AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Venkatesh: మరో ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంకటేష్…. మాటల మాంత్రికుడి దర్శకత్వంలో నారప్ప

టాలీవుడ్ లో మరో క్రేజీ కాంబినేషన్ పై రూమర్ హై లెవెల్లో వినిపిస్తుంది. ఇప్పటికే మహేశ్ బాబుతో మూవీ ఫిక్స్ చేసుకున్న మాటల మాంత్రికుడు త్రివిక్రమ్..

Venkatesh: మరో ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంకటేష్.... మాటల మాంత్రికుడి దర్శకత్వంలో నారప్ప
Venkatesh
Rajitha Chanti
|

Updated on: May 14, 2021 | 5:39 PM

Share

టాలీవుడ్ లో మరో క్రేజీ కాంబినేషన్ పై రూమర్ హై లెవెల్లో వినిపిస్తుంది. ఇప్పటికే మహేశ్ బాబుతో మూవీ ఫిక్స్ చేసుకున్న మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.. తన నెక్ట్స్ ఫిల్మ్.. ఓ సీనియర్ హీరోతో చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడట. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. వచ్చే సమ్మర్ లో సెట్స్ పైకి వెళ్తుందట. ఇంతకీ ఎవరా సీనియర్ హీరో..?  అనుకుంటున్నారా.. అదేనండి మన వెంకీ. అవునండీ.. మాటల మాంత్రికుడితో వెంకటేష్ సినిమా చేయబోతున్నాడట. మరీ ఆ వివరాలెంటో తెలుసుకుందామా.

నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరీ.. వెంకటేశ్ కెరీర్ ను మలుపు తిప్పిన చిత్రాలు. ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్న వెంకటేశ్ ను.. అన్ని వర్గాల ప్రేక్షకులకు దగ్గర చేసిన సినిమాలు. భారీ హిట్ సాధించిన ఈ మూవీస్ ద్వారా.. మాటల రచయితగా త్రివిక్రమ్ నిలదొక్కుకున్నారు. ఆ తర్వాతే త్రివిక్రమ్ డైరెక్షన్ వైపు వెళ్లారు. అయితే త్రివిక్రమ్ ఇప్పటివరకు యంగ్ హీరోస్ తోనే వరుసగా మూవీస్ చేస్తూ వస్తున్నాడు. వవన్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేశ్ బాబు వంటి రెండో తరం హీరోలనే తన స్టైల్లో వెండితెరపై ఆవిష్కరిస్తున్నాడు. అయితే కెరీర్ తొలినాళ్లలో వెంకటేశ్ తో మూవీస్ చేసిన త్రివిక్రమ్.. మరోసారి విక్టరీతో జట్టు కడుతున్నట్లు కథనాలు వస్తున్నాయి.

ఇప్పటికే దృశ్యం-2, నారప్ప, ఎఫ్-3 మూవీస్ తో బిజీగా ఉన్న వెంకటేశ్.. తన 75 చిత్రాన్ని త్రివిక్రమ్ డైరెక్షన్ లో చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇటీవలే మళయాలంలో హిట్ అయిన డ్రైవింగ్ లైసెన్స్ మూవీ రీమేక్ హక్కులను తీసుకున్నాడు. దీంతో ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఈ రీమేక్ మూవీ వస్తుందని తెలుస్తుంది. తన ల్యాండ్ మార్క్ మూవీని.. త్రివిక్రమ్ డైరెక్షన్ లో చేయడానికి వెంకటేశ్ కూడా ఆసక్తి కనబరుస్తున్నాడట. ప్రస్తుతానికి SSMB 28 గా పిలవబడుతున్న ఈ చిత్రం వచ్చే వేసవిలో పట్టాలెక్కనుంది.

Also Read: కీలక నిర్ణయం తీసుకున్న ఆర్బీఐ.. ఆ బ్యాంక్ లైసెన్స్ రద్దు చేస్తున్నట్లు ప్రకటన… అయోమయంలో కస్టమర్లు..

చనిపోయిన వారి అకౌంట్‏లో నుంచి డబ్బులు ఎలా విత్ డ్రా చేసుకోవాలో తెలుసా.. నామినీ లేకపోతే ఎలా..

2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా