దోసకాయలు ఎందుకు చేదుగా ఉంటాయి..! ఆ చేదును ఎలా వదిలించుకోవాలి..? తెలుసుకోండి..
Cucumbers are Bitter : వేసవిలో దోసకాయలు తింటే శరీరం చల్లబడుతుంది. అయితే కొన్నిరకం దోసకాయలు చేదుగా ఉంటాయి.
Cucumbers are Bitter : వేసవిలో దోసకాయలు తింటే శరీరం చల్లబడుతుంది. అయితే కొన్నిరకం దోసకాయలు చేదుగా ఉంటాయి. పైకి చూస్తే తాజాగానే ఉంటాయి కానీ కట్ చేసి తిందామంటే చేదుగా ఉంటాయి. ప్రతి ఒక్కరు చాలా సందర్భాల్లో ఈ సమస్యను ఎదుర్కొనే ఉంటారు. దీనికి ఒక ప్రత్యేక కారణం ఉంది. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
దోసకాయలు పుచ్చకాయల వంటివి. ఈ మొక్కలు కుకుర్బిటాసిన్ అనే పదార్థాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఇది రుచిలో చాలా చేదుగా ఉంటుంది అంతేకాకుండా చాలా హాని చేస్తుంది. చాలా సందర్భాలలో ఈ పదార్ధం ఆకులలో సరఫరా అవుతుంది కానీ కొన్నిసార్లు ఇది కాయలోకి ప్రవేశిస్తుంది. దీనివల్ల చేదు లక్షణం వస్తుంది. అధిక గాలి, ఉష్ణోగ్రత వల్ల మొక్కలు వేడితో బాధపడుతుంటే కుకుర్బిటాసిన్ ఉత్పత్తి అవుతుంది. దీంతో దోసకాయలు చేదుగా మారుతాయి.
రెండో కారణం మొక్కలు భారీగా నీరు తాగడం వల్ల చేదుగా మారుతాయి. దోసకాయ మొక్కలు సుదీర్ఘ కరువు నుంచి బయటపడి ఒకేసారి భారీ నీరు తాగడం వల్ల ఒత్తిడి పెరిగి కాయలలో చేదు ఏర్పడటానికి కారణమవుతుంది.మూడవ కారణం ఉష్ణోగ్రత మార్పుల వల్ల చేదుగా మారుతాయి. దురదృష్టవశాత్తు కొన్ని వివరించలేని కారణాల వల్ల, కొన్ని మొక్కలు దోసకాయల చేదు రుచికి కారణమైన జన్యువును కలిగి ఉంటాయి. కుకుర్బిటాసిన్ నీటికి భయపడుతుంది. చేదు దోసకాయలను కొన్ని గంటలు నీటిలో నానబెట్టడానికి ప్రయత్నించండి. అప్పుడు చేదు తగ్గే అవకాశాలు ఉన్నాయి.