Puri Jagannadh: ఎఫెక్ట్ లేకపోతే సైడ్ ఎఫెక్ట్ ఉండదు.. వ్యాక్సిన్ పై అపోహలు వద్దని తన స్టైల్ లో చెప్పిన పూరీ..
భారత్‌లో థర్డ్ వేవ్ ఖచ్చింగా వస్తుందని పూరీ జగన్నాథ్ అన్నారు. దేశంలోని సగం మందైనా వ్యాక్సిన్ వేయించుకోకపోతే.. మరో సారి కరోనా విరుచుకుకు పడడం ఖాయం అంటూ
Puri Jagannadh:
భారత్‌లో థర్డ్ వేవ్ ఖచ్చింగా వస్తుందని పూరీ జగన్నాథ్ అన్నారు. దేశంలోని సగం మందైనా వ్యాక్సిన్ వేయించుకోకపోతే.. మరో సారి కరోనా విరుచుకుకు పడడం ఖాయం అంటూ ఆయన జోస్యం చెప్పారు. వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్స్ అనే అంశంపై.. “పూరి మ్యూజింగ్స్” లో మాట్లాడిన పూరీ… తన స్టైల్లో.. వ్యాక్సిన్ అవసరాన్ని వివరిస్తూ.. అందర్నీ ఆక్టుకున్నారు. వ్యాక్సిన్ తీసుకోవాలంటే చాలామందిలో ఉన్న డౌట్ సైడ్ ఎఫెక్ట్సేనని.. వేసుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయోనన్న భయం అందరినీ వ్యాక్సిన్‌కు దూరం చేస్తోందిని పూరీ అన్నారు. “రోడ్డు మీద చెత్త నూనెలో వేసిన బజ్జీలు లొట్టలేసుకుంటూ తింటా. సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఆలోచించం.. ప్యాకెట్ సిగరెట్లు ఊది అవతల పడేస్తాం నో సైడ్ ఎఫెక్ట్స్.. ఫుల్ బాటిల్ తాగేసి, రెండో బాటిల్ ఓపెన్ చేస్తున్నప్పుడైనా ఎవరైనా డాక్టర్‌కు ఫోన్ చేసి సెకండ్ ఒపీనియన్ తీసుకుంటామా? అంటే అదీ లేదు. మనం తినే షుగర్, తాగే కూల్‌డ్రింక్స్, పిజ్జాలు, ఫ్రూట్ జ్యూస్‌లు, ఫ్రైడ్, గ్రిల్స్, పేస్ట్రీలు, కుకీస్ వీటంన్నింటి వల్ల మనలో ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. వాటిని పట్టించుకోం. కానీ ఒక సైంటిస్ట్ మన కోసం వ్యాక్సిన్ తయారు చేసి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దాన్ని ఆమోదించి, మెడిసన్ చదువుకున్న డాక్టర్ మనల్ని వ్యాక్సిన్ వేసుకోమంటే మనకి దాని మీద అనుమానం. ‘అన్నా సైడ్ ఎఫెక్ట్ ఏమైనా ఉంటాయా’ అని అడుగుతాం” ఇదీ మనందరి తీరని పూరీ విమర్శించారు. “సైడ్ ఎఫెక్ట్స్ అన్నింటికీ ఉంటాయి. ఎఫెక్ట్ లేకపోతే సైడ్ ఎఫెక్ట్ ఉండదు. పందిలా తింటే పొట్ట వస్తుంది. ఎక్సర్‌సైజ్ చేస్తే కండ పెరుగుతుంది. తాగితే తల తిరుతుంది. ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్. ఏ మెడిసిన్ తీసుకున్నా మనలో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అలా ఉంటే అవి పనిచేస్తున్నాయని అర్థం. ” అని ఆయన అన్నారు.
వ్యాక్సిన్ తీసుకుంటే బ్లడ్ క్లాట్స్ వస్తున్నాయని చాలా మంది భయపడి మానేస్తున్నారని.. అవి కూడా లక్ష కేసుల్లో ఒక్కటి మాత్రమేనని పూరీ తెలిపారు. యూరప్‌లో 50లక్షల మందికి వ్యాక్సిన్ ఇస్తే, 30మందికి మాత్రమే బ్లడ్ క్లాట్స్ వచ్చాయని.. మనుషుల్లో బ్లడ్ క్లాట్స్ ఎందుకు వస్తాయన్న అంశంపై డెన్మార్క్‌లో 10ఏళ్లు పరిశోధన చేసి.. ఏదో కారణంగా అన్ని వయసుల వారికి.. ఇలాంటి సమస్య వస్తుందని ఆయన వివరించారు. వ్యాక్సిన్ వల్ల 30 కేసులు వస్తే, మామూలుగా 90 కేసులు వస్తున్నాయట. మనకు ఏదైనా దెబ్బ తగిలితే బ్లడ్ క్లాట్స్ వస్తాయి. వృద్ధులకు వయసు వల్ల బ్లడ్ క్లాట్స్ వస్తాయి. వీటికి భయపడి వ్యాక్సిన్ వేసుకోవడం మానేయొద్దు” అంటూ పూరీ అందరికీ సూచించారు. డెవలప్ చేయడానికి పదేళ్లు పట్టే వ్యాక్సిన్‌ను సైంటిస్ట్‌లు ఎంతో కష్టపడి మన కోసం ఏడాదిలోనే తయారు చేశారని అది చాలా గొప్ప విషయమని ఆయన అన్నారు. ‘పదేళ్లు పట్టాలి కదా! మేం నమ్మం’ అని అనవద్దు. వ్యాక్సిన్ కంటే మంచి మందు లేదని.. పూరీ నొక్కి చెప్పారు,
రక్తం గడ్డకడుతుందని.. జ్వరం వస్తుందని వ్యాక్సిన్ వేయించుకోకుండా నిర్లక్షం చేయవద్దని ఆయన ప్రజలకు సూచించారు. జ్వరం వస్తే వ్యాక్సిన్ పనిచేస్తోందనట్లు అని తెలిపారు. దయ చేసి వ్యాక్సిన్‌ను వృథా చేయొద్దని.. ఆయన ప్రజలను వేడుకున్నారు. వ్యాక్సిన్ దొరకడమే కష్టమైన రోజులివి. దొరికితే మాత్రం వెంటనే వెళ్లి వేయించుకోవాలని ప్రజలకు సూచించారు. మీరు టైమ్‌కు వెళ్లకపోతే వ్యాక్సిన్‌లు వృథా అవుతాయని.. అలా చాలా వ్యాక్సిన్‌లు వృథా అయ్యాయని పూరీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక చివరగా “భారత్‌లో సగం జనాభా అయినా వ్యాక్సిన్ వేయించుకోకపోతే, థర్డ్ వేవ్ కచ్చితంగా వస్తుంది” అంటూ తన మ్యూజింగ్స్‌ని ముగించారు.