DRDO Drug 2-DG: కరోనా బాధితులకు శుభవార్త.. రేపటిలోగా అందుబాటులోకి రానున్న 2డీజీ డ్రగ్‌..!

కోవిడ్‌ బాధితుల చికిత్సలో వినియోగించే 2డీజీ డ్రగ్‌ను రూపొందించిన డీఆర్డీఓ.. డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌ భాగస్వామ్యంతో ఆవిష్కరించింది. పౌడర్‌ రూపంలో ఉండే సాచెట్‌ను విడుదల చేసింది.

DRDO Drug 2-DG: కరోనా బాధితులకు శుభవార్త.. రేపటిలోగా అందుబాటులోకి రానున్న 2డీజీ డ్రగ్‌..!
Drdo Drug 2 Dg
Follow us

|

Updated on: May 15, 2021 | 12:13 PM

DRDO Drug 2-DG: ప్రపంచం మొత్తం మాయదారి కరోనాతో తల్లడిల్లుతోంది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో అండగా నిలిచింది భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డీఆర్‌డీవో. కోవిడ్‌ బాధితుల చికిత్సలో వినియోగించే 2డీజీ డ్రగ్‌ను రూపొందించిన డీఆర్డీఓ.. డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌ భాగస్వామ్యంతో ఆవిష్కరించింది. పౌడర్‌ రూపంలో ఉండే సాచెట్‌ను విడుదల చేసింది. 10వేల మోతాదుల మొదటి బ్యాచ్‌ను ఈవారంలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు కంపెనీ, డీఆర్డీఓ అధికారులు సంయుక్తంగా వెల్లడించారు. వాటిని కరోనా బాధితులకు ఇవ్వనున్నట్లు తెలిపారు.

కరోనాకు వ్యాక్సిన్లే తప్ప మందులు ఇప్పటివరకూ లేవు. ఇప్పుడు వాటి ట్రయల్స్ జరుగుతున్నాయి. భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ఓ పొడిని తయారుచేసింది. దీన్ని కరోనా రోగులకు ఎమర్జెన్సీ వాడకానికి వాడవచ్చని… భారత ఔషధ నియంత్రణ సంస్థ అనుమతి ఇచ్చింది. డీఆర్‌డీవో ఓ ల్యాబులో ఈ పొడిని తయారుచేసింది. ఇందుకు హైదరాబాద్‌లోని డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ సహకారం అందించింది. ఈ కొత్త మందు పేరు 2-DG (2-డియోక్సీ-D-గ్లూకోజ్). ఈ మందు ద్వారా కరోనా పేషెంట్లు త్వరగా రికవరీ అవుతున్నారు. అంతేకాదు… మెడికల్ ఆక్సిజన్‌పై ఆధారపడే సమయం కూడా తగ్గుతోంది. ఇలా ఇది మంచి ఫలితాలు ఇస్తోందని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

2-డియోక్సీ-డీ-గ్లూకోజ్ (2-డీజీ) ఉత్పత్తి హైదరాబాద్‌ సహా పలు కేంద్రాల్లో త్వరలో ప్రారంభం కానుంది. డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ సహకారంతో డీఆర్‌డీఓకు చెందిన ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూక్లియర్‌ మెడిసిన్‌ అండ్‌ అలైడ్‌ సైన్సెస్‌ (INMAS) ఈ డ్రగ్‌ను అభివృద్ధి చేసింది. 2-డీజీ ఔష‌ధ అత్యవసర వినియోగానికి డ్రగ్‌ కంట్రోల‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఇటీవల అనుమ‌తి ఇచ్చిన విషయం తెలిసిందే.

ఇది స్వల్ప నుంచి మోస్తరు కరోనా లక్షణాలతో బాధ‌ప‌డుతున్న రోగులపై బాగా పనిచేస్తుందని, క‌రోనా బాధితులకు ప్రధాన చికిత్స చేస్తూ అద‌నంగా ఈ ఔష‌ధాన్ని ఇస్తే వారు వేగంగా కోలుకునే అవ‌కాశం ఉంటుంద‌ని డీఆర్డీఓ పేర్కొంది. జెన‌రిక్ మాలిక్యూల్‌, గ్లూకోజ్ అన‌లాగ్ కావ‌డం వ‌ల్ల దీని ఉత్పత్తి చాలా సులువ‌ని చెప్పింది.  ఇది పెద్ద మొత్తంలో అందుబాటులో ఉంటుంద‌ని తెలిపింది. దీన్ని ఉపయోగించిన బాధితుల్లో చాలా మందికి ఆర్టీ-పీసీఆర్ పరీక్షలోనెగెటివ్‌గా తేలిన‌ట్లు డీఆర్‌డీఓ డీసీజీఐకి సమర్పించిన పత్రాల్లో తెలిపింది. పొడి రూపంలో డ్రగ్‌ను నీళ్లలో క‌లుపుకొని తాగితే వైర‌స్ ఉన్న క‌ణాల్లోకి చేరి, దాని వృద్ధిని అడ్డుకుంటుంద‌ని డీఆర్‌డీఓ వివరించింది.

ఈ పొడి… కరోనా పేషెంట్ల శరీరంలో కరోనా వల్ల దెబ్బతిన్న కణాలను గుర్తిస్తుంది. అక్కడ వైరస్‌కి ఎనర్జీ రాకుండా అడ్డుకుంటుంది. అందువల్ల వైరస్ నీరసించిపోతుంది. దాని వల్ల వైరస్ ఇక వృద్ధి చెందలేదు. అంతే… అక్కడితో కరోనా ఆగిపోతుంది. క్రమంగా వైరస్ నీరసించి చనిపోతుంటే.. కరోనా నయం అయిపోతుంది. ఫలితంగా కణాలు తిరిగి రిపేర్ అయ్యి… బాగవుతాయి. పేషెంట్లు త్వరగా కోలుకుంటారు. మొదటి, రెండు ట్రయల్స్‌లో వచ్చిన ఫలితాలతో… DCGI ఈ మందుకి ఎమర్జెన్సీ వాడకానికి అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్లకు కూడా ఎమర్జెన్సీ వాడకం అనుమతులే ఉన్నాయి. మూడో దశ ట్రయల్స్ పూర్తై… రిపోర్ట్ వస్తే… ఈ డ్రగ్ ఎంత బాగా పనిచేస్తుందో తెలుస్తుంది.

కాగా, ప్రస్తుతానికి ఈ మందును టాబ్లెట్‌లా కాకుండా… పొడి రూపంలో ప్యాకెట్‌లో ఇస్తున్నారు. దీన్ని నీటిలో కలుపుకొని తాగుతున్నారు. ఇది వాడిన చాలా మందికి RT-PCR టెస్టుల్లో నెగెటివ్ వచ్చిందని డీఆర్‌డీవో ప్రతినిధులు వివరించారు. అందుకే దీనికి DCGI అనుమతి ఇచ్చింది. మూడో ట్రయల్స్ తర్వాత… అంతా ఓకే అనుకుంటే… దీన్ని టాబ్లెట్లలా తయారుచేసే అవకాశాలు ఉన్నాయి.

Read Also…  Covid19 vaccine: వ్యాక్సినేషన్ ప్రక్రియలో మరో మైలురాయి.. 18 కోట్లు దాటిన టీకాల పంపిణీ

స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..
స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం