India Tour of Sri Lanka: ఉంటుందో… ఉండదో…! శ్రీలంక పర్యటనపై కొవిడ్‌ మబ్బులు…!

శ్రీలంకలో భారత జట్టు పర్యటనపై కొవిడ్‌ మబ్బులు ముసురుకుంటున్నాయి. రెండు జట్ల మధ్య జరగాల్సిన మూడు వన్డేలు, మూడు టీ20లపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

India Tour of Sri Lanka: ఉంటుందో... ఉండదో...! శ్రీలంక పర్యటనపై కొవిడ్‌ మబ్బులు...!
India Tour Of Sri Lanka
Follow us

|

Updated on: May 16, 2021 | 6:40 AM

శ్రీలంకలో భారత జట్టు పర్యటనపై కొవిడ్‌ మబ్బులు ముసురుకుంటున్నాయి. రెండు జట్ల మధ్య జరగాల్సిన మూడు వన్డేలు, మూడు టీ20లపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీ లంకలో కోవిడ్ వైరస్‌ కేసులు పెరుగుతుండటమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది.

శ్రీ లంకలో గత వారం రోజులుగా కరోనా సెకెండ్ వేవ్ ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. తాజాగా 3,269 కేసులు, 24 మరణాలను ఆ దేశం రిపోర్ట్ చేసింది. గత ఏడు రోజుల్లో కేసుల సంఖ్య మొత్తం 16,343, మరణాలు 147కు చేరుకున్నాయి. వైరస్‌ కారణంగా గతేడాది జరగాల్సిన శ్రీలంక-భారత్‌ సిరీసును ఇప్పటికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

‘పెరుగుతున్న కొవిడ్‌-19 కేసులు ఆందోళన కలిగిస్తున్నాయని శ్రీలంక క్రికెట్‌ సీనియర్‌ అధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు. కానీ గతేడాది కరోనా ఉన్నప్పటికీ ఇంగ్లాండ్‌, ఇతర సిరీసులను విజయవంతంగా నిర్వహించామని చెప్పుకొచ్చారు. ఇప్పుడు భారత్‌తో సిరీసునూ అలాగే నిర్వహిస్తామన్న ధీమా వ్యక్తం చేశారు. ఏదేమైనా కేసులు పెరగకూడదని కోరుకుంటున్నాం అన్నారు.

మరికొన్ని రోజుల్లో విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ, జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమి వంటి సీనియర్లతో కూడిన భారత జట్టు ఇంగ్లాండ్‌లో పర్యటించనుంది. అక్కడ న్యూజిలాండ్‌తో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్, ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీసు ఆడనుంది. అదే సమయంలో తెల్ల బంతి స్పెషలిస్టులు శ్రీలంకలో పర్యటిస్తారని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ స్పష్టం చేశారు. శిఖర్ ధావన్‌, భువనేశ్వర్‌ కుమార్‌, హార్దిక్, యూజీ, సంజు, పృథ్వీషా, దీపక్‌ చాహర్‌, రాహుల్‌ చాహర్‌, వరుణ్‌ చక్రవర్తి, రాహుల్‌ తెవాతియా వంటి కుర్రాళ్లతో కూడి జట్టు లంకలో పర్యటించనుంది. 3 వన్డేలు, 3 టీ20లకు ప్రేమదాస స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది.

ఇవి కూడా చదవండి: DRDO Drug 2-DG: కరోనా బాధితులకు శుభవార్త.. రేపటిలోగా అందుబాటులోకి రానున్న 2డీజీ డ్రగ్‌..!

Black Fungus: క‌రోనా నుంచి కోలుకున్న వారిలో బ్లాక్ ఫంగ‌స్‌కు ఆ నీరే కార‌ణ‌మా.? ఆస‌క్తిక‌ర విష‌యాలు..