Oxygen Express: కష్టకాలంలో ప్రాణవాయువు చేరవేస్తున్న రైల్వేశాఖ.. ఇప్పటికే 444 ట్యాంకర్లలో 7,115 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్
భారత రైల్వే శాఖ అన్ని ప్రాంతాలకు ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు చేరేలా ఏర్పాట్లు చేసింది. ఏప్రిల్ 19న వైజాగ్, ముంబై మధ్య తొలి ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ డ్రై రన్ తరువాత లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌ను రవాణా చేస్తోంది.
Oxygen Express: కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా నలు మూలల నుంచి ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు డిమాండ్ పెరిగింది. ఇందుకు అనుగుణంగా భారత రైల్వే శాఖ అన్ని ప్రాంతాలకు ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు చేరేలా ఏర్పాట్లు చేసింది. ఏప్రిల్ 19న వైజాగ్, ముంబై మధ్య తొలి ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ డ్రై రన్ తరువాత లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌ను రవాణాను వేగవంతం చేసింది రైల్వే శాఖ.
ఇదే క్రమంలో తమిళనాడు రాష్ట్రంలో ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైలు సురక్షితంగా చెన్నై చేరింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని దుర్గాపూర్ నుంచి బయలుదేరిన ఈ రైలులో మొత్తం 80 మెట్రిక్ టన్నుల ఆక్సిజస్ చెన్నైకి చేరింది. ఈ ప్రాణవాయువును నగరంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అత్యవసరమైన ఆస్పత్రులకు సరఫరా చేస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి ఎం.సుబ్రమణ్యం వెల్లడించారు.
దేశ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి తారస్థాయి లో కొనసాగుతున్న విషయం తెల్సిందే. ఇటు తమిళనాడు రాష్ట్రంలో కూడా ప్రతి రోజూ 30 వేలకు పైగా కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు నమోదువుతున్నాయి. అత్యధిక కేసులు నమోదవుతున్న చెన్నై జిల్లా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఫలితంగా కరోనా రోగులతో అన్ని ఆస్పత్రులు నిండిపోయాయి. రాష్ట్రంలోని ఆక్సిజన్ నిల్వలు కూడా ఖాళీ కావడంతో కొన్ని ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత ఏర్పడింది.
చెంగల్పట్టు ప్రభుత్వ ఆస్పత్రిలో ఇటీవల ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం ఏర్పడి పదిమందికి పైగా కరోనా బాధితులు మరణించారు. అదేసమయంలో రాష్ట్రంలో ఆక్సిజన్ నిల్వలు నిండుకున్నాయని, అందువల్ల తక్షణం ఆక్సిజన్ సరఫరా చేయాలంటూ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. దీనిపై స్పందించిన కేంద్రం తొలి విడతగా 80 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కేటాయించి పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్ నుంచి ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ పంపించారు. ఈ రైలు గురువారం అర్థరాత్రి 2 గంటల సమయంలో చెన్నై, తిరువొట్రియూరు యార్డుకు చేరుకుంది. ఈ రైలుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి సుబ్రమణియంతో పాటు ఉన్నతాధికారులు స్వాగతం పలికి, ఆక్సిజన్ ట్యాంకర్లను వారు తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి సుబ్రమణియం మాట్లాడుతూ, ముఖ్యమంత్రి స్టాలిన్ ఆదేశం మేరకు కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు అనేక రకాల చర్యలు తీసుకంటున్నట్టు చెప్పారు. ఆస్పత్రులకు అవసమయ్యే ఆక్సిజన్‌ను యుద్ధప్రాతిపదికన దిగుమతి చేసుకుంటున్నామని, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కూడా జోరుగా సాగుతోందని తెలిపారు. ఏ ఏ జిల్లాలకు ఆక్సిజన్ అత్యవసరమో ఆయా జిల్లాలకు ట్యాంకర్ల పంపుతామన్నారు. ఇదిలావుంటే, భారతీయ రైల్వే శాఖ ఇప్పటిరకు మొత్తం 444 ట్యాంకర్లలో 7115 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను రైళ్ల ద్వారా దేశంలోని వివిధ రాష్ట్రాలకు సరఫరా చేసింది.
మరోవైపు, ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆక్సిజన్ నిల్వలు పుష్కలంగా ఉంచుకునేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఆక్సిజన్‌ను తీసుకొచ్చేందుకు మరో ఐదు ఖాళీ ట్యాంకర్ లారీలు ఒడిశా రాష్ట్రంలోని రూర్కెలాకు శుక్రవారం బయలుదేరి వెళ్లాయి. ఈ రైలులో వచ్చే ట్యాంకర్లలో రాష్ట్రానికి మరో 66 టన్నుల ఆక్సిజన్ రానుంది. తిరువళ్ళూరు స్టేషన్‌కు ట్యాంకర్లలో వచ్చే ఆక్జిన్‌ను అక్కడ నుంచి రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత ఉన్న జిల్లాలకు పంపించేలా చర్యలు తీసుకుంటారు.
Oxygen Expresses deliver more than 7115 MT of Medical Oxygen to the Nation
First Oxygen Express to Tamil Nadu on the way with 80 MT of LMO
More than 3900 MT LMO offloaded in the NCR region by Oxygen Expresses sohttps://t.co/bvrAXCMTuk pic.twitter.com/nHlHnDMcsC
— Ministry of Railways (@RailMinIndia) May 14, 2021
Read Also… ప్రభుత్వ ఆస్పత్రిలో కొవిడ్ పేషెంట్ ఆత్మహత్య..! వార్డులో ఉరి వేసుకొని మృతి.. కారణాలు ఇలా ఉన్నాయి..?