- Telugu News Photo Gallery Sports photos Tim paine married life bonnie paine australian test captain rishabh pant babysitter now viral photo
Viral Photos: రిషబ్ పంత్‌తో దిగిన ఓ ఫోటో ఓ కెప్టెన్ భార్యను ఫేమ్ చేసింది.. ఆమె ఎవరో తెలుసా..
ఈ కెప్టెన్ భార్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె తన పిల్లల ఫోటోలను పోస్ట్ చేస్తూ అభిమానులకు షేర్ చేస్తుంది.
Updated on: May 15, 2021 | 7:50 AM

ఆస్ట్రేలియా టెస్ట్ జట్టు కెప్టెన్ టిమ్ పైన్ (Tim Paine) బంతి టెంపరింగ్ వివాదం తర్వాత వార్తల్లో నిలిచాడు. టిమ్ పైన్ సంచలన వ్యాఖ్యలు చేయడంలో కూడా ముందుంటాడు. అంతేకాదు అతని భార్య పెన్ అతడిని వార్తల్లో ఉండేట్లు చేస్తోంది. పెన్ కారణంగా టిమ్‌కు చాలా పేరు వచ్చింది.

టిమ్ పైన్‌తోపాటు బోనీలకు ఏప్రిల్ 2016 లో వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కొడుకు పేరు చార్లీ కాగా, కుమార్తె పేరు మిల్లా. బోనీ తన ఫోటోలను తన పిల్లలతో సోషల్ మీడియాలో పంచుకుంటూనే ఉంటుంది. తన ఫ్యామిలీకి చెందిన అప్‌డేట్స్‌ను అభిమానులతో షేర్ చేసుకుంటుంది.

పెన్ భార్య బోనీ ఒక సంగీత కళాకారిణి. 2006 నుంచి ఆమె ఎలిఫెంట్ రివైవల్ అనే సంగీత బృందంలో సభ్యురాలు. ఈ మ్యూజిక్ టీమ్‌కు ఆస్ట్రేలియాలో మంచి పేరుంది.

అంతే కాదు ఈ పోటో ఇప్పుడు భారతీయ క్రికెట్ అభిమానులను తన ఫాలోవర్స్ మార్చేసింది. 2018లో ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా యువ బ్యాట్స్‌మన్-వికెట్ కీపర్ రిషబ్ పంత్‌తో కలిసి దిగిన ఫోటో పెద్ద వైరల్ అయ్యింది. పంత్‌ను ఆమె తన సోష్ మీడియా వేదికగా ఉత్తమ బేబీ సిటర్‌గా అభివర్ణించింది.

ఈ ఫోటో తరువాత ఇన్‌స్టాగ్రామ్‌లో అతని అభిమానుల ఫాలోయింగ్ అకస్మాత్తుగా పెరిగింది. ఈ పరిహాసం తరువాత తన భార్య ఇన్‌స్టాగ్రామ్‌లో భారతీయ అనుచరుల సంఖ్య పెరిగిందని, లక్షలాది మంది భారతీయులు తన భార్యను సోషల్ మీడియాలో అనుసరిస్తున్నారని టిమ్ పైన్ స్వయంగా వెల్లడించారు.





























