International Day of Families 2021: అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం.. ఈ రోజు చరిత్ర, ప్రాముఖ్యత వివరాలు..
International Day of Families 2021: సంతోషం, బాధ, దుఃఖం, ప్రేమ, అనుబంధాలు, కలహాలు, ఆత్మీయతలు ఇవన్నీ ఒకేచోట కలిసుండేదే కుటుంబం.
International Day of Families 2021: సంతోషం, బాధ, దుఃఖం, ప్రేమ, అనుబంధాలు, కలహాలు, ఆత్మీయతలు ఇవన్నీ ఒకేచోట కలిసుండేదే కుటుంబం. భిన్న రకాల మనస్తత్వాలు, అభిప్రాయాలున్న వ్యక్తులను ఒకేచోట అనుబంధంగా మర్చేస్తుంది కుటుంబం. మన భారతీయ కుటుంబం.. అంతులేని శక్తికి, బలానికి సూచికగా నిలుస్తోంది. పిల్లల ఆనందాన్ని తమ సంతోషంగా భావించే తల్లిదండ్రులు, కన్నవారి కలలను సైతం నెరవేర్చాలనే తపన పిల్లలది. ఇలా ఎల్లప్పుడూ ప్రేమ ఆత్మీయతలతో కలిసుండేది ఫ్యామిలీ. ఇక మన భారతీయ సంప్రదాయంలో ఉమ్మడి కుటుంబాలు ప్రత్యేకం. మే 15 అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం. మరి ఈరోజును ఎందుకు జరుపుకుంటారు ? ఈరోజుకు ఉన్న ప్రాముఖ్యత, చరిత్ర ఎంటో తెలుసుకుందామా.
చరిత్ర.. 1983లో ఐక్యరాజ్య సమితి చూపు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కుటుంబాల వైపు మళ్లింది. ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, సోషల్ డెవలప్ మెంట్ కమిషన్ అప్పటి సెక్యూరిటీ జనరల్ కుటుంబాల సమస్యలు, వారి అవసరాల గురించి మరింత అవగాహన పెంచుకోవాలనుకుంది. మే 29, 1985న ఆమోదించిన తీర్మానంలో కౌన్సిల్ సిఫారసు పై జనరల్ అసెంబ్లీ అభివృద్ధి ప్రక్రియలో కుటుంబాలు అనే అంశాన్ని కూడా చేర్చారు. డిసెంబర్ 1989లో ప్రతి సంవత్సరం మే 15న జరుపుకునే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని ప్రకటించింది. ప్రతి సంవత్సరం విభిన్న ఇతివృత్తాన్ని కలిగి ఉంటుంది. ఇది కుటుంబ సమస్యలను నియంత్రించే విషయాలను తెలియజేస్తుంది.
ప్రాముఖ్యత.. ఈరోజు అసలు లక్ష్యం ప్రేమానుబంధాల కుటుంబాలను నిర్మించడం. అంటే ప్రస్తుతం కుటుంబాలలో ప్రేమ, ఆత్మీయతలు కరువైపోయాయి. చిన్న చిన్న అపార్థాలతో కుటుంబాలు చీలిపోతున్నాయి. ప్రపంచం అభివృద్ది చెందుతున్న క్రమంలో ఈ మార్పు కుటుంబాలపై ప్రభావం చూపిస్తుంది. అయితే ఈ మార్పును వారు ఎలా స్వీకరిస్తారనేది వారిపైనే ఆధారపడి ఉంది. రోజూ వచ్చే సమస్యలు, వాటి మీద వారికున్న అవగాహన పెంచుకోవడం వలన. కుటుంబాల పై అవగాహన మరింత పెరిగే అవకాశం ఉంది.
Also Read: ఎల్ఐసీలో అదిరిపోయే స్కీమ్.. ఇందులో చేరితే ప్రతి 3 నెలలకు డబ్బులు.. ఒకేసారి రూ.10 వేలు అందుకునే..
Corona Virus: కరోనా వైరస్ రాకుండా ఉండాలంటే వీటిని తరచూ శుభ్రం చేయాల్సిందే… అవెంటో తెలుసుకుందామా..