Corona Virus: కరోనా వైరస్ రాకుండా ఉండాలంటే వీటిని తరచూ శుభ్రం చేయాల్సిందే… అవెంటో తెలుసుకుందామా..

Covid Care: కరోనా వైరస్ కారణంగా మన జీవన విధానంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఆహారపు అలవాట్ల నుంచి వ్యక్తిగత శుభ్రత వరకు ఇలా

Corona Virus: కరోనా వైరస్ రాకుండా ఉండాలంటే వీటిని తరచూ శుభ్రం చేయాల్సిందే... అవెంటో తెలుసుకుందామా..
Corona Virus
Follow us

|

Updated on: May 15, 2021 | 7:42 AM

Covid Care: కరోనా వైరస్ కారణంగా మన జీవన విధానంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఆహారపు అలవాట్ల నుంచి వ్యక్తిగత శుభ్రత వరకు ఇలా ప్రతి విషయంలో అనేక మార్పులు జరిగాయి. ముఖ్యం ఈ కరోనా కాలంలో చాలా మంది వ్యక్తిగత శుభ్రత మాత్రమే కాకుండా.. పరిసరాల శుభ్రతకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే ప్రస్తుతం కోవిడ్ సెకండ్ వేవ్ వేగంగా వ్యాపిస్తున్న క్రమంలో వ్యక్తిగత శుభ్రతతోపాటు మనం రోజు ఉపయోగించే కొన్ని వస్తువులను కూడా తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలి. మరీ అవెంటీ… ఎలా వాటిని శుభ్రం చేసుకోవాలో తెలుసుకుందామా.

1. మనం రోజూ ఉపయోగించే మంచం, పరుపు, దుప్పటి, తలగడ మీద ఎక్కువగా బ్యాక్టీరియా ఉంటుంది. దీనివలన నిద్రపట్టకపోవడమే కాకుండా.. ఆరోగ్య సమస్యలను కలుగజేస్తుంది. అందువలన మంచాన్ని రోజూ శుభ్రం చేసుకోవడమే కాకుండా.. దుప్పటి, తలగడలను ఎప్పుడూ ఉతుక్కోవాలి.

2. ఇక తర్వాత మనం రోజూ ఉపయోగించే వాటర్ బాటిల్. దీనిని యాంటి బాక్టీరియల్ సబ్బు, వేడినీటితో కడగాలి. లేదా సహజంగా బ్యాక్టీరియాను చంపే గుణమున్న రాగి బాటిల్స్ ఉపయోగించడం మరీ మంచిది.

3. రోజూ మనం ఉపయోగించే కంప్యూటర్ కీబోర్డు మీద బోలెడన్ని క్రిములు ఉంటాయి. వాటి వైరస్ సోకే ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది. అందువలన సేఫ్ క్లీనర్ లేదా ఆల్కహాల్ తో కీబోర్డ్ శుభ్రం చేసుకోవడం ఉత్తమం.

4. ఇక వేళ్లకు పెట్టుకునే ఉంగరాల ద్వారా బ్యాక్టీరియా వ్యాపిస్తుంది. వాటిని ఎప్పుడూ యాంటీ బాక్టీరియల్ సబ్బు, వేడినీరు, లేదా ఆభరణాలను శుభ్రం చేసుకునే లిక్విడ్ తో శుభ్రం చేయాలి.

5. అలాగే మనం ఎల్లప్పుడూ ఉపయోగించే ఈ స్మార్ట్ ఫోన్ వైరస్ వ్యాప్తికి ఎక్కువగా సహయపడుతుంది. స్మార్ట్ ఫోన్ స్క్రీన్ పై హానికారక బాక్టీరియా ఉంటుంది. అందువలన ఫోన్ ను ఆల్కహాల్ తో శుభ్రం చేసుకోవాలి. అలాగే టీవీ, ఏసీ, రిమోట్లను తరచూ తుడుస్తూ ఉండాలి.

6. ఇక కాఫీ, టీ కప్పులను కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. ఇవే కాకుండా ఇంటి వంటగదిని, ఇతర గదులను, పాత్రలను శుభ్రం చేయడానికి ఉపయోగించే స్పాంజిలను ఒకటి లేదా రెండు నిమిషాల పాటు వేడి నీటిలో మరిగించాలి. డోర్ హ్యాండిల్స్, బాత్ రూం సింక్ యాంటి బాక్టీరియల్ క్లీనర్ తో శుభ్రం చేయాలి.

7. అలాగే మనం రోజూ వాడే టూత్ బ్రష్ ను యాంటి బ్యాక్టీరియల్ మౌత్ వాష్ లో నానబెట్టి.. ఆ తర్వాత బ్రష్ శుభ్రం చేస్తే బ్యాక్టీరియా నశిస్తుంది.

Also Read: ఎల్ఐసీలో అదిరిపోయే స్కీమ్.. ఇందులో చేరితే ప్రతి 3 నెలలకు డబ్బులు.. ఒకేసారి రూ.10 వేలు అందుకునే..\

చనిపోయిన వారి అకౌంట్‏లో నుంచి డబ్బులు ఎలా విత్ డ్రా చేసుకోవాలో తెలుసా.. నామినీ లేకపోతే ఎలా..