AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virushka: మేముసైతం.. మా లక్ష్యం రూ.11 కోట్లు చేరుకున్నాం.. సహకరించిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు

కోవిడ్ బాధితులకు సహాయం అందించేందుకు టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ, సతీమణి అనుష్కశర్మ ప్రారంభించిన ‘ఇన్‌ దిస్‌ టుగెదర్‌’ ఫండ్‌ రైజింగ్‌ కార్యక్రమానికి మంచి ఆదరణ లభించింది. ఈ మేరకు తాము అనుకున్న రూ.11 కోట్ల టార్గెట్‌ను చేరుకున్నట్లు...

Virushka: మేముసైతం.. మా లక్ష్యం రూ.11 కోట్లు చేరుకున్నాం.. సహకరించిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు
Anushka Sharma And Virat Ko
Sanjay Kasula
|

Updated on: May 15, 2021 | 12:07 PM

Share

కోవిడ్ బాధితులకు సహాయం అందించేందుకు టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ, సతీమణి అనుష్కశర్మ ప్రారంభించిన ‘ఇన్‌ దిస్‌ టుగెదర్‌’ ఫండ్‌ రైజింగ్‌ కార్యక్రమానికి మంచి ఆదరణ లభించింది. ఈ మేరకు తాము అనుకున్న రూ.11 కోట్ల టార్గెట్‌ను చేరుకున్నట్లు విరుష్క జోడి ప్రకటించింది. తాము చేపట్టిన కార్యక్రమంలో సహకరించిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు అంటూ అనుష్క తన ఇంస్టాగ్రామ్‌లో పోస్టు చేసింది.

.

ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోలో అనుష్క, విరాట్ మాట్లాడుతూ “అందరికీ హలో. మీ అమూల్యమైన సహకారానికి ధన్యవాదాలు. మా కెట్టో ప్రచారం ఇప్పుడు ముగిసింది. మేము మా లక్ష్యాన్ని అధిగమించాము. మీకు ధన్యవాదాలు, అన్ని నిధులు మన దేశంలో కోవిడ్ ఉపశమనం కోసం అవిరామంగా పనిచేస్తున్న ACT గ్రాంట్లకు వెళ్తాయి. మీ సహకారం మా దేశానికి మహమ్మారిపై పోరాడటానికి సహాయపడుతుంది మరియు మీ మద్దతు లేకుండా అది సాధ్యం కాదు. ”

ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకోవడం కొనసాగించాలని, వీలైనంత త్వరగా టీకాలు వేయాలని కోరారు. వారు ఇలా అన్నారు, “ఒకరినొకరు రక్షించుకోవడానికి మా పనిని కొనసాగిద్దాం – మాస్క్ ధరించడం, క్రమం తప్పకుండా చేతులు శుభ్రం చేసుకోవడం, సామాజిక దూారాన్ని పాటించడం. వీలైనంత త్వరగా టీకాలు వేయించుకోండి. జై హింద్!” అంటూ తాజాగా విడుదల చేసిన పోస్ట్‌లో పేర్కొంది

దేశంలో ఇటీవల కరోనా సెకెండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో కోహ్లీ, అనుష్క దంపతులు ‘ఇన్‌ దిస్‌ టుగెదర్‌’ పేరిట కొవిడ్‌-19 రిలీఫ్‌ కోసం విరాళాల సేకరణ మొదలు పెట్టారు. ఇలాంటి క్లిష్ట సమయంలో ఎంతో మంది దాతలు ముందుకొచ్చి సాయం చేస్తున్నారు. అందులో సెలబ్రిటీలు కూడా తమవంతు సహాయం చేస్తున్నారు. ఇప్పుడు ఈ లిస్ట్ లో చేరిపోయారు టీమిండియా జోడి విరాట్ కోహ్లీ (Virat Kohli) అతని సతీమణి అనుష్క శర్మ (Anushka Sharma) మరో సారి తమ మంచి మనస్సు చాటుకున్నారు.

దేశంలో ఇటీవల కరోనా సెకెండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో కోహ్లీ, అనుష్క దంపతులు ‘ఇన్‌ దిస్‌ టుగెదర్‌’ పేరిట కొవిడ్‌-19 రిలీఫ్‌ కోసం విరాళాల సేకరణ చేపట్టారు. రూ.2 కోట్ల విరాళం అందించి విరుష్క దంపతులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రూ.7 కోట్ల విరాళాలు సేకరించాలని తొలుత లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే, ఎంపీఎల్‌ అనే క్రీడా సంస్థ వారికి రూ.5 కోట్ల విరాళం ప్రకటించింది. ఈ క్రమంలోనే తమ లక్ష్యాన్ని రూ.11 కోట్లకు పెంచుకున్నారు. ఈరోజు తమ లక్ష్యాన్ని అధిగమించినట్లు విరుష్క దంపతులు సామాజిక మాధ్యమాల్లో వెల్లడించారు.

కరోనా బాధితులకు సాయంగా రూ.2 కోట్ల విరాళాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా కరోనా కట్టడి కోసం ఫండ్ రైజింగ్‌కు చేపట్టారు. కెట్టో సంస్థతో కలిసి #InThisTogether అనే ఫండ్ రైజింగ్‌ క్యాంపైన్‌కు మొదలు పెట్టారు.

ఇవి కూడా చదవండి:  Covid19 vaccine: వ్యాక్సినేషన్ ప్రక్రియలో మరో మైలురాయి.. 18 కోట్లు దాటిన టీకాల పంపిణీ

డ్రాగన్ కంట్రీ ఖాతాలో మరో విజయం.. అంగారక గ్రహంపై విజయవంతంగా దిగిన ఝురోంగ్

అస్సాంలో మళ్ళీ భూప్రకంపనలు, ఇండియా సహా నాలుగు దేశాల్లో ప్రభావం, రిక్టర్ స్కేలుపై 4.3 గా తీవ్రత నమోదు

Covid19: దేశవ్యాప్తంగా కాస్త తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు.. ఏమాత్రం తగ్గని మరణాల సంఖ్య