Viral News: పాము ఉంద‌న్న‌ స‌మాచారంతో టెర్ర‌స్ పైకి వెళ్లిన స్నేక్ క్యాచ‌ర్… మైండ్ బ్లాంక్

క్వీన్స్‌లాండ్‌లోని ఒక కుటుంబానికి త‌మ ఇంటి టెర్ర‌స్ పై పాము తిరుగుతున్న‌ట్లు అనుమానం వ‌చ్చింది. అస‌లే ఇంట్లో పిల్లలున్నారు. దీంతో ఎందుకైనా...

Viral News: పాము ఉంద‌న్న‌ స‌మాచారంతో టెర్ర‌స్ పైకి వెళ్లిన స్నేక్ క్యాచ‌ర్... మైండ్ బ్లాంక్
Snake Skins
Follow us
Ram Naramaneni

|

Updated on: May 16, 2021 | 12:51 PM

క్వీన్స్‌లాండ్‌లోని ఒక కుటుంబానికి త‌మ ఇంటి టెర్ర‌స్ పై పాము తిరుగుతున్న‌ట్లు అనుమానం వ‌చ్చింది. అస‌లే ఇంట్లో పిల్లలున్నారు. దీంతో ఎందుకైనా మంచిద‌ని పాము క్యాచ‌ర్ కు స‌మాచారం ఇచ్చారు. దీంతో త‌న టీమ్ తో క‌లిసి అక్క‌డికి చేరుకున్న స్నేక్ క్యాచ‌ర్.. ఇంటి టెర్ర‌స్ పైన అన్వేష‌ణ ప్రారంభించాడు. అయితే అక్క‌డ వారికి షాకింగ్ సీన్ క‌నిపించింది. కుప్ప‌ల కొద్దీ పాము కోశాలు చెల్లా చెదురుగా ప‌డిఉన్నాయి. వాటిని బ‌ట్టి అక్క‌డ కేవ‌లం ఒక పాము కాదు.. చాలా పాములు ఆవాసాన్ని ఏర్పాటు చేసుకున్న‌ట్లు గుర్తించారు. సుమారు 50 పాము కోశాలు అక్క‌డ ఉన్నాయి. స‌న్ షైన్ కోస్ట్ స్నేక్ క్యాచ‌ర్ సంస్థ స‌ద‌రు చిత్రాల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. సన్షైన్ కోస్ట్ స్నేక్ క్యాచర్స్ అనేది ఆస్ట్రేలియాలో పాము క్యాచర్ల యొక్క ప్రసిద్ధ బృందం. కాగా ఇదే టీమ్ గ‌తంలో ఓ ఇంటి డ‌స్ట్ బిన్ లో దాక్కున్న ప‌ది కేజీలు బ‌రువున్న‌ పైథాన్ ను చాక‌చ‌క్యంగా ప‌ట్టుకున్నారు. ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైర‌లయ్యింది. కాగా ఇళ్లలో, కార్యాల‌యాల్లో ప్ర‌వేశించిన ఎటువంటి పాముల‌ను అయినా తాము క్షేమంగా బ‌య‌ల‌కు తీస్తామ‌ని సంస్థ ప్ర‌తినిధులు తెలిపారు.

Also Read: వేదా కృష్ణమూర్తి విషయంలో బీసీసీఐ తీరు అమానవీయం!

దేశంలో మూడో రోజూ తగ్గిన కేసులు.. కానీ ఆందోళ‌న‌క‌రంగా మ‌ర‌ణాలు.. ఇవిగో వివ‌రాలు