Matrimony Fraud: హైదారాబాద్‌లో మ్యాట్రిమోని మోసం.. యువ‌తి నుంచి రూ. 9 ల‌క్ష‌లు స్వాహా చేసిన ప్ర‌బుద్ధుడు..

Matrimony Fraud In Hyderabad: మారుతోన్న కాలానికి అనుగుణంగా నేరాలు కూడా మారుతున్నాయి. ఆన్‌లైన్ అందరికీ అందుబాటులోకి వ‌చ్చిన ఈ రోజుల్లో దానినే అస్త్రంగా మార్చుకుంటూ...

Matrimony Fraud: హైదారాబాద్‌లో మ్యాట్రిమోని మోసం.. యువ‌తి నుంచి రూ. 9 ల‌క్ష‌లు స్వాహా చేసిన ప్ర‌బుద్ధుడు..
Matrimony Crime

Matrimony Fraud In Hyderabad: మారుతోన్న కాలానికి అనుగుణంగా నేరాలు కూడా మారుతున్నాయి. ఆన్‌లైన్ అందరికీ అందుబాటులోకి వ‌చ్చిన ఈ రోజుల్లో దానినే అస్త్రంగా మార్చుకుంటూ కొంద‌రు నేర‌గాళ్లు మోసాల‌కు పాల్ప‌డుతున్నారు. చ‌దువుకున్న విద్యావంతులు కూడా మోస‌పోతుండ‌డం ఇక్క‌డ గ‌మ‌నార్హం. ముఖ్యంగా మాట్రీమోని పేరుతో ఇటీవ‌ల చాలా మోసాలు జ‌రుగుతున్నాయి. ఇందులో ఎక్కువ‌గా అబ్బాయిలు మోస‌పోయే సంఘ‌ట‌న‌లు చూశాం. కానీ తాజాగా ఓ యువ‌తి మ్యాట్రిమోని సైట్‌లో మోస‌పోయింది.
ఈ ఘ‌ట‌న హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే.. సికింద్ర‌బాద్‌లోని మారేడ్ ప‌ల్లికి చెందిన ఓ యువ‌తి ఇటీవ‌ల పెళ్లి సంబంధాల కోసం మాట్రిమోని సైట్‌లో రిజిస్ట‌ర్ అయ్యింది. ఈ క్ర‌మంలోనే ఓ వ్య‌క్తి ఆమెకు కాల్ చేశాడు. త‌న పేరు బ‌క్షి క్లిఫ‌ర్డ్ అని ప‌రిచ‌యం చేసుకున్న స‌ద‌రు వ్య‌క్తి.. పంజాబ్ రాష్ట్రానికి చెందిన వాడిన‌ని, వ్యాపార వ్య‌వ‌హారాల దృష్ట్యా స్కాట్లాండ్‌లో స్థిర‌ప‌డ్డాన‌ని చెప్పుకొచ్చాడు. ఇద్ద‌రి మాధ్య మాటలు పెరిగి పెళ్లి చేసుకుందామ‌నే ఒప్పందానికి కూడా వ‌చ్చారు. ఈ నేప‌థ్యంలోనే ఓ బ‌హుమ‌తిని స్కాట్లాండ్ నుంచి పంపిస్తున్న‌ట్లు తెలిపాడు. అనంత‌రం హైద‌రాబాద్ క‌స్ట‌మ్స్ అధికారిలా గొంతు మార్చి మాట్లాడి.. బ‌హుమ‌తిని అందించ‌డానికి మూడు ద‌ఫాల్లో ఆమె నుంచి మొత్తం రూ. 9 లక్ష‌లు అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నాడు. దీంతో మోస‌పోయాన‌ని తెలుసుకున్న యువ‌తి సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు విచార‌ణ మొద‌లు పెట్టారు.

Also Read: ప్రేమించడం..పెళ్లిచేసుకోవడం..చంపేయడం.. శాడిస్ట్ భర్త ఆగడాలు.. ఎక్కడో తెలుసా..?

Robbery In Hyderabad: హైద‌రాబాద్‌లో రెచ్చిపోయిన దొంగ‌లు.. ఐదు ఇళ్ల‌లో చోరీ.. భారీగా న‌గ‌దు, బంగారం అప‌హ‌ర‌ణ‌..

పరాయి వ్యక్తితో ఉన్నప్పుడు చూశాడని.. మరొకరి ప్రైవేట్ పార్ట్‌ని కత్తిరించింది ఓ మహిళ