Robbery In Hyderabad: హైదరాబాద్‌లో రెచ్చిపోయిన దొంగలు.. ఐదు ఇళ్లలో చోరీ.. భారీగా నగదు, బంగారం అపహరణ..
Robbery In Hyderabad: ఓవైపు కరోనా కారణంగా ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉంటే ఇదే అదునుగా భావించిన కొందరు దొంగలు రెచ్చిపోతున్నారు. లాక్‌డౌన్ కారణంతో రోడ్లన్నీ..
Robbery In Hyderabad: ఓవైపు కరోనా కారణంగా ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉంటే ఇదే అదునుగా భావించిన కొందరు దొంగలు రెచ్చిపోతున్నారు. లాక్‌డౌన్ కారణంతో రోడ్లన్నీ నిర్మానుష్యమవడం, కొందరు సొంతూళ్లకు వెళ్లిపోవడంతో దొంగలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఈక్రమంలోనే తాజాగా శనివారం హైదరాబాద్‌లోని పలు చోట్ల దొంగలు రెచ్చిపోయారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ పాతబస్తీ కుల్సుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి భారీ దొంగతనం జరిగింది. జియాగూడలో ఒకే రోజు ఏకంగా 5 ఇళ్లలో దొంగలు భీబత్సం సృష్టించారు. ఐదు ఇళ్లలో మొత్తం రూ. 20 లక్షల నగదు, 45 తులాల బంగారాన్ని దొచుకున్నారు. దీంతో విషయం తెలుసుకున్న ఇంటి యజమానులు లబోదిబోమన్నారు. దీంతో వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. బాధితుల సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. దోపిడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: కొవిడ్ సమస్యలతో కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ సతవ్ మృతి.. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు..
Selfie terror: సెల్ఫీ తీసుకోవడానికి ట్రాక్టర్ ఎక్కాడు.. అది పైలోకాలకు తీసుకువెళ్ళిపోయింది..
BCCI’s decision regarding Veda: వేదా కృష్ణమూర్తి విషయంలో బీసీసీఐ తీరు అమానవీయం!