AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stealing Eggs: కక్కుర్తి కానిస్టేబుల్.. కోడిగుడ్లు దొంగతనం చేసి దొరికిపోయాడు..ఎక్కడంటే..

Stealing Eggs: చేతివాటం ప్రదర్శించడంలో చిల్లర దొంగను మించిపోయాడు ఆ పోలీస్. సావాసదోషమో.. పాపం కోడిగుడ్ల కోసం కక్కుర్తో.. ఏదైతేనేమి.. ఆ కానిస్టేబుల్ చేసిన పనికి గట్టి షాక్ తగిలింది.

Stealing Eggs: కక్కుర్తి కానిస్టేబుల్.. కోడిగుడ్లు దొంగతనం చేసి దొరికిపోయాడు..ఎక్కడంటే..
Stealing Eggs
KVD Varma
|

Updated on: May 15, 2021 | 11:23 PM

Share

Stealing Eggs: చేతివాటం ప్రదర్శించడంలో చిల్లర దొంగను మించిపోయాడు ఆ పోలీస్. సావాసదోషమో.. పాపం కోడిగుడ్ల కోసం కక్కుర్తో.. ఏదైతేనేమి.. ఆ కానిస్టేబుల్ చేసిన పనికి గట్టి షాక్ తగిలింది. అధికారులు అతనిని సస్పెండ్ చేశారు. ఈ ఘటన పంజాబ్ లో జరిగింది. హెడ్ కానిస్టేబుల్ ప్రిత్పాల్ సింగ్ రోడ్డు పక్కన నిలిపి ఉన్న కోడిగుడ్ల బండి నుంచి కోడిగుడ్లను దొంగిలించాడు. ఆ బండి యజమాని వచ్చేసరికి చల్లగా అక్కడ నుంచి రోడ్డు దాటుతూ జారుకున్నాడు. అయితే, ఈ మొత్తం వ్యవహారం వీడియోలో చిత్రీకరించారు అక్కడ ఉన్నవారు. వెంటనే దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ దొంగతనం వీడియో వైరల్ అయిపొయింది. అది ఇటు తిరిగి, అటు తిరిగి పోలీసు ఉన్నతాధికారుల వద్దకు చేరింది. ఇంకేముంది మన కక్కుర్తి మాస్టార్ని పట్టుకుని సస్పెండ్ చేశారు. అతనిమీద డిపార్ట్మెంటల్ ఎంక్వయిరీ కూడా విధించారు.

పంజాబ్ ఫతేనగర్ సాహెబ్ పట్టణంలో దుకాణాలకు కోడిగుడ్లు సరఫరా చేసే రహ్డీ మామూలుగానే.. అక్కడ రోడ్డుపక్క తన కోడిగుడ్ల బండి పెట్టి దుకాణానికి కోడిగుడ్లు ఇవ్వడానికి వెళ్ళాడు. ఇంతలో అక్కడే ఉన్న ఈ హెడ్ కానిస్టేబుల్ ఆ బండి లోంచి గుడ్లను తీసుకుని తన యూనిఫాం జేబులో పెట్టుకున్నాడు. తరువాత రోడ్డు దాటి ఆటో ఎక్కాడు. ఈ వీడియోను తిరిగి పోస్ట్ చేసిన పంజాబ్ పోలీసులు ఆ పోలీసు కానిస్టేబుల్ ను సస్పెండ్ చేస్తున్నట్టు దానిలో పేర్కొన్నారు. పంజాబ్ పోలీసులు పోస్ట్ చేసిన ట్వీట్ ఇదే..

ఈ పోలీసు చేసిన కక్కుర్తి పనికి నెటిజన్లు కూడా చీవాట్లు పెడుతున్నారు. చక్కని ఉద్యోగం ఉండి ఇదేం పొయ్యేకాలం అంటున్నారు. కొంతమంది పట్టపగలు దొంగతనానికి ఇంకేమీ దొరకలేదా? అని కామెంట్ చేస్తున్నారు. చేసేది పోలీసు ఉద్యోగం.. చిల్లర దొంగతనం ఎందుకు బాబూ అని కొంతమంది ట్వీట్ చేశారు.

Also Read: Aadhar: కరోనాకు సంబంధించి ఆధార్ కార్డు లేకపోయినా ఇబ్బంది లేదు..ఆధార్ సంస్థ వెల్లడి

షాకింగ్ ఘ‌ట‌న‌.. అంత్యక్రియలకు తరలిస్తుండగా ఒక్క‌సారిగా లేచిన వృద్ధురాలు.. ఏం జ‌రిగిందంటే..