AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Black Fungus: ఆ నీటి వాడకమే బ్లాక్‌ ఫంగస్‌ వ్యాప్తికి కారణమా.! వైద్య నిపుణులు ఏం చెబుతున్నారంటే..

Black Fungus Spread: ఓవైపు కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో అల్లాడిపోతున్న దేశాన్ని మరోవైపు బ్లాక్ ఫంగస్ వణికిస్తోంది...

Black Fungus: ఆ నీటి వాడకమే బ్లాక్‌ ఫంగస్‌ వ్యాప్తికి కారణమా.! వైద్య నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Black Fungus
Ravi Kiran
|

Updated on: May 15, 2021 | 2:10 PM

Share

Black Fungus Spread: ఓవైపు కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో అల్లాడిపోతున్న దేశాన్ని మరోవైపు బ్లాక్ ఫంగస్ వణికిస్తోంది. కరోనా నుంచి కోలుకున్న రోగులకు సోకుతూ ప్రాణాంతకంగా మారుతోంది. కరోనా చికిత్స కోసం స్టిరాయిడ్లు ఎక్కువగా ఉపయోగిస్తుండడంతో రోగిలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది. అలాంటి వారిపై వాతావరణంలో ఉండే మ్యూకోర్‌మైకోసిస్ దాడి చేసి శరీరంలోని కీలక అవయవాలను దెబ్బతీస్తోంది. అయితే కరోనా చికిత్స తీసుకున్న రోగులకు బ్లాక్ ఫంగస్ సోకడానికి గల ప్రధాన కారణాన్ని అహ్మదాబాద్‌కు చెందిన సీనియర్ కార్డియాలజిస్ట్ అతుల్ అభ్యంకర్ తాజాగా బయటపెట్టారు.

ఆక్సిజన్‌ ఎక్కించేటపుడు ఉపయోగించే హ్యుమిడిఫయర్లే బ్లాక్ ఫంగస్ వ్యాప్తికి ప్రధాన కారణమని అతుల్ అభిప్రాయపడుతున్నారు. `ఆక్సిజన్‌కు ఉపయోగించే హ్యుమిడిఫయర్లలో స్టెరైల్ నీటినే ఉపయోగించాలి. కానీ, ప్రైవేట్ ఆస్పత్రులు, కోవిడ్‌ ఐసోలేషన్‌ సెంటర్లు, ఇళ్లలో ఉండి ఆక్సిజన్ పెట్టుకుంటున్న వారు సాధారణ నీటనే వాడేస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. ఆ నీటిలో రకరకాల సూక్ష్మజీవులు ఉంటాయని.. వాటి కారణంగానే శరీరంలో బ్లాక్ ఫంగస్ ఏర్పడుతుందని వెల్లడించారు. దీనిని నివారించాలంటే హ్యుమిడిఫయర్‌ను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడంతో పాటు.. రోజుకు రెండు సార్లు నీటిని మార్చాలని సూచించారు.

ఎవరికి సోకే అవ‌కాశం.. * డయాబెటిస్, కిడ్నీ మార్పిడి వంటి శస్త్రచికిత్సల్లో భాగంగా రోగనిరోధక శక్తిని అణిచిపెట్టే మందులు వాడిన వారికి ఈ వ్యాధి సోకుతుంది. * కరోనా చికిత్సలో భాగంగా స్టిరాయిడ్స్ ఎక్కువగా వాడుతున్న వారు * ఇతర ఆరోగ్య సమస్యలున్నవారికి కూడా ఈ వ్యాధి వస్తుంది.

ల‌క్ష‌ణాలు.. * కళ్లు, ముక్కు చుట్టూ నొప్పి, ఎర్రబారడం, జ్వరం, తలనొప్పి, దగ్గు, రక్తవాంతులు, శ్వాసలో ఇబ్బందులు, మానసికంగా స్థిమితంగా ఉండలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

* అయితే కరోనా రోగులందరికీ ఇది రాదని, చికిత్సలో భాగంగా స్టిరాయిడ్లు తీసుకున్న వారందరూ బ్లాక్‌ఫంగస్ బారిన పడతారనేది వాస్తవం కాదని వైద్యులు చెబుతున్నారు.

Also Read: 

ఇండియాకు 7 వేల కోట్లు విరాళంగా ఇచ్చిన 27 ఏళ్ల యువకుడు.. ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!

చిరుతపై సింహం సాలిడ్ ఎటాక్.. చివరికి గెలిచిందేవరంటే.? షాకింగ్ దృశ్యాలు..

‘సెక్స్ కోసం వెళ్లాలి’.! ఈ-పాస్ ఇవ్వండి.. పోలీసులకు వింత రిక్వెస్ట్.. అసలు విషయమేమిటంటే.!