AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kiara Advani : ప్రొడ్యూసర్స్ ను భయపెడుతున్న కియారా.. అమ్మడి రెమ్యునరేషన్ కు అంతా షాక్…

జస్ట్ అరైవల్ హీరోలకు రెండుమూడు కోట్లు.. స్టార్ అనే ట్యాగ్ పడితే చాలు మినిమమ్ 10 కోట్లు... బిగ్ స్టార్స్ అనిపించుకోగానే పాతిక్కోట్లు...

Kiara Advani : ప్రొడ్యూసర్స్ ను భయపెడుతున్న కియారా.. అమ్మడి రెమ్యునరేషన్ కు అంతా షాక్...
అయితే  తెలుగులో  లైఫ్ ఇచ్చిన డైరెక్టర్ కొరటాలతోనే  తో కియారా మరో సినిమా చేస్తుందని తెలుస్తుంది. 
Rajeev Rayala
|

Updated on: May 14, 2021 | 8:09 PM

Share

Kiara Advani : జస్ట్ అరైవల్ హీరోలకు రెండుమూడు కోట్లు.. స్టార్ అనే ట్యాగ్ పడితే చాలు మినిమమ్ 10 కోట్లు… బిగ్ స్టార్స్ అనిపించుకోగానే పాతిక కోట్లు. మహేష్ లాంటి సూపర్ స్టార్లయితే 40 నుంచి 50 దాకా పలుకుతారు. ఇదీ రెమ్యునరేషన్ విషయంలో మన స్టార్ హీరోల బేసిక్ కాలిక్యులేషన్. మరి.. హీరోయిన్ల సంగతేంటి? వాళ్ళకిచ్చే దాంట్లో జస్ట్ టెన్ పర్సెంట్ అయినా ఇవ్వరా మాకు? అనేది.. సగటు స్టార్ హీరోయిన్ తీస్తున్న వ్యాల్యుబుల్ లాజిక్. కియారా అద్వానీ… పుట్టింది మరాఠీ గడ్డ మీదే అయినా.. తెలుగు సినిమానే ఆమె కెరీర్ కి సెకండ్ లైఫ్ ఇచ్చి ఊపిరి పోసింది. టాలీవుడ్ లో సైజబుల్ మార్కెట్ వున్న హీరోయిన్ గా కియారా అద్వానీకి నార్త్ లో కూడా బంపరాఫర్లు క్యూ కట్టేశాయి. కట్ చేస్తే.. ఇప్పుడామె రేట్ కార్డు కూడా అదే రేంజ్ లో వుంది. ఐదు కోట్లిస్తేనే చేస్తా అని మొహం మీదే చెప్పేస్తున్నారట కియారా. కబీర్ సింగ్ తర్వాత కియారా నిజంగానే హాట్ కేక్ అయ్యారు. తర్వాత చేసిన లక్ష్మీ., ఇందు కి జవానీ పెద్దగా నడవకపోయినా.. కియారా జోరు మాత్రం తగ్గలేదు. అందుకే.. సౌత్ లో ఎవరైనా ప్రొడ్యూసర్లు కబురు పెడితే.. కండిషన్లతో రిప్లయ్ ఇస్తున్నారట. తెలుగులో ఇప్పుడు అరడజను దాకా భారీ సినిమాలు స్టార్ హీరోయిన్ కోసం వెయిటింగ్ లో వున్నాయి. ఇంక్లూడింగ్ శంకర్-చరణ్ మల్టీలింగువల్. అటు.. కోలీవుడ్ లో కూడా కియారా కోసం ఒక బలమైన డెబ్యూ ఛాన్స్ రెడీగా వుందట. కాకపోతే.. ఆమె కోట్ చేసే రెమ్యునరేషన్ దగ్గరే పేచీ వస్తోంది మేకర్స్ కి. మీ హీరోలకు 50 కోట్ల దాకా ఇస్తున్నారు.. అందులో 10 శాతం కూడా నాకివ్వరా అనేది కియారా రైజ్ చేస్తున్న మెయిన్ లాజిక్. సౌత్ లో నయనతార తప్పితే మరో హీరోయిన్ ఎవ్వరూ ఇప్పటిదాకా 5 కోట్లు తీసుకోలేదు. నాదీ నయన్ రేంజేగా అని రాగం తీస్తున్నారట అంగ్రేజీ మీడియం బ్యూటీ. ఇప్పుడు కియారా కిట్టీలో నాలుగు హిందీ సినిమాలున్నా, సౌత్ లో తనకున్న బ్రాండ్ వ్యాల్యూను కాపాడుకోవాలంటే.. నాన్ హిందీ మూవీ ఒక్కటైనా చేసే తీరాలి. ఈ కమర్షియల్ సెంటిమెంట్ అయినా ఆమెను కొండమీదినుంచి కిందకు దించుతుందన్నది.. సౌత్ మేకర్స్ ఆశ.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Abhiram: ‘త‌ప్పులు అంద‌రూ చేస్తారు.. నా త‌ప్పులు బ‌య‌ట‌ప‌డ్డాయి అంతే’.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన రానా త‌మ్ముడు..

Young Tiger Junior NTR: పాన్ ఇండియా స్టార్ డమ్ ను పట్టించుకోని తారక్.. హాలీవుడ్ సినిమాకు సిద్దమైనట్టేనా..

Megastar Chiranjeevi : వైర‌స్ కంటే మ‌న భ‌యమే మ‌న‌ల్ని ముందుగా చంపేస్తోంది… దైర్యంగా ఉండండి: చిరంజీవి