Virata Parvam: ఓటీటీ వైపు చూస్తున్న రానా ‘విరాట పర్వం’.. ఆలస్యం అవసరమా అని ఆలోచిస్తున్న మేకర్స్..
కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా థియేటర్లన్నీ మూత పడడంతో.. రాబోయే సినిమాల నిర్మాతలు ఓటీటీ వేదికల వైపు చూస్తున్నారు.
Virata Parvam: కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా థియేటర్లన్నీ మూత పడడంతో.. రాబోయే సినిమాల నిర్మాతలు ఓటీటీ వేదికల వైపు చూస్తున్నారు. ఆలస్యం చేయకుండా ఓటీటీ వేదికల్లో రిలీజ్ చేసి.. నష్టాల భారిన పడకుండా చూస్తున్నారు. మంచి రేటు వస్తే.. ఓటీటీలో తమ సినిమాను రిలీజ్ చేయడానికి సిద్ధం అంటూ సంకేతాలిస్తున్నారు. తాజాగా అలాంటి నిర్ణయమే తీసుకున్నారట “విరాట పర్వం” మూవీ మేకర్స్. ఇప్పుడిదే విషయం అటు ఇండస్ట్రీలోనూ.. ఇటు సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారింది.
నక్సలైట్ పోరాట నేపథ్యంలో రానా హీరోగా, వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “విరాట పర్వం”. సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తుండగా.. ప్రియమణి లేడీ నక్సలైట్గా నటిస్తున్నారు. అయితే ఎప్పుడో షూటింగ్ ముగించుకున్న ఈ సినిమా ఏప్రిల్ 30న రిలీజ్ కావాల్సి ఉంది. కాని కరోనా కారణంగా చివరికి విడుదల ఆగిపోయింది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, సాంగ్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దాంతో సినిమా పై అంచనాలు కూడా ఏర్పడ్డాయి. ఇక మరెక్కువ రోజులు విడుదల వాయిదా వేయడం మంచిది కాదనుకున్న ఈ మూవీ మేకర్స్. ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయడాని నిర్ణయం తీసుకున్నారట. ఈమేరకు ప్రముఖ ఓటీటీ సంస్థలతో చర్చలు జరుపుతున్నారని ఇండస్ట్రీలో టాక్. ఇక అన్నీ అనుకున్నట్టు జరిగితే రానా అతి తొందర్లో ఓటీటీలో మనల్ని నక్సలైట్‌గా కనువిందు చేయబోతున్నారు. త్వరలోనే ఈ విషయం పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
మరిన్ని ఇక్కడ చదవండి :