వ్యాయామం చేసిన తర్వాత పొరపాటున కూడా ఈ ఐటమ్స్ తినొద్దు..! అయినా తిన్నారంటే కొవ్వును కొనితెచ్చుకున్నట్లే..?
Avoid These Foods : బరువు తగ్గడానికి చాలామంది వ్యాయామం చేస్తూ, ఆహార పద్దతులు మార్చుకుంటారు. ముఖ్యంగా వేయించిన, కాల్చిన,
Avoid These Foods : బరువు తగ్గడానికి చాలామంది వ్యాయామం చేస్తూ, ఆహార పద్దతులు మార్చుకుంటారు. ముఖ్యంగా వేయించిన, కాల్చిన, జంక్ ఫుడ్‌ను తినడం మానుకోవాలి. అదనంగా మీ శరీరాన్ని నిర్జలీకరణం నుంచి కాపాడుకోవడానికి తగినంత నీరు త్రాగాలి. సరైన పోషక పదార్థాలను డైట్‌లో చేర్చుకోవాలి. అయితే వ్యాయామం చేసిన తర్వాత ఈ ఆహార పదార్థాలను అస్సలు తినకూడదు..
1. అరటి అరటి ఆరోగ్యకరమైన సూపర్ ఫుడ్. వ్యాయామం చేసే ముందు తినడం ప్రయోజనకరం. కానీ బరువు తగ్గాలనుకునే వారు వర్కౌట్స్ తర్వాత అరటిపండు తినకూడదు. ఇందులో కేలరీలు, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. అయితే వర్కౌట్స్ తర్వాత తినడం వల్ల ప్రయోజనం ఉండదు. కాబట్టి కొవ్వు పెరిగే అవకాశం ఉంటుంది. 2. మామిడి చాలా మంది మామిడి తినడానికి ఇష్టపడతారు. కానీ వర్కౌట్స్ తర్వాత మామిడి తినడం మానుకోవాలి. ఇది పోషకాలతో నిండి ఉంటుంది. ఇందులో కేలరీలు, పిండి పదార్థాలు ఎక్కువ. అందుకే వ్యాయామం తర్వాత దీనిని నివారించాలి. 3. కర్జూర కర్జూర రుచికరమైనవి, తినడానికి చాలా పోషకమైనవి. ఇది శరీరానికి శక్తిని అందిస్తుంది. కానీ ఇందులో కేలరీలు అధికంగా ఉంటాయి. అందువల్ల వర్కౌట్స్ తర్వాత కర్జూర తినడం మానుకోండి. ఇది కొవ్వు పెరుగుదలకు దారితీస్తుంది.
4. కొబ్బరి గుజ్జు కొబ్బరి గుజ్జులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో కార్బోహైడ్రేట్లు, కేలరీలు అధికంగా ఉంటాయి. వర్కౌట్స్ తర్వాత దీన్ని తినడం మానుకోండి.
5. అత్తి అత్తి పండ్లలో కేలరీలు తక్కువగా ఉంటాయి. కానీ ఎండిన అత్తి పండ్లను తినడం బరువు తగ్గడానికి ప్రయోజనకరం కాదు. అత్తి పండ్ల ఆరోగ్యానికి మంచివి అయినప్పటికీ వాటిని బరువు తగ్గించే ఆహారంలో చేర్చకూడదు.
6. ఎండుద్రాక్ష ఎండుద్రాక్ష తినడం మీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అయితే ఇందులో చాలా కేలరీలు, పోషకాలు ఉంటాయి. అయితే వ్యాయామం తర్వాత తినడం మానుకోండి.