- Telugu News Photo Gallery Sports photos Gurugram police thanks to india opener shikhar dhawan donating oxygen concentrators for covid 19
Gurugram Police thanks to Shikhar: దాతృత్వాన్ని చాటుకున్న గబ్బర్.. కోవిడ్ బాధితులకు మరోసారి సాయం
shikhar dhawan: శిఖర్ ధావన్... అభిమానులు ప్రేమగా పులుచుకునే గబ్బర్ తన పెద్ద మనసు చాటుకున్నాడు. కరోనాపై పోరులో బాధితులను ఆదుకునేందుకు ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను డొనేట్ చేశాడు.
Updated on: May 15, 2021 | 9:45 PM

భారతదేశం కరోనా వైరస్ మహమ్మారితో పోరాడుతోంది. కరోనాపై పోరులో కరోనా బాధితులను ఆదుకునేందుకు చాలా మంది క్రికెటర్లు ముందుకొస్తున్నారు. టీమిండియా క్రికెటర్లతోపాటు వివిధ దేశ విదేశాలకు చెందిన ఆటగాళ్లు కూడా ముందుకు వస్తున్నారు. వీరిలో ఇప్పుడు శిఖర్ ధావన్ చేరాడు.

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాణవాయువు అవసరం పెరిగిపోతున్నందున ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు అందించాలని టీమ్‌ఇండియా సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ నిర్ణయించారు.

తాజాగా శిఖర్ ధావన్ ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను డొనేట్ చేశాడు. కరోనా సెకండ్ వేవ్‌లో కోవిడ్ పై పోరాటంలో సహాయపడటానికి ధావన్ గురుగ్రామ్ పోలీసులకు ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను అందజేశాడు. ధావన్ చేసిన సాయానికి పోలీసులు సోషల్‌మీడియాలో కృతజ్ఞతలు తెలిపారు.

విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు చిన్న సేవ చేస్తున్నందుకు కృతజ్ఞుడిని అంటూ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నాడు. నా ప్రజలకు, సమాజానికి ఎల్లప్పుడు సహాయపడటానికి సిద్ధంగా ఉంటాను. త్వరలోనే మహమ్మారి నుంచి దేశం బయటపడుతుంది అని ధావన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. కొవిడ్ సహాయక చర్యల కోసం ధావన్ గతంలోనే రూ.20లక్షలు విరాళంగా ఇచ్చాడు.





























