Abhiram: ‘త‌ప్పులు అంద‌రూ చేస్తారు.. నా త‌ప్పులు బ‌య‌ట‌ప‌డ్డాయి అంతే’.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన రానా త‌మ్ముడు..

Abhiram Daggubati: ద‌గ్గుబాటి రానా సోద‌రుడు అభిరామ్ గ‌త కొన్ని రోజుల క్రితం వార్త‌ల్లో నిలిచిన విష‌యం తెలిసిందే. ఓ న‌టి త‌న‌పై ప‌లు ఆరోప‌ణ‌లు చేయ‌డం, కొన్ని ఫొటోలు కూడా బ‌య‌ట‌కు రావ‌డంతో తీవ్ర చ‌ర్చ‌కు దారి తీసింది...

Abhiram: 'త‌ప్పులు అంద‌రూ చేస్తారు.. నా త‌ప్పులు బ‌య‌ట‌ప‌డ్డాయి అంతే'.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన రానా త‌మ్ముడు..
Abhiram
Follow us
Narender Vaitla

|

Updated on: May 14, 2021 | 7:03 PM

Abhiram Daggubati: ద‌గ్గుబాటి రానా సోద‌రుడు అభిరామ్ గ‌త కొన్ని రోజుల క్రితం వార్త‌ల్లో నిలిచిన విష‌యం తెలిసిందే. ఓ న‌టి త‌న‌పై ప‌లు ఆరోప‌ణ‌లు చేయ‌డం, కొన్ని ఫొటోలు కూడా బ‌య‌ట‌కు రావ‌డంతో తీవ్ర చ‌ర్చ‌కు దారి తీసింది. అభిరామ్ సినిమా ఎంట్రీ ఆల‌స్యానికి అదే కార‌ణ‌మ‌నే వార్త‌లు కూడా వ‌చ్చాయి. అయితే ఇప్పుడిప్పుడే ఆ స‌మ‌స్య తొలిగిపోయింది. దీంతో అభిరామ్ ఇండ‌స్ట్రీ ఎంట్రీపై మ‌ళ్లీ వార్త‌లు వ‌చ్చాయి. తేజ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న సినిమాలో అభిరామ్ హీరోగా న‌టిస్తున్న‌ట్లు వార్తలు వ‌చ్చాయి. ఈ విష‌యాన్ని హీరో అభిరామ్ ఇటీవ‌ల స్ప‌ష్టం చేశారు. ఇక త‌న వ్య‌క్తిగ‌త జీవితానికి సంబంధించిన కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను సైతం అభిరామ్ ఓ ఇంట‌ర్యూలో తెలిపారు.

ఈ సంద‌ర్భంగా అభిరామ్ మాట్లాడుతూ.. ‘త‌ప్పులంద‌రూ చేస్తారు. నేను చేసిన త‌ప్పులు బ‌య‌ట‌ప‌డ్డాయి. ఈ త‌ప్పుల నుంచి నేను ఎన్నో విష‌యాల‌ను నేర్చుకున్నాను. ఆ స‌మ‌యంలో నా కుటుంబం నాకు అండ‌గా నిలిచింది. ఏ ప‌నులు చేయాలి.? ఏ ప‌నులు చేయ‌కూడ‌దు.? అనే విష‌యాల‌పై ఇప్పుడు ఒక స్ప‌ష్ట‌త వ‌చ్చింది. న‌టుడిగా కెరీర్ ప్రారంభించ‌డానికి ముందే ఇలా జ‌ర‌గ‌డంతో భ‌విష్యత్తులో ఇలాంటి త‌ప్పులు మ‌రోసారి చేయ‌కూడ‌ద‌ని అర్థ‌మైంద’ని చెప్పుకొచ్చారు అభిరామ్‌. ఇక న‌టుడిగా అన్ని రకాల పాత్రలు చేయాలని ఉందని చెప్పిన అభిరామ్‌.. ముఖ్యంగా ప్రేమ, కుటుంబకథా చిత్రాలు చేయాలనుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు.

Also Read: Young Tiger Junior NTR: పాన్ ఇండియా స్టార్ డమ్ ను పట్టించుకోని తారక్.. హాలీవుడ్ సినిమాకు సిద్దమైనట్టేనా..

Ram Gopal Varma : ఓటీటీని ఆటాడేసుకుంటున్న ఆర్జీవీ.. వరుస సినిమాలతో రానున్న వర్మ..

Venkatesh: మరో ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంకటేష్…. మాటల మాంత్రికుడి దర్శకత్వంలో నారప్ప

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే