షాకింగ్ ఘ‌ట‌న‌.. అంత్యక్రియలకు తరలిస్తుండగా ఒక్క‌సారిగా లేచిన వృద్ధురాలు.. ఏం జ‌రిగిందంటే..

ముంబైలో షాకింగ్ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. కరోనాతో మృతి చెందిందని వృద్ధురాలుకు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండ‌గా....

షాకింగ్ ఘ‌ట‌న‌..  అంత్యక్రియలకు తరలిస్తుండగా ఒక్క‌సారిగా లేచిన వృద్ధురాలు.. ఏం జ‌రిగిందంటే..
Old Women Covid
Follow us
Ram Naramaneni

|

Updated on: May 15, 2021 | 10:09 PM

ముంబైలో షాకింగ్ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. కరోనాతో మృతి చెందిందని వృద్ధురాలుకు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండ‌గా.. ఆమె ఒక్క‌సారిగా లేచి కూర్చుంది. దీంతో అక్క‌డ ఉన్న‌వారంతా ఖంగుతిన్నారు. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే.. ముధాలేలోని బారామతి గ్రామానికి చెందిన శకుంతల గైక్వాడ్‌ (76)కు మే 10వ తేదీన కరోనా సోకిందని తేలింది. దీంతో కుటుంబసభ్యులు కారులో ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే ఆస్పత్రిలో ఆమెకు బెడ్‌ లభించలేదు. దీంతో కారులోనే చాలాసేపు వేచి ఉన్నారు. ఈ సమయంలో బామ్మ శకుంతల అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఆమెలో చలనం లేకపోవడంతో కుటుంబసభ్యులు మృతి చెందిందని భావించారు. ఈ విషయాన్ని బంధువులకు తెలిపారు.

ఆమె అంత్యక్రియల ఏర్పాట్లు మొదలయ్యాయి. అంతిమయాత్ర చేస్తుండగా అకస్మాత్తుగా శకుంతల ఏడుస్తూ కళ్లు తెరిచింది. ఒక్కసారిగా కుటుంబసభ్యులు అవాక్కయ్యారు. బామ్మ చనిపోలేదు బతికే ఉందని భావించి ఒక్క క్షణం తర్వాత తేరుకుని ఆనందపడ్డారు. వెంటనే ఆమెను బారామతిలోని సిల్వర్‌ జూబ్లీ ఆస్పత్రిలో చేర్పించారు. బారామతిలోని ముధాలే గ్రామంలో ఈ సంఘటన జరిగిందని పోలీసు సంతోష్ గైక్వాడ్ ధృవీకరించారు. ప్రస్తుతం బామ్మ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ప్ర‌స్తుతం ఈ ఘ‌ట‌న స్థానికంగా చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

Also Read: కంటోన్నెంట్ బోర్డ్ కోవిడ్ ఆసుప‌త్రిలో ఉద్యోగాలు.. ఇంట‌ర్వ్యూ ద్వారా ఎంపిక‌..

కొత్త లక్షణాలతో పెరుగుతున్న కరోనా తీవ్రత.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. ఏపీ స‌ర్కార్ కీల‌క ఉత్త‌ర్వులు

శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..