AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

18-44 ఏళ్ళ మధ్య వయస్సువారికి వ్యాక్సిన్ వాయిదా వేయాల్సిందే, టాస్క్ ఫోర్స్ చీఫ్ డా. ఎన్. కె. అరోరా వెల్లడి

దేశ వ్యాప్తంగా వ్యాక్సిన్ కొరత ఉందని, అందువల్ల ప్రస్తుతం 18-44 ఏళ్ళ మధ్య వయస్సువారికి వ్యాక్సినేషన్ వాయిదా వేయాల్సిందేనని కోవిడ్ 19 పై గల వర్కింగ్ గ్రూపు చీఫ్ డా. ఎన్.కె. అరోరా చెప్పారు.

18-44 ఏళ్ళ మధ్య వయస్సువారికి వ్యాక్సిన్ వాయిదా వేయాల్సిందే, టాస్క్ ఫోర్స్ చీఫ్ డా. ఎన్. కె. అరోరా వెల్లడి
Vaccination For 18 44 Age G
Umakanth Rao
| Edited By: Phani CH|

Updated on: May 15, 2021 | 1:54 PM

Share

దేశ వ్యాప్తంగా వ్యాక్సిన్ కొరత ఉందని, అందువల్ల ప్రస్తుతం 18-44 ఏళ్ళ మధ్య వయస్సువారికి వ్యాక్సినేషన్ వాయిదా వేయాల్సిందేనని కోవిడ్ 19 పై గల వర్కింగ్ గ్రూపు చీఫ్ డా. ఎన్.కె. అరోరా చెప్పారు. కోవిడ్ మరణాల సంఖ్యను తగ్గించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ. దీన్ని అమలుపరచేందుకు తీవ్ర కొరత అవరోధంగా మారిందన్నారు. మే 1 నుంచి ఈ ఏజ్ గ్రూపువారికి పెద్దఎత్తున వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపడతామని కేంద్రం పేర్కొన్న సంగతి విదితమే. కానీ సీరం సంస్థ నుంచి కోవిషీల్డ్ టీకామందు, భారత్ బయో టెక్ కంపెనీ నుంచి కోవాగ్జిన్ వ్యాక్సిన్ ఉత్పత్తి గతంలోకన్నా తగ్గింది. ఓ వైపు కోవిడ్ కేసులు పెరిగిపోతుండగా మరో వైపు వ్యాక్సిన్ ఉత్పత్తి తగ్గడం కేంద్రాన్ని ఇరకాటంలో పెట్టింది. దీంతో 18-44 ఏళ్ళ మధ్య వయస్సువారికి టీకామందులు ఇవ్వాలన్న నిర్ణయానికి బ్రేక్ పడింది. ప్రస్తుతానికి ఈ వయస్కులకు కొన్ని రోజులపాటు ఈ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని తాము అభిప్రాయపడినట్టు అరోరా వెల్లడించారు. అయితే కేసుల సంఖ్య తగ్గిన అనంతరం యుధ్ధ ప్రాతిపదికన దీన్ని చేపట్టవచ్చునన్నారు. ప్రధానంగా ఇప్పుడు 45 ఏళ్ళు పైబడినవారికి టీకామందు ఇవ్వాలన్న ఉద్దేశం ఉన్నట్టు ఆయన చెప్పారు., ఈ వయస్కులకు జులై వరకు వ్యాక్సిన్ అందుబాటులో ఉందని ఆయన తెలిపారు.

భారత నేషనల్ టెక్నీకల్ అడ్వైజరీ గ్రూపు సభ్యుడు కూడా అయిన అరోరా..ఈ వయస్కులకోసం 50 నుంచి 55 కోట్ల డోసుల టీకామందు అందుబాటులో ఉన్నట్టు వివరించారు. ఇక వ్యాక్సిన్ కోసం గ్లోబల్ టెండర్లు పిలుస్తామని అంటున్నారని, కానీ గ్లోబల్ గా ఎలాంటి వ్యాక్సిన్ ఇప్పుడు అందుబాటులో లేదన్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: Oxygen Express: కష్టకాలంలో ప్రాణవాయువు చేరవేస్తున్న రైల్వేశాఖ.. ఇప్పటికే 444 ట్యాంకర్లలో 7,115 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌

9వేల రూపాయల పొదుపుకు 29 లక్షల భారీ ప్రయోజనం..! అదనంగా పన్ను మినహాయింపు.. తెలుసుకోండి..