AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: ‘సెక్స్ కోసం వెళ్లాలి’.! ఈ-పాస్ ఇవ్వండి.. పోలీసులకు వింత రిక్వెస్ట్.. అసలు విషయమేమిటంటే.!

Unsual E-Pass Request: ఒక్క చిన్న తప్ప.. ఆ వ్యక్తిని ముప్పుతిప్పలు పెట్టింది. ఈ-పాస్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న అతడు అప్లికేషన్ మీద...

Viral News: 'సెక్స్ కోసం వెళ్లాలి'.! ఈ-పాస్ ఇవ్వండి.. పోలీసులకు వింత రిక్వెస్ట్.. అసలు విషయమేమిటంటే.!
No Entry
Ravi Kiran
|

Updated on: May 14, 2021 | 7:43 PM

Share

Unsual E-Pass Request: ఒక్క చిన్న తప్ప.. ఆ వ్యక్తిని ముప్పుతిప్పలు పెట్టింది. ఈ-పాస్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న అతడు అప్లికేషన్ మీద ‘సిక్స్’ రాయబోయి ‘సెక్స్’ అని రాశాడు. పోలీసులు అది చూసి షాక్ కావడమే కాకుండా ఆకతాయి చేసిన పని అనుకుని అతడిని గుర్తించి పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. విచారణ చేయగా అతడు చెప్పిన సమాధానానికి పోలీసులకు ఏం చేయాలో అర్ధం కాని పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటన కేరళలో చోటు చేసుకోగా.. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వివరాలు..

కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ప్రస్తుతం కేరళలో లాక్‌డౌన్ కొనసాగుతోంది. దీనితో అక్కడ అత్యవసర ప్రయాణాలకు ఈ-పాస్ తప్పనిసరి. ఇందులో భాగంగానే కన్నూర్‌లోని కన్నాపూర్‌కు చెందిన ఓ వ్యక్తి ఈ పాస్‌ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఆ అప్లికేషన్‌లో సదరు వ్యక్తి ఎందుకోసం వెళ్ళాలి.? అనే కాలమ్‌లో ‘సెక్స్ కోసం వెళ్లాలి'(Need To Go For Sex) అని రాశాడు. దీనితో ఖంగుతిన్న పోలీసులు.. ఈ విషయంపై అసిస్టెంట్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.

ఆయన విచారణకు ఆదేశించగా.. ఆ వ్యక్తిని గుర్తించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తాను తప్పుగా రాశానని.. సిక్స్ అని రాయబోయి సెక్స్ అని రాసినట్లు అతడు విచారణలో తెలిపాడు. చూసుకోకుండానే ఖంగారులో పంపించేశానని పోలీసులతో చెప్పాడు. ఇక అతడు చెప్పిందంతా వాస్తవమని నమ్మి వదిలేశారు. జరిగిన తప్పుకు అతడు క్షమాపణలు చెప్పడంతో ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

Also Read:

కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు జగన్ సర్కార్ తీపికబురు.. పదవీ కాలం పొడిగింపు..

వాట్సాప్‏లో సీక్రెట్ చాట్ దాచుకోండిలా.. సరికొత్త సర్వీస్ అందుబాటులోకి.. వివరాలు ఇవే.!

డేంజరస్ స్టంట్స్ చేసిన కోతి.. పులులకు గట్టి షాక్.. నవ్వులు పూయిస్తున్న వీడియో..