Renu Desai: అవసరమైన వారి మెసేజులు చూడలేక పోతున్నానని రేణూ దేశాయ్ ఆవేదన.. అసలు విషయం ఏంటంటే…
కోవిడ్ బాధతులకు అండగా ఉంటానని.. వారికి తన వంతు సాయంగా బెడ్స్‌ను, ఆక్సీజన్‌ను, మెడిసిన్స్‌ను అందిస్తానని నటి రేణుదేశాయ్ ఇటీవల...
renu desai: అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే తనకు మెసేజ్ చేయాలని నటి రేణూ దేశాయ్ కోరారు. ఈ మేరకు ఓ వీడియోను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. కోవిడ్ బాధతులకు అండగా ఉంటానని.. వారికి తన వంతు సాయంగా బెడ్స్‌ను, ఆక్సిజన్‌ను, మెడిసిన్స్‌ను అందిస్తానని నటి రేణూ దేశాయ్ ఇటీవల సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో అభిమానులతో మాట్లాడుతూ– ‘‘సోషల్ మీడియాను సినిమా ప్రమోషన్స్ కోసం వాడుకునే వాళ్లు కూడా గత పదిహేను రోజులుగా కోవిడ్ సమాచారాన్ని చేరవేస్తూ ప్రజల ప్రాణాలను కాపాడుతుండటం సంతోషం. నా ఇన్‌స్టాగ్రామ్ మెసేజ్ ఇన్ బాక్స్ ఇప్పటి నుంచి ఓపెన్‌లో పెడతా. ప్లాస్మా లేదా ఆక్సిజన్ సిలిండర్లు లేదా హాస్పిటల్స్‌లో బెడ్స్ లేదా మందులు.. వంటివి అవసరం ఉంటే నాకు మెసేజ్ చేస్తే, వారికి సహాయం చేయడానికి నా వంతు కృషి చేస్తాను”. అన్ని అన్నారు.
దీంతో చాలా మంది కోవిడ్ బాధితులు సాయం కోసం నటి రేణూ దేశాయ్‌కి ఇన్‌స్టాలో మెసేజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రేణూ దేశాయ్ వారందరినీ రెక్వెస్ట్ చేశారు. అత్యవసరమైతేనే తనకు మెసేజ్ చేయాలని.. అలాంటి సందర్భంలో తన స్వచ్ఛంద సంస్థ తరపున వారందరికీ బెడ్స్, ఆక్సిజన్, మందులు లాంటివి అందించగలనని ఆమె అన్నారు. అంతే కాని .. అనవసరమైన మెసేజులతో తన ఇన్‌బాక్స్ నింపవద్దని.. అలా చేస్తే.. అవసరమైన వారి మెసేజులు చూడలేకపోతున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే రేణూ దేశాయ్.. కోవిడ్ బాధితులకు అండగా నిలుస్తున్నారు. అడిగిన వారికి ఆసుపత్రుల్లో బెడ్స్, ఆక్సీజన్, మందులను అందిస్తూ ఆదుకుంటున్నారు.
View this post on Instagram
మరిన్ని ఇక్కడ చదవండి :