Viral News: కిర్రాక్ సీన్.. చేప మెడ‌లో వెడ్డింగ్ రింగ్.. మ్యాట‌ర్ ఏంటంటే…

మనుషులు పడేస్తున్న హానికర వ్యర్థాలు సముద్రంలో చేరడం వల్ల వన్యప్రాణులకు పెనుముప్పుగా మారింది. చాలావరకు జలచరాలు ప్లాస్టిక్ వ్యర్థాల కారణంగా....

Viral News: కిర్రాక్ సీన్.. చేప మెడ‌లో వెడ్డింగ్ రింగ్.. మ్యాట‌ర్ ఏంటంటే...
Fish Wedding Ring
Follow us
Ram Naramaneni

|

Updated on: May 15, 2021 | 7:47 PM

మనుషులు పడేస్తున్న హానికర వ్యర్థాలు సముద్రంలో చేరడం వల్ల వన్యప్రాణులకు పెనుముప్పుగా మారింది. చాలావరకు జలచరాలు ప్లాస్టిక్ వ్యర్థాల కారణంగా అంతరించిపోతున్నాయి. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఓ ఘటనను అందుకు ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవచ్చు. నార్ఫోక్ ద్వీపంలో ఓ చేప కనిపించిన తీరు చూస్తే.. చాలా ఆందోళన కలిగిస్తోంది. సముద్ర జీవులకు మానవులు వాడిపారేసిన వ్యర్థాలతో ఎంత ప్రమాదకరమో అర్థమవుతోంది. నార్ఫోక్ ద్వీపం పసిఫిక్ మహాసముద్రంలో ఆస్ట్రేలియా బాహ్య భూభాగంలో ఉంది. ఈ సముద్ర తీరంలో ఒక చేప మెడలో వెడ్డింగ్ బంగారపు ఉంగరం క‌నిపించడం ఆశ్య‌ర్యాన్ని క‌లిగించింది. ఫిబ్రవరి 2021లో సుషాన్ ప్రియర్ అనే రెసిడెంట్ కొన్ని చేపలను గుర్తించి..వాటి ఫొటోలను తన బ్లాగులో షేర్ చేశారు. ప్లాస్టిక్ తదితర వ్యర్థాలు సముద్రంలోని అడుగుభాగానికి చేరుకుంటాయి.

ఎవరో తమ వెడ్డింగ్ రింగును సముద్రంలో పొగొట్టుకోవ‌డంతో ఆ ఉంగరం సముద్రం అట్ట‌డుగు భాగానికి  చేరుకుంది. కాగా, ఈ చేప ఆహారం కోసం వెతికే క్రమంలో ఈ ఉంగరం దాని మెడకు చిక్కుకుని ఉండొచ్చని ప్రియర్‌ అభిప్రాయపడ్డారు. మొదట చేప మెడకు ఏదో చుట్టుకున్నట్టుగా కనిపించిందని.. తర్వాత దగ్గరగా వెళ్లి పరిశీలిస్తే.. అది మెరిసే విలువైన బంగారపు ఉంగరమని తెలిసిందన్నారు. దీంతో వెంట‌నే ఫోటోలు క్లిక్ చేసి.. సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. అవి కాస్తా వైర‌ల‌య్యాయి.  కాగా ఆస్ట్రేలియాకు చెందిన ఒక వ్య‌క్తి ఆ రింగ్ త‌నేదే అని, ఒకసారి ఆ స‌ముద్రంలో ఈత‌కు వెళ్లిన‌ప్పుడు దాన్ని పోగొట్టుకున్నాన‌ని చెప్ప‌డం కొస‌మెరుపు.

Also Read:  క‌రోనా నేప‌థ్యంలో తెలంగాణ ప్ర‌భుత్వం మ‌రో కీల‌క నిర్ణ‌యం.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల‌ను..

వారెవ్వా..చెట్టుమీదే ఐసోలేష‌న్.. ‘నీడ్ ఈజ్ ద మ‌ద‌ర్ ఆఫ్ ఇన్వెన్ష‌న్’..