అస్సాంలో మళ్ళీ భూప్రకంపనలు, ఇండియా సహా నాలుగు దేశాల్లో ప్రభావం, రిక్టర్ స్కేలుపై 4.3 గా తీవ్రత నమోదు
అస్సాంలో శనివారం ఉదయం మళ్ళీ భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రతను 4.3 గా గుర్తించారు. ఇండియా సహా బంగ్లాదేశ్..
అస్సాంలో శనివారం ఉదయం మళ్ళీ భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రతను 4.3 గా గుర్తించారు. ఇండియా సహా బంగ్లాదేశ్ , భూటాన్, , చైనా దేశాలపై ఈ ప్రకంపనల ప్రభావం కనిపించింది. అస్సాంలోని ధీకియాజులి వద్ద భూకంప కేంద్రం ఉన్నట్టు అధికారులు ప్రాథమికంగా తెలిపారు. ఇటీవల భూప్రకంపనలకు గురైన సోనిత్ పూర్ జిల్లా మళ్ళీ దీని ప్రభావానికి గురైంది. ప్రాణ, ఆస్తినష్టం జరిగినట్టు సమాచారం అందలేదు. థింగ్, ఉరల్ గురి, ఖరుపాటియా, రంగపర, దిస్ పూర్ తదితర జిల్లాల్లో భూప్రకంపనలు సంభవించాయి. ప్రజలు భయంతో ఇళ్ళు వదిలి బయటకు పరుగులు తీశారు. అయితే ఈ జిల్లాల్లో కొన్ని చోట్ల రోడ్డు,భవనాలు స్వల్పంగా దెబ్బ తిన్నట్టు తెలిసింది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.