కొలిక్కిరాని ‘ఇండియన్ 2’ వివాదం.. శంకర్ మూవీ గొడవలో మరో మలుపు.. మరోసారి డైరెక్టర్‏కు షాకిచ్చిన నిర్మాణ సంస్థ..

Indian 2 Movie: ఢీ అంటే ఢీ. పట్టిన పట్టు విడిచేది లేదు.. వెనక్కి తగ్గేది లేదు. తప్పు నీదంటే నీదే అంటూ డైరెక్టర్ శంకర్, లైకా ప్రొడక్షన్స్ మధ్య నడుస్తున్న వార్..పీక్ స్టేజ్ కు చేరుకుంది.

కొలిక్కిరాని 'ఇండియన్ 2' వివాదం.. శంకర్ మూవీ గొడవలో మరో మలుపు.. మరోసారి డైరెక్టర్‏కు షాకిచ్చిన నిర్మాణ సంస్థ..
Shankar
Follow us

|

Updated on: May 15, 2021 | 2:01 PM

Indian 2 Movie: ఢీ అంటే ఢీ. పట్టిన పట్టు విడిచేది లేదు.. వెనక్కి తగ్గేది లేదు. తప్పు నీదంటే నీదే అంటూ డైరెక్టర్ శంకర్, లైకా ప్రొడక్షన్స్ మధ్య నడుస్తున్న వార్..పీక్ స్టేజ్ కు చేరుకుంది. ఇప్పటికే కోర్టు మెట్లు ఎక్కిన ఈ తతంగం.. తాజాగా టాలీవుడ్, బాలీవుడ్ ఫిల్మ్ ఛాంబర్ల దాకా వెళ్లింది. ఇండియన్ 2 మూవీ కంప్లీట్ చేసే వరకు శంకర్ మరో సినిమా డైరెక్ట్ చేయకుండా ఆపాలంటూ లైకా ప్రొడక్షన్ కంప్లైంట్ చేసింది.

ఏ ముహూర్తాన మొదలైందో కానీ.. ఇండియన్ 2 మూవీకి అడుగడుగునా కష్టాలే ఎదురవుతున్నాయి. భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ మూవీని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. డైరెక్టర్ శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో చేస్తున్న ఇండియన్ 2 సినిమా షూటింగ్ సమయంలో.. భారీ క్రేన్ ప్రమాదం జరిగింది. దీంతో షూటింగ్ ను మధ్యలోనే ఆగిపోగా.. ఆ తర్వాత కరోనా కూడా తోడుకావడంతో.. షూటింగ్ కు చాలా గ్యాప్ వచ్చింది. అయితే ఈ సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో.. డైరెక్టర్ శంకర్ రెండు మేజర్ ప్రాజెక్టులు ప్రకటించాడు. రామ్ చరణ్ హీరోగా పాన్ ఇండియా మూవీతో పాటు.. రణ్ వీర్ సింగ్ హీరోగా.. అపరిచితుడు హిందీ రీమేక్ ప్రకటించాడు. దీంతో లైకా ప్రొడక్షన్.. తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తమ చిత్రాన్ని పూర్తి చేయకుండా.. ఇతర సినిమాలు చేయరాదంలూ నోటీసులు పంపడం.. ఆ తర్వాత కోర్టులో కంప్లైంట్ చేయడం వరకు వెళ్లింది. అయితే న్యాయస్థానం మాత్రం.. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోండని సలహా ఇచ్చింది. జూన్ లోగా ఇండియన్ 2 మూవీ షూటింగ్ ను కంప్లీట్ చేయాలని నిర్మాణ సంస్థ.. అక్టోబర్ లోగా పూర్తి చేస్తానని శంకర్ మధ్య చర్చలు జరగ్గా.. అవి కొలిక్కి రాలేదు. దీంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చినట్లైంది. తాజాగా లైకా సంస్థ.. తెలుగు, హిందీ ఫిల్మ్ ఛాంబర్స్ కు లేఖలు పంపింది. ఇండియన్ -2 మూవీ షూటింగ్ పూర్తిచేసే వరకు మరో సినిమాను డైరెక్ట్ చేయకుండా ఆపాలని ఆ లేఖల్లో కోరింది. దీంతో ఈ లేఖలపై రెండు పరిశ్రమ వర్గాల స్పందన ఎలా ఉంటుందనేది ఆసక్తిగా మారింది.

Also Read: Ram Pothineni: దేవదాసుగా ఎంట్రీ ఇచ్చి ఎనర్జిటిక్ స్టార్‏గా మారిన రామ్.. రాపో సినీ ప్రస్థానం..

మూడు సంవత్సరాల వయసులో నేర్చుకున్న నాట్యం.. తన జీవితాన్నే మార్చేసింది.. మాధురి దీక్షిత్ గురించి ఆసక్తికర విషయాలు..