులపై రాష్ట్ర కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా పేషెంట్స్ కోసం తాను రెండు అంబులెన్స్‌లను..

TS Congress: ఈటెల రాజేందర్ వ్యవహారంపై ఆసక్తికర వ్యాఖ్యలుు చేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత..
Jaggareddy
Shiva Prajapati
|

Updated on: May 14, 2021 | 7:16 PM

Share

TS Congress: తెలంగాణలో కరోనా వ్యాప్తి, రాజకీయ పరిస్థితులపై రాష్ట్ర కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా పేషెంట్స్ కోసం తాను రెండు అంబులెన్స్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ అంబులెన్స్‌లు గాంధీ భవన్‌లో అందుబాటులో ఉంటాయన్నారు. మరో రెండు రెజుల్లో వీటిని అందుబాటులోకి తీసుకువస్తానని జగ్గారెడ్డి ప్రకటించారు. రాహుల్ గాంధీ, ఉత్తమ్ ఆదేశాల మేరకు అంబులెన్స్‌లను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. పలు అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో లాక్‌డౌన్ విధింపుపై స్పందించిన జగ్గారెడ్డి.. లాక్‌డౌన్ విధించడంలో తప్పు లేదన్నారు. ఇంకో 15 రోజులు పెట్టినా తప్పులేదని ఉద్ఘాటించారు. మనిషి బతకడం ముఖ్యం అని, పైసలు ఎప్పుడైనా సంపాదించవ్చునని అన్నారు. ఇక ఇటీవలి కాలంలో తీవ్ర చర్చనీయాంశమైన మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారంపై స్పందించేందుకు జగ్గారెడ్డి నిరాకరించారు. స్కామ్‌ల గురించి ఇప్పుడు మాట్లాడబోనని స్పష్టం చేశారు. ప్రజలను ఆదుకోవడం ముఖ్యం అని, ఆరోగ్య మంత్రి ఉంటే ఏంటి? లేకుంటే ఏంటి? అని అన్న ఆయన.. ముఖ్యమంత్రి ఉన్నారు కదా ఆయన చూసుకుంటారు అని వ్యాఖ్యానించారు.

‘కరోనా విపత్తును ఎదుర్కొనేందుకు కేటీఆర్‌తో టాస్క్‌ ఫోర్స్ ఏర్పాటు చేశామని ప్రభుత్వం చెబుతోంది. ఇక నుంచి అన్నీ ఆయన చూసుకుంటారని అంటున్నారు కదా ఏం జరుగుతుందో చూద్దాం.’ అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. ఆక్సిజన్, రేమిడేసివర్ అందకపోవడం కేంద్రానిదే బాధ్యత అన్నారు. భారానా మోదీది బాధ్యత అయితే. చారాణా కేసీఆర్‌ది బాధ్యత అని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో బీజేపీ నేతల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో అమిత్ షా ని భాగ్యలక్ష్మి టెంపుల్‌కి దించిన బీజేపీ.. ఇప్పుడు తెలంగాణ ప్రజలు చనిపోతుంటే అమిత్ షాని ఎందుకు తీసుకురావడం లేదని ప్రశ్నించారు. కేంద్ర మంత్రులందరినీ ఇప్పుడు ఎందుకు తీసుకురావడం లేదన్నారు.

ఈటల రాజేందర్‌ వ్యవహారం టీఆర్ఎస్ పార్టీ అంతర్గత విషయం అని జగ్గారెడ్డి అన్నారు. హుజూరాబాద్‌ ఎన్నికల్లో ఈటల రాజేందర్ పోటీ చేస్తే కాంగ్రెస్ కూడా తప్పకుండా పోటీ చేస్తుందని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. పోటీ పెట్టరు అనే అనుమానమే వద్దన్నారు. హుజూరాబాద్ ఇన్‌చార్జి కౌశిక్.. చాలా రోజులుగా కాంగ్రెస్ పార్టీ జెండాను మోస్తున్నారని, ఆయనే పోటీ చేస్తారని అన్నారు.

Also read:

Abhiram: ‘త‌ప్పులు అంద‌రూ చేస్తారు.. నా త‌ప్పులు బ‌య‌ట‌ప‌డ్డాయి అంతే’.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన రానా త‌మ్ముడు..

Viral Video: దొంగ అవతారమెత్తిన కాకి.. తెలివిగా డబ్బులు కాజేస్తున్న వైనం.. వైరల్ అవుతున్న వీడియో..