ప్రేమించడం..పెళ్లిచేసుకోవడం..చంపేయడం.. శాడిస్ట్ భర్త ఆగడాలు.. ఎక్కడో తెలుసా..?

Sadist Husband : ప్రేమించానని వెంటపడి పెళ్లి చేసుకొని ఇద్దరు మహిళల ఉసురు తీశాడు ఓ రాక్షసుడు. రెండో భార్య కేసులో నిందితుడిని

ప్రేమించడం..పెళ్లిచేసుకోవడం..చంపేయడం.. శాడిస్ట్ భర్త ఆగడాలు.. ఎక్కడో తెలుసా..?
Sadist Husband

Sadist Husband : ప్రేమించానని వెంటపడి పెళ్లి చేసుకొని ఇద్దరు మహిళల ఉసురు తీశాడు ఓ రాక్షసుడు. రెండో భార్య కేసులో నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించిన పోలీసులకు మొదటి భార్య ఉదంతం తెలిసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలంలోని ఏనుగల్లు గ్రామానికి చెందిన కర్నె కిరణ్ ఆరేళ్ల క్రితం రైల్వేస్టేషన్‌లో ఒక మహిళను చూసి ప్రేమించానంటూ వెంటబడి పెళ్లి చేసుకున్నాడు. తరచూ కొట్టి వేధించడంతో మృతి చెందింది. ఈ విషయం బయటకు పొక్కకుండా శవాన్ని ఇంట్లోనే పూడ్చిపెట్టి దర్జాగా బయట తిరుగుతున్నాడు.

అనంతరం 2019లో మరో వివాహం చేసుకున్నాడు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా కమలాపురం మండలం ఉప్పల్‌కు చెందిన ఓడపల్లి అంజలీ బాయిని మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడు. రెండేళ్లుగా ఆమె ఇంటి వద్దే ఉండి, ఆరు నెలల క్రితం ఏనుగల్లుకు వచ్చాడు. అప్పట్నుంచీ ఇళ్లు అమ్మి డబ్బు తీసుకురావాలని భార్యను వేధించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే ఈనెల 13వ తేదీన తీవ్రంగా కొట్టడంతో ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 14వ తేదీన మరణించింది.

దీంతో కిరణ్‌ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో మొదటి భార్యను హత్య చేశానని, ఆమె శవాన్ని తాను ఉండే ఇంటి ఆవరణలోనే పాతిపెట్టానని చెప్పాడు. నిందితుడు కిరణ్‌ వ్యవహార శైలి కారణంగానే తల్లిదండ్రులు అతనికి వివాహం చేయకుండా వదిలేశారని తెలిసింది. మొదటి భార్య అనాథ అయ్యే సరికి ఆమె విషయం బయటికి రాలేదు. కిరణ్‌ వ్యవహార శైలి తెలుసుకున్న అప్పటి పర్వతగిరి ఎస్సై రమేష్‌నాయక్‌ ఎర్రగడ్డ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించినా అక్కడి నుంచి తప్పించుకున్నట్లు తెలిసింది.

Viral News: పాము ఉంద‌న్న‌ స‌మాచారంతో టెర్ర‌స్ పైకి వెళ్లిన స్నేక్ క్యాచ‌ర్.. మైండ్ బ్లాంక్

Robbery In Hyderabad: హైద‌రాబాద్‌లో రెచ్చిపోయిన దొంగ‌లు.. ఐదు ఇళ్ల‌లో చోరీ.. భారీగా న‌గ‌దు, బంగారం అప‌హ‌ర‌ణ‌..

కొవిడ్‌ సమస్యలతో కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ సతవ్ మృతి.. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు..