AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరగడం లేదా..! మతిమరుపు పెరిగిందా..? అయితే గ్రీన్ టీని ఈ స్టైల్‌లో ట్రై చేయండి..

Green Tea Benefits : కరోనా సెకండ్ వేవ్ దేశంలో అల్లకల్లోలం స‌ృష్టిస్తోంది. ఇటువంటి సమయంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా

పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరగడం లేదా..! మతిమరుపు పెరిగిందా..? అయితే గ్రీన్ టీని ఈ స్టైల్‌లో ట్రై చేయండి..
Green Tea
uppula Raju
|

Updated on: May 15, 2021 | 12:53 PM

Share

Green Tea Benefits : కరోనా సెకండ్ వేవ్ దేశంలో అల్లకల్లోలం స‌ృష్టిస్తోంది. ఇటువంటి సమయంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. అయితే ప్రతిరోజు ఒక కప్పు గ్రీన్ టీ తాగితే అద్భుత ఫలితాలు ఉంటాయి. బరువు తగ్గడానికి కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. వివిధ అధ్యయనాల ప్రకారం.. గ్రీన్ టీ మన శరీరాలను శుభ్రపరచడానికి, మన మనసును ఉత్తేజపరచడానికి సహాయపడుతుంది. గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఒత్తిడిని, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

గ్రీన్ టీ.. కామెల్లియా సినెన్సిస్ ఆక్సీకరణం ఆకుల నుంచి తయారవుతుంది. ఇది తక్కువ ప్రాసెస్ చేయబడినందున ఇది పాలీఫెనాల్స్, ఎక్కువ యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. ఒక అధ్యయనం ప్రకారం.. అల్జీమర్స్ వ్యాధి, టైప్ 2 డయాబెటిస్, లైవ్ డిజార్డర్స్ ప్రమాదాన్ని తగ్గించడంలో గ్రీన్ టీ ఉపయోగపడుతుంది.

1. బరువును తగ్గిస్తుంది : గ్రీన్ టీలో పాలీఫెనాల్ ఉంటుంది. ఇది కొవ్వును వేగంగా ఆక్సీకరణం చేయడంలో సహాయపడుతుంది. ఇది మన శరీరం ద్వారా ఆహారాన్ని కేలరీలుగా మార్చే రేటును తీవ్రతరం చేస్తుంది. గ్రీన్ టీ కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా మీ కడుపు చుట్టూ ఉన్న కొవ్వును ఇట్టే కరిగిస్తుంది. ఇలా మీ బరువును తగ్గిస్తుంది.

2. క్యాన్సర్‌తో పోరాడవచ్చు: క్యాన్సర్‌తో ప్రపంచంలో అత్యధిక మరణాలు సంభవిస్తున్నాయి. ఇది శరీరంలో అనియంత్రిత కణాల పెరుగుదల వల్ల వస్తుంది. శరీరంలో ఆక్సీకరణ వల్ల కలిగే నష్టం క్యాన్సర్ అభివృద్ధికి దోహదం చేస్తుంది. గ్రీన్ టీ యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉన్నందున ఇది రొమ్ము క్యాన్సర్, కొలొరెక్టల్ క్యాన్సర్, ఎసోఫాగియల్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ వంటి వివిధ రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

3. డయాబెటీస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది: డయాబెటిస్‌పై గ్రీన్ టీ ప్రభావం గురించి అధ్యయనాలు అస్థిరంగా ఉన్నప్పటికీ, టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని ఇది తగ్గిస్తుందని కొందరు తేల్చారు. స్పష్టంగా గ్రీన్ టీ శరీరంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రించడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి, ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచడానికి సహాయపడుతుంది.

4. కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతుంది: ఒక అధ్యయనం ప్రకారం.. రోజుకు 10 కప్పుల గ్రీన్ టీ తాగడం వల్ల మొత్తం కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గ్రీన్ టీ తాగడం వల్ల రక్తంలో మంచి కొలెస్ట్రాల్ నిష్పత్తి మెరుగుపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీనిని పానీయంగా లేదా క్యాప్సూల్‌గా తీసుకోవచ్చు.

5. మెదడు పనితీరును పెంచుతుంది: గ్రీన్ టీ తీసుకోవడం వల్ల మెదడు కార్యకలాపాలను మెరుగుపరుస్తుంది. ఎందుకంటే ఇందులో ప్రసిద్ధ స్టిమ్యులేటర్ కెఫిన్ ఉంటుంది. కెఫిన్ మొత్తం కాఫీలో లేనప్పటికీ మీ మెదడును ఉత్తేజపరిచేందుకు ఇది సరిపోతుంది.

Viral News: గర్బవతి అయిందని ఉద్యోగం నుంచి తీసేసిన సంస్థ.. ఎదురుగా రూ.14లక్షలు చెల్లించింది.!

Virushka: మేముసైతం.. మా లక్ష్యం రూ.11 కోట్లు చేరుకున్నాం.. సహకరించిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు

ప్రభుత్వ ఆస్పత్రిలో కొవిడ్ పేషెంట్ ఆత్మహత్య..! వార్డులో ఉరి వేసుకొని మృతి.. కారణాలు ఇలా ఉన్నాయి..?