Viral Video: దొంగ అవతారమెత్తిన కాకి.. తెలివిగా డబ్బులు కాజేస్తున్న వైనం.. వైరల్ అవుతున్న వీడియో..

Crow Stolen Money: ఇటీవల కాలంలో ఎక్కువగా జంతువులు, పక్షులుకు సంబంధించిన ఫన్నీ వీడియోలు క్షణాల్లోనే వైరల్ అవుతున్నాయి...

  • Publish Date - 6:57 pm, Fri, 14 May 21
Viral Video: దొంగ అవతారమెత్తిన కాకి.. తెలివిగా డబ్బులు కాజేస్తున్న వైనం.. వైరల్ అవుతున్న వీడియో..
Crow

Crow Stolen Money: ఇటీవల కాలంలో ఎక్కువగా జంతువులు, పక్షులుకు సంబంధించిన ఫన్నీ వీడియోలు క్షణాల్లోనే వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు కూడా వీటిని చూసేందుకు చాలా ఇష్టపడుతున్నారు. తాజాగా ట్విట్టర్‌లో ఓ కాకి వీడియో హల్‌చల్ చేస్తోంది. అసలు విషయమేంటంటే.. ఓ కాకి డబ్బులు దొంగతనం చేస్తూ రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోయింది. ఇది నమ్మశక్యంగా లేనప్పటికీ మీరు విన్నది నిజమే.

ఈ కాకి చేసిన పని చూస్తే ఎవరైనా దాని తెలివిని మెచ్చుకోకుండా ఉండలేరు. 13 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో.. ఓ కాకి నోటితో డబ్బులు కరుచుకుని ఇంటి బాల్కనీ అవతలి వైపు నిల్చుని ఉంది. అది ఎక్కడి నుంచి వాటిని తీసుకొచ్చిందో తెలియదు కానీ.. ఆ ఇంట్లోని వ్యక్తి బాల్కనీ విండో ఓపెన్ చేయగానే కాకి లోనికి దూరి.. ఇంట్లో ఉన్న గల్లా పెట్టె వద్ద వాలి..దానిలో డబ్బులు దాచిపెట్టింది.

ఇదంతా గమనించిన ఆ వ్యక్తి ఆ గల్లా పెట్టె ఓపెన్ చేసి చూడగా అందులో డబ్బులు ఉన్నాయి. అంటే కాకి ఎక్కడి నుంచో డబ్బులు తీసుకొచ్చి.. ఇక్కడ జమ చేస్తుందా?.. లేక అక్కడి డబ్బులనే తీసుకెళ్లి పోతుందా అనేది స్పష్టత లేదు. మొత్తానికైతే డబ్బులను మాత్రం ఎక్కడి నుంచో ఎక్కడికో ఎత్తుకుపోతుంది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లంతా కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.