Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weight Loss: ఈ పదార్థాలను తింటే సులభంగా బరువు తగ్గడం ఖాయం.. అవెంటో తెలుసా..

ఆధునిక కాలంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఎదుర్కోంటున్న సమస్య అధిక బరువు. కేవలం జంక్ ఫుడ్ తినడం, అధికంగా ఆహారం తీసుకోవడం

Weight Loss: ఈ పదార్థాలను తింటే సులభంగా బరువు తగ్గడం ఖాయం.. అవెంటో తెలుసా..
Weight Loss
Follow us
Rajitha Chanti

|

Updated on: May 15, 2021 | 3:42 PM

ఆధునిక కాలంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఎదుర్కోంటున్న సమస్య అధిక బరువు. కేవలం జంక్ ఫుడ్ తినడం, అధికంగా ఆహారం తీసుకోవడం వలన మాత్రమే బరువు పెరుగుతున్నామా అని సందేహ పడుతుంటారు. ఇక బరువు తగ్గేందుకు ఎన్నోరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. జిమ్‏లో నానా తంటాలు పడుతుంటారు. వ్యాయమాలు చేయడం, బరువు తగ్గేందుకు అనేక కెమికల్ డ్రింక్స్ తాగడం చేస్తుంటారు. ఇంకేముందు బరువు తగ్గడం ఏమో కానీ.. మరిన్ని అనారోగ్య సమస్యల బారిన పడుతుంటారు. అయితే ఇలాంటివి ఏమి లేకుండా.. జీవన విధానంలో మార్పుతోపాటు మనం రోజూ తీసుకునే ఆహారపు అలవాట్లను కొంత వరకు మార్చుకోవాల్సి ఉంటుంది. అలాగే కొన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ తినడం వలన కూడా బరువు తగ్గే ఛాన్స్ ఉంటుంది. అందులో మరీ ముఖ్యంగా కూరగాయలు. బరువు నియంత్రించుకోవడానికి కొన్ని కూరగాయలను తినడం ముఖ్యం. సులభంగా బరువు తగ్గడానికి సహయపడే కూరగాయలు కూడా ఉంటాయి. అవెంటో తెలుసుకుందామా.

బంగాళ దుంప.. వీటిని తింటే ఇక అధికంగా లావు అవుతాము అనుకుంటారు చాలా మంది. కానీ అది మాత్రం నిజం కాదు. ఆలుగడ్డల్లో పోటాషియం అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రణలో ఉంచుంది. అయితే దీనిని నూనెలో వేయించి మాత్రం తినకూడదు. కేవలం ఉడకబెట్టి తినడం మంచిది.

కాలీ ఫ్లవర్.. ఇందులో చాలా తక్కువ కెలరీలు ఉంటాయి. అలాగే అన్నం, రొట్టె వంటి కెలరీలు ఉండే ఆహార పదార్థాలకు దీన్ని ప్రత్యామ్నాయంగా దీనిని వాడుకోవచ్చు. కప్పు కాలీఫ్లవర్ నుంచి 25 కెలరీలు అందుతాయి.

బెల్ పెప్పర్.. రంగురంగుల్లో లభించే ఈ కూరగాయ కూడా బరువును తగ్గిస్తుంది. దీని నుంచి అందే కెలరీలు చాలా తక్కువ. అలాగే దీనిలో కొవ్వును కరిగించే సమ్మెళనాలు సమృద్ధిగా ఉంటాయి. వీటిలోని విటమిన్ సి పొట్టలో పేరుకుపోయిన కొవ్వు నిల్వలను తగ్గిస్తుంది.

బీన్స్.. కప్పు బీన్స్ నుంచి 31 కెలరీలు లభిస్తాయి. అలాగే ఇందులో కొవ్వు ఉండదు. వీటిలో విటమిన్ సి, కె, ఎ లతోపాటు కెరోటినాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పీచు పుష్కలంగా ఉంటాయి.

ఆకుకూరలు.. ఇవి పోషకాల ఖజానాలు. వీటి నుంచి లభించే కెలరీలు తక్కువ. వీటిలోని పీచు వలన ఈ కూరలు కొద్దిగా తీసుకున్నా కడుపు నిండిన భావన కలుగుతుంది.

క్యారెట్.. ఈ పోషకాల దుంపలో పీచు ఎక్కువగా ఉండడంతోపాటు బీటా కెరొటిన్ ఎక్కువగా ఉంటుంది. కొవ్వును ఖర్చుచేసే స్రావాలకు సాయం చేస్తుంది.

Also Read: ఎల్ఐసీలో అదిరిపోయే స్కీమ్.. ఇందులో చేరితే ప్రతి 3 నెలలకు డబ్బులు.. ఒకేసారి రూ.10 వేలు అందుకునే..

చనిపోయిన వారి అకౌంట్‏లో నుంచి డబ్బులు ఎలా విత్ డ్రా చేసుకోవాలో తెలుసా.. నామినీ లేకపోతే ఎలా..