ఎల్ఐసీలో అదిరిపోయే స్కీమ్.. ఇందులో చేరితే ప్రతి 3 నెలలకు డబ్బులు.. ఒకేసారి రూ.10 వేలు అందుకునే..

మీరు ఎల్ఐసీ సభ్యులా ? మీరు ఎల్ఐసీలో పాలసీ తీసుకోవాలనుకుంటున్నారా ? అయితే ముందుగా మీరు కొన్ని విషయాలను తెలుసుకోవాల్సిందే.

ఎల్ఐసీలో అదిరిపోయే స్కీమ్.. ఇందులో చేరితే ప్రతి 3 నెలలకు డబ్బులు.. ఒకేసారి రూ.10 వేలు అందుకునే..
Lic Policy
Follow us
Rajitha Chanti

|

Updated on: May 15, 2021 | 6:28 AM

మీరు ఎల్ఐసీ సభ్యులా ? మీరు ఎల్ఐసీలో పాలసీ తీసుకోవాలనుకుంటున్నారా ? అయితే ముందుగా మీరు కొన్ని విషయాలను తెలుసుకోవాల్సిందే. కేంద్ర ప్రభుత్వ రంగానికి చెందిన దేశీయ అతిపెద్ద బీమా రంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (LIC) తమ కస్టమర్లకు ఎన్నో రకాల పాలసీలను అందిస్తోంది. ఇందులో ముఖ్యంగా మనీ బ్యాంక్, పెన్షన్ ప్లాన్లు కూడా ఉన్నాయి. అయితే ఈ పాలసీలు తీసుకోవడం వలన ప్రతి నెల క్రమం తప్పకుండా డబ్బులు అందుతాయి. మరీ ఈ పాలసీల గురించి పూర్తి వివరాలను తెలుసుకుందామా..

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) అందించే పాలసీలలో ఎల్ఐసీ జీవన్ శాంతి కూడా ఒకటి. ఈ పాలసీ తీసుకోవడం వలన ప్రతి నెలా డబ్బులు పొందవచ్చు. అంటే ఇది నాన్ లింక్డ్ స్కీమ్. ఇందులో ప్రతి నెల పెన్షన్ కూడా వస్తుంది. కానీ ముందుగా మీరు ఈ పాలసీలో కొంతవరకు డబ్బులు కట్టాల్సి ఉంటుంది. అంటే ఒకేసారి ప్రీమియం చెల్సించాల్సి ఉంటుంది. ఇక పెన్షన్ ఎప్పటి నుంచి తీసుకోవాలనేది మీ ఇష్టం. ఒక్కసారి పాలసీ తీసుకున్న తర్వాత.. సంవత్సరం నుంచి తీసుకుంటారా ? లేదా 5 సంవత్సరాల తర్వాత తీసుకుంటారా? లేదా పదేళ్ల తర్వాత తీసుకుంటారా ? అనేది మీరు పాలసీ తీసుకునే సమయంలోనే తెలియజేయాల్సి ఉంటుంది. మీరు ఎంచుకున్న సమయం నుంచి మీకు పెన్షన్ వస్తుంది. అంటే మీకు 30 సంవత్సరాల వయసు ఉంటే.. పదేళ్ల తర్వాతి నుంచి పెన్షన్ తీసుకోవాలని భావిస్తున్నారు. అప్పుడు మీరు  రూ. 5 లక్షలు కడితే.. మీకు మూడు నెలలకు ఒకేసారి  రూ. 10 వేలు వస్తుంటాయి. అలా మీకు జీవితాంతం పెన్షన్ వస్తూనే ఉంటుంది. ఈ పాలసీని 30 ఏళ్ల నుంచి 79 ఏళ్ల వయసు వారు కూడా తీసుకోవచ్చు. పెన్షన్ మీరు ఎప్పటి నుంచి పొందుతారనే అంశం విషయానికి వస్తే.. ఏడాది నుంచి 20 ఏళ్లలోపు ఎప్పుడైనా పొందొచ్చు. మీరు ఎంచుకునే సమయానికే పెన్షన్ వస్తుంది. ఒకవేళ పాలసీదారుడు చనిపోతే ఆ బీమా మొత్తం నామినీకి లభిస్తుంది.

Also Read: చనిపోయిన వారి అకౌంట్‏లో నుంచి డబ్బులు ఎలా విత్ డ్రా చేసుకోవాలో తెలుసా.. నామినీ లేకపోతే ఎలా..

India Post: వినియోగదారులకు బంపర్ ఆఫర్.. ఇందులో చేరితే మీ చేతికి రూ. 7 లక్షలు.. ఈ పోస్టాఫీస్ స్కీమ్ అదుర్స్..

కస్టమర్లకు అలర్ట్… పోస్టాఫీస్ వర్క్ టైమింగ్స్ మారాయి..రోజుకూ కొన్ని గంటలే పనిచేయనున్న కార్యాలయాలు..