భోజనం చేశాక ఈ పనులు అస్సలు చేయకూడదు..! చాలా డేంజర్.. తెలుసుకోండి..?

After Meal : భోజనం చేశాక కొన్ని ప‌నులు అస్సలు చేయ‌కూడ‌దు. దీనివ‌ల్ల ఆరోగ్య స‌మ‌స్యలు త‌లెత్తే అవ‌కాశం ఉంది. తిన్న త‌ర్వాత

భోజనం చేశాక ఈ పనులు అస్సలు చేయకూడదు..! చాలా డేంజర్.. తెలుసుకోండి..?
After Meal
Follow us
uppula Raju

|

Updated on: May 16, 2021 | 1:25 PM

After Meal : భోజనం చేశాక కొన్ని ప‌నులు అస్సలు చేయ‌కూడ‌దు. దీనివ‌ల్ల ఆరోగ్య స‌మ‌స్యలు త‌లెత్తే అవ‌కాశం ఉంది. తిన్న త‌ర్వాత ఈ ప‌నులు చేయొచ్చని కొంత‌మంది వాదిస్తుంటారు. వారు చెప్పేవి నిజ‌మో కాదో కూడా తెలుసుకోవ‌డానికి ప్రయ‌త్నించ‌రు. అందుకే ఎవ‌రూ చెప్పకుండా ముందే వాటిని తెలుసుకోండి..

1. ధూమ‌పానం : ధూమ‌పానం ఆరోగ్యానికి హానిక‌రం. ఆహారం తీసుకున్న త‌ర్వాత ధూమ‌పానం చేస్తే ఒక సిగ‌రెట్, ప‌ది సిగ‌రెట్లతో స‌మానం. దీనివ‌ల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వ‌చ్చే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది. 2. నిద్ర : నిద్ర జీవితంతో ఒక భాగం మాత్రమే. అదే జీవితం కాదు. అది కూడా తిన్న వెంట‌నే అస‌లు నిద్రపోకూడ‌దు. ఇలా చేయ‌డం వ‌ల్ల క‌డుపులో గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఏర్పడుతుంది. 3. టీ, కాఫీ : చాలామంది తిన్నవెంట‌నే టీ లేదా కాఫీ తాగ‌కుండా ఉండ‌లేరు. ఇలా చేయ‌డం వ‌ల్ల విస‌ర్జన స‌మ‌స్యలు ఎదుర‌వుతాయి. గంట స‌మ‌యం త‌ర్వాత తీసుకుంటే ఏం కాదు. 4. స్నానం : తిన్న వెంట‌నే స్నానం చేయ‌డం వ‌ల్ల ర‌క్తప్రస‌ర‌ణ త‌గ్గుతుంది. దీనివ‌ల్ల జీర్ణక్రియ స‌రిగా ఉండ‌దు. దీంతో బొజ్జ వ‌స్తుంది. అంతేకాదు విరోచినాలు అయ్యే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది. అందుకే 30 నిమిషాలు అయినా గ్యాప్ ఇవ్వాలి. 5. పండ్లు : అన్నం తిన్న వెంట‌నే పండ్లు తిన‌డం వ‌ల్ల తిన్నది అర‌గ‌డానికి చాలా స‌మ‌యం ప‌డుతుంది. మ‌ళ్లీ గుండెల్లో మంట‌గా ఉంటుంది. శ‌రీరంలో ఫ్యాట్ కూడా చేరుతుంది. 6. లూజ్ చేయ‌కూడ‌దు : భోజ‌నం చేసిన వెంట‌నే క‌డుపు బిర్రుగా ఉంటుంది. దీంతో బెల్టును లూజ్ చేస్తారు. ఇలా ఎప్పటికీ చేయ‌కూడ‌దు. తిన‌క‌ముందు ఎలా ఉందో అలానే ఉంచుకోవాలి. 7. నీరు తాగ‌కూడ‌దు : తిన్న వెంట‌నే చ‌ల్లనీరు తాగ‌కూడ‌దు. ఇలా తాగ‌డం వ‌ల్ల ఆహారం గ‌డ్డక‌డుతుంది. దీనివ‌ల్ల క‌డుపునొప్పి వ‌స్తుంది. 8.బ్రెష్ : నిద్రపోయేముందు బ్రెష్ చేయ‌డం మంచిది. అలా అని అన్నం తిన్న వెంట‌నే బ్రెష్ చేయ‌కూడ‌దు. క‌నీసం గంట‌, అర‌గంట స‌మ‌యం త‌ర్వాత చేస్తే మంచిది.

Asteroid: ఆరునెలల్లో భూమిని తాకనున్న భారీ గ్రహశకలం..ఎక్కడ పడుతుందో చెప్పగలిగినా..దానిని ఆపలేమంటున్న నాసా!

Matrimony Fraud: హైదారాబాద్‌లో మ్యాట్రిమోని మోసం.. యువ‌తి నుంచి రూ. 9 ల‌క్ష‌లు స్వాహా చేసిన ప్ర‌బుద్ధుడు..

Viral Video : ఆస్పత్రి కారిడార్‌లో డాక్టర్ల డ్యాన్సులు..! సల్మాన్ ఖాన్ సిటీమార్‌ సాంగ్‌కి అదిరే స్టెప్పులు..